27, నవంబర్ 2014, గురువారం

పద్యరచన - 748

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

11 కామెంట్‌లు:

 1. అల్లూరిని పట్టించిన
  తెల్లోళ్ళ కు పండగౌను తెలుగులకేమో
  నల్లని చీకటి కమ్మును
  చెల్లవు మీ నాటకములు ఛీ! యప్రాచ్యా !

  రిప్లయితొలగించండి
 2. పట్టి యిచ్చిన నల్లూరి నెట్టు లైన
  నిత్తు పదివేల రూప్యము లిపుడె యనుచు
  బ్రకట నగలదు చూడుడు పటము మీద
  యెవరి వశముగా నున్నవో యేమొ ? సామి

  రిప్లయితొలగించండి
 3. తెలుగు గడ్డన పుట్టిన తేజ మతడు
  మాతృ భక్తికి యల్లూరి మారు పేరు
  విప్లవ గళము నిప్పిన వీరు డతడు
  కండ జూపి తెల్ల దొరల గుండె నిలిపె
  పట్టు వానికి పదివేలు పగిడి యుంచి
  దరువు లేసిరి యాంగ్లులు పరువు వీడి

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘తెల్లోళ్ళు’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘గళము విప్పిన’ అనండి.

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  వందేమాతరం :

  01)
  ___________________________

  తల్లి దాస్యము విడిపింప - బల్లిదుండు
  విల్లు పట్టిన సర్కారు - తల్లడిల్లి
  రూకల పదివేల నొసగ - లోకు లంత
  పట్టి యిత్తురె ప్రచండ - భాను తేజు
  డయిన రామరాజును బట్ట - టముకు వేయ
  ___________________________

  రిప్లయితొలగించండి
 6. తప్పించుకుఁ దిరిగె ననుట
  నొప్పని యల్లూరి వారలొక్కరె యెగయన్!
  గొప్పలుఁ బోయెడు తెల్లలు
  చప్పున గూల్చిరి కిశోర సత్త్వము జడుపన్!

  రిప్లయితొలగించండి
 7. వీరుడై నట్టి యల్లూరి పెంపు జూసి
  తెల్ల వారల గుండెలు జల్లు మనగ
  పట్టియిఛ్చిన పదివేలు బహుమతంచు
  ప్రకట నిచ్చిరి గెజిటులో భయముతోడ

  రిప్లయితొలగించండి
 8. విల్లుని బట్టిన వీరుని
  యల్లూరిని బట్టి నీయ నభిహారికమున్
  చెల్లింతుము పది వేలని
  జిల్లా యధికారి తెలియ జేసెను గెజిటెన్!!!

  అభిహారికము = కానుక

  రిప్లయితొలగించండి
 9. వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. మన్యంబందున తెల్లవారి కఠినంబైనట్టి చట్టంబు లం
  దన్యాయం బుల జూచి వాటి నెదిరించంగన్ మహా యుద్యమం
  బన్యోన్యంబుగ మన్యమందలి జనంబైక్యంబు గా జేయగా
  నా న్యక్కారము నోర్వకాయధములయ్యల్లూరి జంపించెగా

  రిప్లయితొలగించండి
 11. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ శార్దూలప్రయత్నం ప్రశంసనీయం. చక్కగా ధార కొనసాగింది. అభినందనలు.

  రిప్లయితొలగించండి