5, నవంబర్ 2014, బుధవారం

పద్యరచన - 726

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి

11 కామెంట్‌లు:

  1. గుడిలో లక్షల జ్యోతులు
    మడితోనంటించి నారు మాయంబయ్యెన్
    వడిగా చీకటులెల్లను
    కడు సుందరమైన దివ్య కాంతులు చిమ్మెన్

    రిప్లయితొలగించండి
  2. కనుల విందైన దీపాలకాంతి తోడ
    మృడుని గుడులన్ని ధగధగ మె ఱ యు చుండు
    దనర కార్తీక పూర్ణిమ దినము నాడు
    వీ క్ష జేయంగ జాలవు వేయి కనులు

    రిప్లయితొలగించండి
  3. శ్వేతవర్ణమందు శృంగార భరితమౌ
    వర్ణరాశి పుట్టు వానవేళ
    మూడు రంగులిచట ముచ్చటతోఁ గూడి
    మోహవర్థి యెఱుపు మోవి పులిమె.

    రిప్లయితొలగించండి
  4. ప్రమిదలందు వత్తి ప్రమదలిడిరి, నూనె
    వోసి, మిగుల భక్తి యుట్టిపడగ
    దీపపంక్తులిచట తీర్చినారు కనుల
    విందులౌట నిజము పృథ్వికెల్ల.

    రిప్లయితొలగించండి
  5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మొదటి పద్యం సందర్భం అర్థం కాలేదు...

    రిప్లయితొలగించండి
  6. గురువుగారు,
    ధన్యవాదాలు.
    మొదటి పద్యం తాంబూలం పద్యరచనకు రాసినది. పొరబాటున అక్కడా ఇక్కడా కూడా పోస్ట్ అయింది. వరసగా వారం రోజులవి వ్రాయడంలో చిన్న పొరబాటు.

    రిప్లయితొలగించండి
  7. పడతు లంత జేరి పారవశ్వమునొంది
    దివ్వెలవెలిగించ దీక్షతోడ
    దీపకాంతులుకడు దేదీప్య మానమై
    విషధరుగుడులెల్ల వెలుగు చుండె

    రిప్లయితొలగించండి
  8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. దీపములను వెలిగించగ
    పాపమ్ములు తొలగిపోవు పౌర్ణమి దినమున్
    శ్రీపతి శివులను గొలుచుచు
    దీపికలట పెట్టినారు తీరుగ గుడిలో

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. దీపము దైవ స్వరూపము
    పాపాలను దరిమి కొట్టు ప్రమిదను వెలుగన్!
    గోపురముల మెరిపించుచు
    చూపరులకు దైవ సేవ సూత్రముఁ దెలుపున్!

    రిప్లయితొలగించండి