17, నవంబర్ 2014, సోమవారం

పద్యరచన - 738

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

24 కామెంట్‌లు:

  1. తిన్నడె కన్నప్పాయెను
    మిన్నంటిన భక్తి గొలిచి మినుసిగవేల్పున్
    కన్నులను పీకి యిచ్చెను
    కన్నంత నె శివుని కండ్లు కార్చగ నీటిన్

    రిప్లయితొలగించండి
  2. తిన్నని భక్తిని జూడుమ!
    య న్నువుగా నతడు నిచ్చె నాసతి పతికిన్
    కన్నును దానుగ దనదియు
    కన్నం తనె నీ రుశివుని కంటిని నుండిన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఈ చిత్రం చూస్తుంటే
    చాగంటి వారు సదా ప్రవచించే
    నీకు మాంసాని క్కరు వొచ్చిందా - ఆ బోయవా డెంగిలి మాంసం తిన్నావని - శివుణ్ణధిక్షేపించే
    ధూర్జటి పద్యం గుర్తుకొస్తున్నది !

    నీకున్మాంసము వాంఛ యేని కఱవా? - నీచేత లేడుండఁగాఁ
    జోకైనట్టి కుఠారముండ ననల - జ్యోతుండ, నీరుండఁగా
    బాకం బొప్ప ఘటించి చేతి పునుక - న్భక్షింప కా బోయచేఁ
    జేకొంటెంగిలి మాంసమిట్లు దగునా? - శ్రీకాళహస్తీశ్వరా!

    రిప్లయితొలగించండి
  4. శివా - కంటికి కన్నే మందు గదా - పెట్టుకో
    మన్న తిన్నడే గదా నిజమైన భక్తుడంటే :

    01)
    ________________________________

    నీకున్ రక్తము గారుచుండె గనులన్ - నీ కళ్ళ కేమాయెనో
    నాకున్ సాధ్యమె దీని మాన్ప త్వరగా - నా కళ్ళ నే పెట్టినన్
    నా కాలిన్నిట పెట్టి యక్షుల, బ్రమథ - నాథానుసంధించెదన్
    చీకాకుల్విడి చింత దీరు నిక నో - శ్రీకాళహస్తీశ్వరా !
    ________________________________
    అనుసంధించు = అమర్చు

    రిప్లయితొలగించండి
  5. కపట మెరుగని కన్నప్ప కళ్ళు బీకె
    కంట తడిబెట్టగ శివుడు కరుణ కలిగి
    స్వార్ధ రహితమ్ముకావలె స్వామి భక్తి
    మోహ ముంచదేహమ్మున ముక్తిరాదు

    రిప్లయితొలగించండి
  6. కన్నప్పగించి చూడక
    కన్నప్పుడు రక్తమోడ కాలుని గనుచున్
    తిన్నడు కాలును గుర్తుగ
    కన్నప్పుడు బెట్టి నాడు కన్నప్పాయెన్.

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘సతీపతి’ అనవలసి ఉంటుంది. అక్కడ ‘ ఆ శంభునకున్’ అనండి. ‘కంటిని నుండిన్’ అన్నదాన్ని ‘కంటన్ రాలన్’ అనండి.
    ****
    వసంత కిశోర్ గారూ,
    శ్రీకాళహస్తీశ్వర శతక ప్రస్తావనతో మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘ యక్షుల, బ్రమథ - నాథానుసంధించెదన్’ అన్నచోట గణదోషం. ‘నాథా’ అన్న సంబోధనతో ‘అనుసంధించు’ శబ్దాన్ని అనుసంధించరాదు. అక్కడ ‘నా కాలి న్నిటఁ బెట్టి దేవ గిరిజానాథా యమర్తున్ శివా’ అందామా?
    ****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. కనులన్ బీకి త్రినేత్రుకే నొసగగా కష్టమ్మె తోచంగదో?
    మనమందా శివదేవు నిల్పితివొకో,మాకొక్క యాదర్శమో
    యన! కన్నప్పడ , భక్తితోగొలువ పంచాస్యుండు తానిచ్చు దీ
    వనలన్ పొంది నిరూపణమ్మొసగి నీ వంద్యుండుగా నైతివో!

    రిప్లయితొలగించండి
  9. గురువుగారు,
    వసంతకిశోర్ గారి పద్యములో
    కాలినిట అనిరావాల్నేమో కదా, రాదంటారా?

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    వసంత కిశోర్ గారి పద్యంలో ‘కాలిన్ + ఇట’ అన్నప్పుడు ‘కాలినిట’ అని సంధి సహజం..కాని ‘కాలిన్నిట’ అని ద్విత్వాన్ని వ్రాయడం పూర్వప్రయోగాల్లో ఉంది. ఇది ముఖ్యంగా పాదాదిని వస్తూ ఉంటుంది. ‘కాలి| న్నిట...’ అని. ఇటువంటి ప్రయోగాలు పోతనలో ఎక్కువ.

    రిప్లయితొలగించండి
  11. చక్షువు లిచ్చిన తిన్నని
    యక్షయమగు భక్తి గాంచి నాశీస్సులిడన్
    తక్షణమే ముక్తి నొసగి
    యక్షరుడా డింగరీని యక్కున జేర్చెన్

    రిప్లయితొలగించండి
  12. ఏక లవ్యుడు కన్నప్ప ఎరుక వారె
    వేలు యొకడుకన్నుయొకడు వేటు బెట్టి
    చాటి చెప్పిరి పెద్దల జాతి నీతి
    జన్మ తః వచ్చు జాతియె జాతి కాదు.

    రిప్లయితొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం... ‘వే లొకండు కన్ను నొకడు వేటుబెట్టి’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. లోకాల నేలు దొరకే
    వైకల్యమ్మని నేత్ర వితరణ జేయన్
    జేకొట్ట! నేత్ర దానపు
    శ్రీకారముఁ జుట్టె భువిని శ్రీకన్నప్పే!

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘వైకల్య మ్మనుచు నేత్రవితరణ జేయన్’ అనండి.

    రిప్లయితొలగించండి
  16. గురుదేవులకు ధన్యవాదాలు. అలా చేసినా యతిమైత్రి సరిపడదు.సవరించిన పద్యాన్ని దయతో పరిశీలించ ప్రార్థన.
    లోకాల నేలు దొరకే
    వైకల్యమ్మనుచు నేత్ర పరిహారమునన్
    జేకొట్ట! నేత్ర దానపు
    శ్రీకారముఁ జుట్టెభువిని శ్రీకన్నప్పే!

    రిప్లయితొలగించండి

  17. కన్నొకటే స్రవించ నొక కంటిని దీసి యమర్చి యుంచగా
    సన్నని ధారగా స్వజపు స్రావము నింకొక కంట గాంచియున్
    తిన్నడు పాదముంచి యట తీయుచు రెండవ కంటి నమ్ముతో
    నెన్నడు లేని చందమున నిచ్చెను కన్నులు స్వామిభక్తితో!

    రిప్లయితొలగించండి
  18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    నిజమే! యతిని నేను గమనించలేదు. మీ సవరణ బాగున్నది. సంతోషం!
    ****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. కన్నుగవ నుండి నీరము కారుచున్న
    శివుని విగ్రహమును గాంచి చింతనొంది
    చెంచు దొరకొడుకొక్కడు శీఘ్రముగను
    తనకనులను తీసి యమర్చ తలచి మదిని
    మొదటి కన్నుతీసి యమర్చె ముదముతోడ
    రెండవ కనుగ్రుడ్డు నమర్చు రీతి నఱసి
    గుర్తుగానుంచె కాలును గ్రుడ్డు దరిని
    అతని భక్తికి తా మెచ్చి యంబ పెనిమి
    టిచ్చె ముక్తిని కరమగు యిచ్చతోడ

    రిప్లయితొలగించండి
  20. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా !
    చక్కని సవరణలకు ధన్యవాదములు !

    శివా - కంటికి కన్నే మందు గదా - పెట్టుకో
    మన్న తిన్నడే గదా నిజమైన భక్తుడంటే :

    01అ)
    ________________________________

    నీకున్ రక్తము గారుచుండె గనులన్ - నీ కళ్ళ కేమాయెనో
    నాకున్ సాధ్యమె దీని మాన్ప త్వరగా - నా కళ్ళ నే పెట్టినన్
    నా కాలి న్నిటఁ బెట్టి దేవ గిరిజా - నాథా యమర్తున్ శివా
    చీకాకుల్విడి చింత దీరు నిక నో - శ్రీకాళహస్తీశ్వరా !
    ________________________________

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా !
    మరియొక సవరణ

    శివా - కంటికి కన్నే మందు గదా - పెట్టుకో
    మన్న తిన్నడే గదా నిజమైన భక్తుడంటే :

    01ఆ)
    ________________________________

    నీకున్ రక్తము గారుచుండె గనులన్ - నీ కళ్ళ కేమాయెనో
    నాకున్ సాధ్యమె దీని మాన్ప త్వరగా - నా కళ్ళ నే పెట్టినన్
    నా కాలిన్నిట బెట్టి యక్షుల నిదా - నంబున్నియోగించెదన్
    చీకాకుల్విడి చింత దీరు నిక నో - శ్రీకాళహస్తీశ్వరా !
    ________________________________
    నియోగించు = అమరించు

    రిప్లయితొలగించండి
  23. వసంత కిశోర్ గారూ,
    మీ సవరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి