27, నవంబర్ 2014, గురువారం

న్యస్తాక్షరి - 16 (త్రా-గు-బో-తు)

అంశం- మద్యపాన నిరసనము.
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘త్రా - గు - బో - తు’ ఉండాలి.

27 కామెంట్‌లు:

  1. త్రాగ బోకుము మద్యమ్ము తగదు నీకు
    గుర్తు రాదేల ఇల్లాలి గోడు నీకు
    బోధ పడదేమిరా నీకు బుద్ధి లేద
    తుచ్చ మైనదీ వ్యసనంబు తొఱఁగు మీవు

    రిప్లయితొలగించండి
  2. త్రాగ వలదుర యెప్పుడు ద్రా గవలదు
    గురువు చెప్పిన మాటలు గుర్తె రిం గి
    బోధ పడలేద ? మఱి నీకు , బుద్ధి గలిగి
    తుచ్ఛ మైనట్టి దీనికి దూర ముండు

    రిప్లయితొలగించండి
  3. త్రాగి తిరుగుచు సతతము తగవులకుది
    గుచును వంశ గౌరవమెప్డు కూల జేయ
    బోకు, మాస్తులన్నియు గోలు పోయి వేగ
    తుదకు నప్పుల తోడను బ్రదుక వలయు

    రిప్లయితొలగించండి

  4. త్రాటి మాను క్రింద
    గుర్రు బెట్టి నిదుర
    బోయిన వచ్చు కిక్కు
    తుక్కస్ కిక్కు వోలె !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. త్రాగుడన్నది మానక త్రాగుచున్న
    గుల్ల యగుగాదె యొళ్ళు నీ యిల్లుగూడ
    బోధ లనువిని మార్చుకో బుద్ధి నీవు
    తుచ్ఛమైనట్టి యలవాటు తొలగ మేలు.

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తప్పు + ఔను’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తప్పుగాదె’ అనండి. అలాగే ‘ఖాయము + ఇల్లు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. కనుక ‘ఖాయమే యిల్లు’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    జిలేబీ గారూ,
    _/\_

    రిప్లయితొలగించండి
  7. త్రాగెడిది గరళంబైన త్రాతను గని
    గుండె నిబ్బరమున గౌరి గ్రోలు మనియె!
    బోఁకిఁ బట్టుకు సారాను తాకి నంత
    తుచ్ఛునిగఁ జూతురే గాని మెచ్చరెవరు!

    రిప్లయితొలగించండి
  8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువులకు నమస్సులు. మీ అమూల్యమైన సలహాలకు కృతజ్ఞతలు
    తే.గీ. త్రాగ మద్యము మితిమీరి తప్పుగాదె
    గుల్ల చేయుట ఖాయమే యిల్లు ఒళ్లు
    బోసి కుండ కల్లును త్రాగ బొంద మిగులు
    తుక్కు చేయనేలబతుకు తూట్లు బడగ

    రిప్లయితొలగించండి
  10. పూజ్యులుగురుదేవులు శ౦కరయ్య గారికి వ౦దనములు

    త్రాగమద్యమ్ము మైకమ్ము తప్పక కలు
    గు మతిబోవ నీవు నేరములు జేయ
    బోయెదవు శిక్ష లిడును ప్రభుత్వ మపుడు
    తులువ యౌదువీ వ్యసనము వలదు నీకు

    రిప్లయితొలగించండి
  11. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    తాగుబోతు కన్నా గుడ్డివాడే నయం గదా :

    01)
    ___________________________

    త్రాగుబోతగు పతి కన్న- తరుణు లెపుడు
    గుడ్డి వానినె భర్తగా - కోరుకొనును
    బోకు వాడగు పతినేల - బోంట్లు కోరు ?
    తుచ్ఛపానము మానుడో - తులువలార
    ___________________________

    రిప్లయితొలగించండి
  12. కె.ఈశ్వరప్ప గారి పూరణ

    త్రాగ వాగుడు పుట్టించు రోగములను
    గుట్టుగున్నట్టి సత్యముల్ పట్టు దప్పు
    బోధి సత్వుని కైనను బుద్ధి మాన్చు
    తుచ్చమైనట్టి వ్యసనము తుదకు జంపు

    రిప్లయితొలగించండి
  13. త్రాగ మద్యము చెడిపోవు తనువు మనసు
    గుండె మండించి బ్రతుకంత గుల్ల జేయు
    బోధ పడకున్న బ్రతుకంత రోదనగును
    తుచ్చమైనట్టి వ్యసనమ్ము త్రోయ వలయు!!!

    రిప్లయితొలగించండి
  14. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ

    త్రాగుబోతులు తమ యాస్తి తగులబడగ
    గుల్లకాగ నారోగ్యము కుములుచుంద్రు
    బోధ సేయుట మానె ప్రభుత్వ మకట
    తుదకు బెల్టు షాపుల నెల్ల మొదలు పెట్టె

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    తాగుబోతు కన్నా గుడ్డివాడే నయమంటూ చేసిన మీ పూరణ బాగుంది.

    అయితే, 'తరుణులెపుడు' అన్నప్పుడు, 'కోరుకొంద్రు' అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  16. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

    త్రాగు బోతులు మద్యము త్రాగి త్రాగి
    గుల్ల జేయుదురిళ్ళను గుండె లదర
    బోరు మనియెడి యిల్లాళ్ళ పోరు వినరు
    తుచ్ఛమైనట్టి వ్యసనాన్ని తొలగ మేలు.

    రిప్లయితొలగించండి
  17. త్రాగువాని మాటలవియు తప్పుచునుండు
    గుణములన్నియు చెడునుగా కుదురునుండ
    బోదు-ఆరోగ్యమే చెడు పూర్తిగాను
    తుచ్ఛమైనదీ యలవాటు-దూరమగుడు

    త్ర్రాగినంతట పిదపయె తాను చెడియు
    గుబులు నందించు నందరన్ గూటివారి
    బోటి తాగిన సంఘాన పూర్తి చెడును
    తులయె లేదుగ నింతకు తుచ్ఛమదియ

    త్రాగు వానిమెదడు మొద్దుతనము నందు
    గురిగ కాలేయ మదియౌన కోలుకొనని
    బోలునయ్యెడి రోగాన కూలబడును
    తులువ యనుచును పేరొంది విలువ పోవు

    త్రాగి మదిరను శుక్రుడు తాల్మిలేక
    గురువునై యుండి పాపాన కూడుకొనియె
    బో!మదిరదియె తా మేలు పూర్తినిడదు
    తుదిగ సంఘ మందునను వే దుష్టుడగును

    రిప్లయితొలగించండి
  18. త్రాడు పూసల నమ్మియు తాగువారు
    గుర్తులేకయె నిట్టిట్టు గునుకు వారు
    బోవ నెందెందు కానక పోవు వారు
    తుచ్ఛమైనట్టి సుఖమున తూలుచుంద్రు

    రిప్లయితొలగించండి
  19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘గు మతిబోవగా నీవు నేరములు జేయ ’ అనండి.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోరుకొంద్రు’ అన్న అందవోలు విద్యాసాగర్ గారి వ్యాఖ్యను గమనించండి.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అందవోలు విద్యాసాగర్ గారూ,
    ధన్యవాదాలు.
    బాగున్నారా? ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు మీ పేరు బ్లాగులో కనిపించింది!
    ****
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వ్యసనాన్ని’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘వ్యసనమున్’ అనండి.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నది. అభినందనలు.
    మొదటి పూరణలో ‘తప్పుచునుండు’ అన్నప్పుడు గణదోషం. ‘తప్పుచుండు’ అనండి.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! ధన్యవాదములు !

    విద్యాసాగర్ గారికి ధన్యవాదములతో

    తాగుబోతు కన్నా గుడ్డివాడే నయం గదా :

    01)
    ___________________________

    త్రాగుబోతగు పతి కన్న- తరుణు లెపుడు
    గుడ్డి వానినె భర్తగా - కోరుకొంద్రు
    బోకు వాడగు పతినేల - బోంట్లు కోరు ?
    తుచ్ఛపానము మానుడో - తులువలార
    ___________________________

    రిప్లయితొలగించండి
  21. పూజ్యులుగురుదేవులు శ౦కరయ్య గారికి వ౦దనములు

    మీసూచనకు ధన్యవాదములు సవరించిన పద్యము

    త్రాగమద్యమ్ము మైకమ్ము తప్పక కలు
    గు మతిబోవగా నీవు నేరములు జేయ
    బోయెదవు శిక్ష లిడును ప్రభుత్వ మపుడు
    తులువ యౌదువీ వ్యసనము వలదు నీకు

    రిప్లయితొలగించండి
  22. త్రాగి తందనా లాడుట తప్పు టంచు
    గుణవతి పెనిమిటికి మంచి గుణము దెలుప
    బోధ పడినట్టి యా హితబోధ వలన
    తచ్ఛమని వీడె నతడా దురలవాటు!

    రిప్లయితొలగించండి
  23. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘తప్పటంచు’ అనండి. ‘తుచ్ఛము’ టైపాటువల్ల ‘తచ్ఛము’ అయింది. ‘దురలవాటు’ అనరాదు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నా అది తప్పే. అక్కడ ‘దుర్వ్యసనము’ అనండి.

    రిప్లయితొలగించండి
  24. గురు దేవులకు వందనములు, టైపాట్లు, దురలవాటు అనే పదం మీరు సూచించినట్లు సవరిస్తూ...

    త్రాగి తందనా లాడుట తప్పటంచు
    గుణవతి పెనిమిటికి మంచి గుణము దెలుప
    బోధపడినట్టి యా హితబోధవలన
    తుచ్ఛమనుచు వీడెనత డా దుర్వ్యసనము!

    రిప్లయితొలగించండి
  25. గురు దేవులకు వందనములు, టైపాట్లు, దురలవాటు అనే పదం మీరు సూచించినట్లు సవరిస్తూ...

    త్రాగి తందనా లాడుట తప్పటంచు
    గుణవతి పెనిమిటికి మంచి గుణము దెలుప
    బోధపడినట్టి యా హితబోధవలన
    తుచ్ఛమనుచు వీడెనత డా దుర్వ్యసనము!

    రిప్లయితొలగించండి
  26. గురు దేవులకు వందనములు, టైపాట్లు, దురలవాటు అనే పదం మీరు సూచించినట్లు సవరిస్తూ...

    త్రాగి తందనా లాడుట తప్పటంచు
    గుణవతి పెనిమిటికి మంచి గుణము దెలుప
    బోధపడినట్టి యా హితబోధవలన
    తుచ్ఛమనుచు వీడెనత డా దుర్వ్యసనము!

    రిప్లయితొలగించండి
  27. గురు దేవులకు వందనములు, టైపాట్లు, దురలవాటు అనే పదం మీరు సూచించినట్లు సవరిస్తూ...

    త్రాగి తందనా లాడుట తప్పటంచు
    గుణవతి పెనిమిటికి మంచి గుణము దెలుప
    బోధపడినట్టి యా హితబోధవలన
    తుచ్ఛమనుచు వీడెనత డా దుర్వ్యసనము!

    రిప్లయితొలగించండి