4, నవంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 725

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి

22 కామెంట్‌లు:

  1. ఒళ్ళే మరిచెద నాహా
    కిళ్ళీ వేసుకొని నేను గృహిణియె యిడను
    వ్విళ్ళూరెడు హృదయంబుకు
    కళ్ళెము వేయంగలేను గావలె కిళ్ళీ

    రిప్లయితొలగించండి
  2. రక రకంబుల దినుసులు రమ్యముగను
    తమల పాకున పైనన దనరె నచట
    నోట వేయగ ఘుమ ఘుమ లాడు చుండు
    నాకు నీయమ్మ !తాంబూల మొకటి రాధ !

    రిప్లయితొలగించండి

  3. శుభోదయమున ఫోటో లతో
    మిటాయి పొట్లము సత్కార్యము!
    నేడు ఇచ్చిరి కవులకి అయ్యవారు
    మీటా పాను 'రస' గుళికలు !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘హృదయంబుకు’ అనరాదు. అక్కడ ‘హృదయమునకు’ అనండి.
    ***
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    చివరి రెండు పాదాల్లో యతి తప్పింది. సవరించండి.
    ***
    జిలేబీ గారూ,
    మీ భావానికి నా పద్యరూపం....
    ప్రొద్దుపొడవగానె ఫోటోలతోడ శు
    భోదయమున తీపి పొట్ల మిచ్చి
    సత్కరించుఁ గవుల సఖుల మీఠాపాను
    రసగుళికలఁ బెట్టి రక్తిమీఱ.

    రిప్లయితొలగించండి
  5. నీటుగ చెర్రీ తోడన్
    మీటా పానున్ గనంగ మెచ్చరె జనులున్!
    నోటన్ వేయగ ఘుమఘుమ
    మేటిగ జీర్ణమ్ము జేయు మీటా పానే!!!

    రిప్లయితొలగించండి
  6. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రేష్ట భోజ నమ్ము తుష్టిగా భుజియించి
    వీడియమ్మును గొని ప్రియసి నుండి
    యూసులాడ వలయు నూయల నూగుచు
    కాలమపుడు గడచు కమ్మ గాను

    రిప్లయితొలగించండి
  8. శ్రీగురుభ్యోనమ:

    యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా,
    నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమ:

    తమలపాకున జూడగా తన్మయమున
    పాణపట్టము పైనున్న పరమ శివుని
    పలు రకమ్ముల పూలను పత్రములను
    పూజ జేసిన రీతియే స్పురణ కలిగె.

    రిప్లయితొలగించండి
  9. ఆకు వక్క సున్న మానాటి వేడుక
    సుమధు రంపు ద్రవ్య సోకు లమరి
    చక్క నైన కిల్లి చెక్కిట నమరంగ
    నోరు పండి మిగుల జోరు పెంచు!

    రిప్లయితొలగించండి
  10. గతంలో తమలపాకు చిత్రానికి వ్రాసిన పద్యం గుర్తొస్తోంది :
    తానే తాంబూలంబై
    శ్రీనాథుని నోటఁ జేరి సీసముఁ బల్కెన్!
    నేనును బుక్కిటఁ బట్టగ
    నీనాడీ కందమగుచు నిక్కడ జేరెన్!

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ***
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ***
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "వేడుకవ్వ" అని గ్రామ్యాన్ని ప్రయోగించారు.
    ***
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    "బాబు + అని" అన్నప్పుడు సంధి జరుగుతుంది. అక్కడ "బాబ/టంచు" అనండి.
    ***
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ***
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ***
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ***
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ***
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    గుండు వారి సూచనను గమనించారు కదా.

    రిప్లయితొలగించండి
  12. రక రకంబుల దినుసులు రమ్యముగను
    తమల పాకున పైనన దనరె నచట
    జీ ర్ణ శక్తిని గలిగించు జీవు లకది
    నాకు నీయమ్మ !తాంబూల మో కు మారి !

    రిప్లయితొలగించండి


  13. చిలుకుచు దినుసుల నాకున
    చిలుకలు చుట్టుచును కిళ్ళి చేడియ పెట్టన్
    చిలుకును ప్రేమలు సతిపై
    చిలుకల రంగుగల చీరె చెయ్యన దెచ్చున్.

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతి శాస్త్రి గారూ ! అద్భుతమైన ఊహ !
    మీ ఊహలో నేనూ నామనస్సు నిలి " పాను "

    పానవట్టమ్ము గాదల్చిపత్ర, మందు
    నున్న చెర్రీని శివునిగా నూహజేసి
    వేయు దినుసుల ననుకోగ వేయిపూలు
    కిళ్ళి గట్టెడు వారికే కీర్తి దక్కు.

    రిప్లయితొలగించండి
  15. మున్ను భవ భూతి గోరిన సున్న మిచట
    పసిడి వన్నెల ఆకుల పద్య మపుడు (కాళి దాసు శ్లోకం )
    కాచు నద్దిన కల కత్త కార కిళ్ళి
    తియ్య దనముల పండ్లను తియ్య గలమె?
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. సమస్యా పూరణ కొరకు చేసిన విశ్లేషనే పద్యరచనలో గూడా కాపీ అయి నట్లున్నది. దయచేసి గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  17. కనుటకు నందము నిచ్చుచు
    తినవలె ననుపించు ఫలము తీపిని బెంచే
    దినుసులుగల తాంబూలము
    మనసును కరిగింపజేసి మైమరిపించెన్!

    రిప్లయితొలగించండి
  18. గురువుగారికి, గోలి హనుమచ్ఛాస్త్రిగారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. శ్వేతవర్ణమందు శృంగార భరితమౌ
    వర్ణరాశి పుట్టు వానవేళ
    మూడు రంగులిచట ముచ్చటతోఁ గూడి
    మోహవర్థి యెఱుపు మోవి పులిమె.

    రిప్లయితొలగించండి
  20. శ్వేతవర్ణమందు శృంగార భరితమౌ
    వర్ణరాశి పుట్టు వానవేళ
    మూడు రంగులిచట ముచ్చటతోఁ గూడి
    మోహవర్థి యెఱుపు మోవి పులిమె.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న హుస్నాబాద్ వెళ్ళి అక్కడ నెట్ సెంటర్‍నుండి వ్యాఖ్యను పోస్ట్ చేశాను. నేను సాధారణంగా లేఖినిలో టైప్ చేసి అక్కడ కాపీ చేసి వ్యాఖ్యల పెట్టెలో పేస్ట్ చేస్తూ ఉంటాను. అప్పుడేదో పొరపాటు జరిగి సమస్యాపూరణ వ్యాఖ్యలే ఇక్కడా పేస్ట్ అయ్యాయి. నేను చూసుకోలేదు. మన్నించండి.
    చిత్రానికి తగిన పద్యాలను వ్రాసిన కవిమిత్రులు....
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    జిలేబీ గారికి (భావం వారిది, పద్యం నాది)
    శైలజ గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి