7, నవంబర్ 2014, శుక్రవారం

నిషిద్ధాక్షరి - 18

కవిమిత్రులారా,
అంశం- పద్మవ్యూహంలో అభిమన్యుఁడు.
నిషిద్ధాక్షరాలు - పవర్గాక్షరాలు (ప,ఫ,బ,భ,మ)
ఛందస్సు - మీ యిష్టం వచ్చింది.

29 కామెంట్‌లు:

  1. జలజాకార రచనలో
    సులువుగ దూరిన కిరీటి సుతుడా కురుసే
    నల చెండాడుచు నొంటిగ
    నిలువ నిరాయుధుని జేసి నేలకు దెచ్చెన్

    రిప్లయితొలగించండి
  2. సులువుగ గిరీటి సూనుడు
    జలజాకర గుహకు నేగ శత్రువు లచట
    న్నిల జెండాడగ నొక్కని
    నిలువగ నిక నీడలేక నిలువున గూ లెన్

    రిప్లయితొలగించండి
  3. ఒక్కడు విల్లుఁ ద్రుంచె, యిక నొక్కడు సారధిఁ గూల్చెఁ, జూడ వే
    రొక్కడు వాజిఁ ద్రోసెఁ, ఘనుడొక్కడు తేరును గొట్టె, చాటుగా
    నొక్కడు వీరుడై తొడుగునూడగఁ జేసెను, కత్తిఁ ద్రెంచె, లే
    డొక్కడు తోడు వచ్చుటకు నొక్కడె యర్జున నందనుండటన్!!

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అసహాయ శూరుడు - అవక్రపరాక్రముడు - అభిమన్యుడు :

    01)
    ____________________________

    చిన్న వయసున నేర్చుట - ఛేదనంత
    వెనుక నెవ్వరు లేకున్న - వెరువకుండ
    సరసిజ రచన జొచ్చిల్లి - సాహసుండు
    ఘోర విగ్రహ నిగ్రహ - వీరుడయ్యు
    వందె నాజిని నర్జున - నందనుండు !
    ____________________________
    విగ్రహము = యుద్ధము
    వందు = చచ్చు

    రిప్లయితొలగించండి
  5. జిగురు వారి స్ఫూర్తితో కొనసాగింపు :

    01అ)
    ____________________________

    చిన్న వయసున నేర్చుట - ఛేదనంత
    వెనుక నెవ్వరు లేకున్న - వెరువకుండ
    సరసిజ రచన జొచ్చిల్లి - సాహసుండు
    ఘోర విగ్రహ నిగ్రహ - వీరుడయ్యు
    వందె నాజిని నర్జున - నందనుండు

    విల్లు ద్రుంచగ నొక్కండు - వెనుక నుండి
    సారథిని గూల్చ నొక్కండు - చాటు నుండి
    వాజి గొట్టగ నొక్కండు - వాలు జూచి
    తేరు ద్రోయగ నొక్కండు - నోర నుండి
    తొడుగు నూడ్చగ నొక్కండు - తొందరగను
    కత్తి ద్రెంచగ నొక్కండు - కరుణ వీడి
    దుష్ట దుర్యోధ నాదులు - ద్రోహచింత
    కుర్రవానిని గూల్చగ - గూడి యకట
    యొంటి వాని, నాయుధహీను - నొక్క సారి
    దాడి జేసిన వైరుధ్య - తగవు నందు !
    ____________________________
    వైరుధ్యతగవు = ప్రతికూల యుద్ధము(అధర్మయుద్ధము)

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    ప్రశస్తమైన పూరణతో అలరింపజేశారు. అభినందనలు.
    ‘విల్లుఁ ద్రుంచె నిక...’ అనండి.
    *****
    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మల్లెలవారిపూరణలు
    కోకనదరీతి వ్యూహాన్ని కూర్చి గురుడు
    యుద్ధ లాఘవ ధీరత యోధనాన
    నుండ నర్జున సుతుడందు నున్నసేన
    కూల్చె చివరకు కుటిలత కూల్చె నతని
    2.శ్వేతవాహనసూనుడు విధిగ వెడలి
    వ్యూహరచనను ఛేదించి యోధతతికి
    చిక్కుల౦ద౦గ సేనల జీల్చి తుదకు
    కుటిల కౌరవ యోధుల కూలె గాదె

    రిప్లయితొలగించండి
  8. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    వనజ రచనలో జొచ్చె నర్జున తనయుడు
    యొక్కడే నని యొనరించె నొడ్డగిల్లి
    కుటిల రీతిని కౌరవుల్ కూడియతని
    నేల గూల్చిరి వీరుడై నిచ్చ నిలిచె

    రిప్లయితొలగించండి
  9. కంజ రచనను ఛేదించి కఱ్ఱి సుతుడు
    శత్రు సేనల నెదురొడ్డి సంహరించె
    నీరు గారెను కురుసేన వీరు నిగని
    చిన్న వాడని జూడక చేరువయ్యి
    దాడి జేయుచు గూల్చెను దండు గాను

    రిప్లయితొలగించండి
  10. అర్జునసుతుడరిగె నరవింద రచనలో
    వాని యుద్ధవిద్య వరుస జూసి
    వైరులెల్ల వణికి వానినొక్కని జేసి
    చావగొట్టినారు చంటివాన్ని!

    రిప్లయితొలగించండి
  11. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    తొలిప్రయత్నమైనా ప్రశంసనీయమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘చూలునే’ అన్నది అన్వయించడం లేదు. ‘చూడగా’ అంటే సరిపోతుందేమో?
    ‘వ్యూహము’నకు ‘ఊహము’ అన్నారు. అక్కడ ‘చక్రరచనను’ అనండి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు శంకరయ్య గార్కి ధన్యవాదములు.
    తమ సూచించిచనటు మార్చడమైనది
    చూడగా ఘనుడర్జున సుతుడు వాడు
    చక్ర రచనను సాధించి చరిత నిలిచె
    దిగ్గజాలంతయు కలసి దిగువ జారి
    క్రూర రీతిని కూర్చిరి కుటిల నీతి

    రిప్లయితొలగించండి
  13. సుందరా కారు డౌ పార్థు సుతుడు, వేగ
    ద్రోణు వ్యూహ రచనకును తూట్లు వేసి
    చొచ్చె నాహవ ధాత్రికి స్రుక్క సేన
    శాంతనవుడాతనిని కాంచి సంతసించె
    నతని ధాటికి కౌరవు లాగలేక
    దుష్ట చర్యతో నవ్వీరు త్రుంచి రచట

    రిప్లయితొలగించండి
  14. సవ్యసాచి సుతుడు శౌర్య కిశోరుండు

    జలజ రచనను ఛేదించి జంకు లేక

    కౌరవుల నొక్కడే వంచె కలసి వారు

    వధను గావించి రొంటరి వాన్ని జేసి

    రిప్లయితొలగించండి
  15. విజయుని వారసుడనిలో
    నజేయుడని కౌరవేయులల్లాడుచు నా
    టి జలరుహ వ్యూహ తటిని
    విజిగీషన గూల్చి రతని విద్రోహగతిన్!

    రిప్లయితొలగించండి
  16. కె.ఈశ్వరప్ప గారిపూరణలు
    కలుషిత యుద్ధ తంత్రతకె కౌరవ సేనలు వ్యూహముంచగా
    నిలువక సవ్యసాచిసుతనేరుగ వైరుల ద్రుంచ నే౦చియే
    నలజడి చేత సాహసిగ నంటగ వారవినీతి చేతనే
    తులువలు చావ గొట్టిరట దుష్టత నిష్టన ధర్మ దండనై
    వ్యూహ రచన లెన్నొ యుంచిన కౌరవుల్
    సవ్యసాచి సుతుడు సాహసాన
    నక్క జిత్తు లన్ని లెక్కసేయక వెళ్లి
    అసువువీడుటాయెనాజి నందు

    రిప్లయితొలగించండి
  17. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    అర్జునసుతు న్నిరాయుధు డనగ జూచి
    సలిలజ వ్యూహ రచనను చంపివేయ
    నౌర చేతు లెట్లాడెనో కౌరవులకు
    నరయ ధర్మహీనుల కెట్లు కరుణ కలుగు

    రిప్లయితొలగించండి
  18. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో ‘పార్థు’ అని నిషిద్ధాక్షరాన్ని ప్రయోగించారు. ‘సుందరాకారుఁ డర్జును సుతుఁడు...’ అనండి.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదం ఆటవెలది, మిగిలినవి తేటగీతి. ‘సవ్యసాచి తనూజుండు శౌర్యధనుఁడు’ అందామా?
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విజిగీషను..’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో వ్యూహ‘ముం’చగా .. అని నిషిద్ధాక్షరాన్ని ప్రయోగించారు. సవరించండి.
    *****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చం‘పి’వేయ... అని నిషిద్ధాక్షరాన్ని ప్రయోగించారు. ‘కలచివేయ’ అందామా?

    రిప్లయితొలగించండి
  19. రాజాజ్ఞన్ గని చుట్టుఁజుట్టికడురౌద్రక్రూరచేతస్కులై
    తేజోశూన్యులు కౌరవాగ్రజులు విద్వేషక్రియాసక్తతన్
    రాజీవాక్షుని ధౌర్యసాహసకళల్ రంజిల్లునవ్వీరున
    య్యజిన్ కొట్టఁగఁగూలెనర్జునసుతుండత్యంత దైన్యస్థితిన్

    రిప్లయితొలగించండి
  20. శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారములు

    పొరపాటును సూచించిన మీకు కృతజ్ఞతలు

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    విజయుని వారసుడనిలో
    నజేయుడని కౌరవేయులల్లాడుచు నా
    టి జలరుహ వ్యూహ తటిని
    విజిగీషను గూల్చి రతని విద్రోహగతిన్!

    రిప్లయితొలగించండి
  22. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీగురుభ్యోనన:

    విజయుని సుతుడంత విల్లును దాల్చి
    నిజ యోధుడై నిల్చె, నీరజ యుక్తి

    చేదించి లో జొచ్చి చెండాడి నంత
    రోదించి లెల్లరు రుద్రుడై నిలువ


    ఒంటరి జోదుం డగుచున్
    వింటిని సారించి విరచె వీరుల నెల్లన్
    తుంటరి యుక్తులతో వె
    న్నంటుచు కూల్చిరి శతృవులు న్యాయ విహీనుల్.

    రిప్లయితొలగించండి
  24. శ్రీపతి శాస్త్రి గారూ,
    ద్విపద, కందపద్యాలలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    "చక్రవ్యూహ సువేశితున్ దతధనుర్జ్యాసక్త నారాచ ధా
    రాక్రాంతాంచిత శత్రు నిర్జిత యతద్ద్రాఘిష్ఠ సన్నద్ధ యు
    ద్ధ క్రీడావిహరద్ఘనవ్రతయుతుం దచ్ఛౌరి స్వస్రీయుఁడౌ
    నా క్రీడిద్రుహుఁ గౌరవుల్ గుటిల తంత్రానన్విఘాతించిరే!"

    రిప్లయితొలగించండి
  26. గుండు మధుసూదన్ గారూ,
    శంకరాభరణం బ్లాగుకు ఆభరణం అనదగిన కవులలో మీరొకరు. శబ్దాలపై సంపూర్ణాధికారం, లాక్షణికమైన కవితాధార, మనోహరభావవిన్యాసం మీ సొత్తులు! అద్భుతమైన మీ పూరణను ఈకొద్ది సమయంలో ఎన్నిసార్లు చదువుకొన్నానో! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. గురువుగారికి సమస్సులు. తప్పిదమును మన్నింప ప్రార్థన. 4వ పాదమున "శతృవులు" అన్న పదమును తప్పుగా ప్రయోగించినాను. "శత్రువులు" సరియైన పదము.
    సవరించిన పద్యము.

    ఒంటరి జోదుం డగుచున్
    వింటిని సారించి విరచె వీరుల నెల్లన్
    తుంటరి యుక్తులతో వె
    న్నంటుచు కూల్చిరి కఠినులు న్యాయ విహీనుల్.

    రిప్లయితొలగించండి