13, నవంబర్ 2014, గురువారం

పద్యరచన - 734

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

  1. చందమామ పుస్తకమున చదివినాము
    చిన్నతనమందునీకధ నెన్నిసార్లు
    విక్రమార్కుడు ధైర్యము విడవకుండ
    పట్టుదలతో శవముదించి చెట్టునుండి
    భుజముపైవేసి కొనితాను మోయుచుండ
    నతని మౌనభంగము జేయ కతను చెప్పి
    యంతమందున భేతాళుడడుగు ప్రశ్న
    తెలిసి యుత్తరమిడనిచో తెగును శిరము
    వేయి వ్రక్కలుగాయన విప్పి నోరు
    తా సమాధానమిడుచుండు తగిన రీతి
    మౌనమువిడ భేతాళుడు మాయమౌను

    రిప్లయితొలగించండి
  2. చిత్ర మయ్యది జూడగ చిత్త మందు
    వచ్చె ననుమాన మోయమ్మ !భట్టి విక్ర
    మార్కు డేకార్య సిద్ధికై మఱి శ వమును
    మోసికొని పోవు చుండెనో రాశి ! యడుగు

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వచ్చి
    చెట్టుపై నుండి శవాన్ని దించి భుజాన వేసుకొని
    మౌనంగా వెళ్ళ సాగాడు !
    అప్పుడు శవం లోని భేతాళుడు
    ఓ విక్రమార్క మహారాజా************
    అంటూ చెప్పే
    భేతాళ కథలు :

    01)
    _________________________________

    అందజేసెను జనుల కా - నందమొదవ
    నంద మైనట్టి కథలెన్నొ - చందమామ
    విందు జేయగ నెన్నెన్నొ - వీరమలరు
    చిత్ర చిత్రాతి చిత్ర , స - చిత్ర కథలు !

    విక్రమార్కుని భుజముపై - విశ్రమించి
    వీర భేతాళు డదె జెప్పు - వింత కథలు
    తనివి తీరదు వేవేలు - వినిన గాని
    శైశవము నందె చదివి నే - చకితుడైతి
    మనసు మురియును వినినంత - మరల మరల !
    _________________________________
    తప్పుల్లేకుండా తెలుగు వ్రాయనూ చదువనూ నేర్పిన గురువులలో
    చందమామకూ కాస్త చోటుంది !

    యింతకూ
    చందమామ పిల్లల కథల మాసపత్రిక
    యిప్పుడొస్తున్నదా ? లేదా?

    రిప్లయితొలగించండి
  4. గూగులిస్తే-అందిన సమాచారమిది - ఎప్పటిదో మరి :
    చందమామ
    May 25 ·

    చందమామ

    చందమామ సుప్రసిద్ధ పిల్లల మాసపత్రిక. పిల్లల పత్రికే అయినా, పెద్దలు కూడా ఇష్టంగా చదివే పత్రిక. 1947 జూలై నెలలో మద్రాసు నుంచి తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ, ఇప్పుడు 13 భారతీయ భాషల్లోనూ, సింగపూరు, కెనడా, అమెరికా దేశాల్లో రెండు సంచికలతో వెలువడుతోంది.చందమామను బి.నాగిరెడ్డి - చక్రపాణి(వీరు తెలుగు, తమిళ బాషల్లో ఆణిముత్యాలవంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ విజయా సంస్థ వ్యవస్థాపకులు కూడా) 1947 జూలైలో ప్రారంభించారు. కేవలం 6 వేల సర్క్యులేషన్ తో మొదలైన చందమామ నేడు 2 లక్షల సర్క్యులేషన్‌తో అలరారుతోందని తెలుస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతం , ఎందుచేతనంటే, చందమామ ప్రకటనలమీద ఒక్క పైసాకూడ ఖర్చు చెయ్యదు. ఈ పత్రికకు 6 - 7 లక్షల సర్క్యులేషన్ సాధించవచ్చని అంచనా. టెలివిజన్, వీడియో ఆటలు, కార్టూన్ నెట్ వర్క్ లూ మొదలైనవి లేని రోజుల్లో, పిల్లలకు ఉన్న ఎంతో వినోదాత్మకమూ, విజ్ణానదాయకమూ అయిన కాలక్షేపం, చందమామ ఒక్కటే. చందమామ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తుందా అని పిల్లలే కాదు వారి తల్లిదండ్రులూ ఉవ్విళ్ళూరుతుండేవారు. రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు వంటి అద్భుత కావ్య రచనలు చేసి జ్ఞానపీఠ ప్రదానం పొందిన ప్రముఖ రచయిత, కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ "చందమామను నా చేతకూడా చదివిస్తున్నారు, హాయిగా ఉంటుంది, పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా" అని ఒక సందర్భంలో అన్నాడంటే, చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల, పెద్దల మనస్సుల్లో ఎంత స్థిరనివాసము ఏర్పరచుకుందో మనం అర్థంచేసుకోవచ్చును.

    ఇతర వివరాలకు ఈ లంకె చూడండి.
    http://www.chandamama.com/lang/TEL/index.htm

    రిప్లయితొలగించండి
  5. ఆ లింకు తెరుచుకోవడం లేదు గాని - ఈ లింకులో ఎంతో
    విలువైన విశేషమైన సమాచారం లభిస్తోంది చందమామ గురించి
    చూడండి :

    http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE

    ఇంతకీ నా సందేహం తీరలేదు !

    రిప్లయితొలగించండి
  6. వసంతకిశోర్ గారు,
    చందమామ ఇప్పుడూ పుస్తకాలంగళ్ళలో కనిపిస్తుంది. కొంచెం చిన్నదయింది. కథలు అప్పట్లో ఉన్నట్టనిపించలేదు ఒక సారి పత్రిక కొని చదివితే.

    పలువురు పెద్దవారు తమ బాలలతో నల నాడు మోజుతో
    పలుమఱు చందమామ చదువంగల నాళుల విక్రమార్కునిన్
    విలువల బోధసేయు కథ వింతగ తోచెడి; క్రొత్తక్రొత్తగా
    సులువుగ చిక్కుముళ్ళు విడుచో నొక వేడుక గా పఠింపరో?

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ
    సందేహం తీర్చినందులకు
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వేయివ్రక్కలుగా నన’ అనండి.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో ‘స-శ’లకు ప్రాస వేసారు. అది దోషం.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘చందమామ’ పత్రికను గురించి ప్రస్తావించి ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యాన్ని మొదట ఫేస్‍బుక్కులో చదివాను. అప్పుడక్కడ ‘లైక్’ కొట్టానో లేదో గుర్తులేదు.
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ప్రేతమ్మును మోసుకొనుచు
    భీతిల్లక బోవుచుండె విక్రము డడవిన్
    భేతాళుడడుగు ప్రశ్నకు
    ప్రీతిగ నుత్తర్వు లిడుచు వేడుక జేసెన్

    రిప్లయితొలగించండి
  10. బేతాళు డడుగు ప్రశ్నకు
    చేతన తోకథ వివరముచెప్పగ చదివీ
    రాత్రులు నిద్రన రాజును
    ప్రేతను కలలో నిజమున పిల్లలు కనరే !

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు, ధన్యవాదాలు.
    చందస్సు లో రోజూ ఒక పద్యం వ్రాయాలనుకున్నాను.వర్ణనే కాబట్టి ఇదే రెండుచోట్ల వ్రాసినాను.
    సందర్భం పొసగదనుకుంటే రెండు చోట్లకూ విడిగా వ్రాయవలసి వచ్చేది.

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    ఇక్కడ వ్రాసిన మీ పద్యాలను యథేచ్ఛగా ఎక్కడైనా ప్రకటించుకొనే స్వేచ్ఛ మీకుంది. ఎలాంటి అభ్యంతరం లేదు. ఛందస్సు, తెలుగు కవిత్వము - సమస్యాపూరణము గ్రూపలలో మీ పద్యాలను ప్రకటించుకోవచ్చు. నాకు సంతోషమే.

    రిప్లయితొలగించండి
  13. ప్రేత కధచెప్ప వినురాజు పెదవి మూసి
    బదులు చెప్పప్ర శ్నకు తల పగిలి పోవు
    మాయ మౌనుబేతాళుడు మరల రాడు
    చంద మామచెప్పు కధలు చక్క నౌను

    రిప్లయితొలగించండి
  14. >రోజూ ఒక పద్యం వ్రాయాలనుకున్నాను

    లక్ష్మీదేవిగారి మాట చదివి చెప్పాలనిపించింది. నేనూ రోజుకో పద్యం లెక్కన వ్రాస్తున్నాను నా బ్లాగులో. ఎవరికైనా ఆసక్తి ఉంటే వారికోసం లింక్
    ఈ రోజు పద్యం

    ఇక పద్యరచన శీర్షికకు పద్యం.

    ఓయి భేతాళుడా నీవు వేయి కథలు
    చెప్పి తిప్పలు పెట్టినా తప్పదోయి
    విక్రమార్కుని విజయంబు వెఱ్ఱివాడ
    కడు వినోదము మాకు నీ కంఠశోష

    సమయం లేదు నా చేతిలో, కాబట్టి ఒక్క పద్యమే ప్రస్తుతానికి.

    రిప్లయితొలగించండి
  15. చెట్టు పైనుండి శవమును పట్టి దించి
    భుజముపైనుంచి రాజు తా బోవుచుండ
    శవమునుండి భేతాళుడు చక్కగాను
    చిత్రమగు కథనొక్కటి చెప్పి యప్డు
    విభునికిడె చిక్కుప్రశ్నను విప్ప మనుచు
    రాజు మౌనము వీడి తా ప్రశ్న విప్ప
    మౌన భంగమయ్యె ననుచు రేని విడిచి
    చేరె శవము రయమున చెట్టుపైకి

    రిప్లయితొలగించండి
  16. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    శ్యామల రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రోజుకొక్క పద్యాన్ని మీ బ్లాగులో ప్రకటించే నియమాన్ని పెట్టుకొనడం మాకు ఆనందదాయకం.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మిత్రులు శంకరయ్యగారు, "రోజుకొక్క పద్యాన్ని మీ బ్లాగులో ప్రకటించే నియమాన్ని పెట్టుకొనడం మాకు ఆనందదాయకం" అన్నారు. సంతోషం. నేను తరచుగానే వ్రాస్తున్నానండీ పద్యాలు. చదివేవారే లేరు.

    రిప్లయితొలగించండి
  18. శవమే రీతిగనడిగిన
    సవివరముగ బదులు నొసఁగు సన్మతి!మరలా
    శవమే చెట్టున్ జేరుచు
    జవాబుకై ప్రశ్నించు కధలు సరదా గుండున్!

    రిప్లయితొలగించండి