కవిమిత్రులకు నమస్సులు. నిన్న ఇంట్లో పనిచేసుకుంటుండగా తలకు దెబ్బ తగిలింది. రాత్రి జ్వరం వచ్చింది. అందువల్ల నిన్నటి పూరణలను, పద్యాలను సమీక్షించలేకపోయాను. గుండు మధుసూదన్ గారు, శ్యామలరావు గారు నా పట్ల సానుభూతితో నిన్న బ్లాగును సమీక్షించారు. వారికి నా ధన్యవాదాలు. పూరలు, పద్యాలను రచించిన మిత్రులకు అభినందనలు. నా స్వాస్థ్యాన్ని కోరినవారందరికి ధన్యవాదాలు.
*** డా.మాడుగుల ఆనిల్‍గారూ, మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
*** గుండా వేంకట సుబ్బ సహదేవుడుగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు. ప్రథమపాదమున "కూపమ్ముఁ బోలు నింటను" ననిన సరిపోవును.
*** అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు.
*** కె.ఈశ్వరప్పగారూ, మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణమున... "నీ" పునరుక్తమైనది. దీనిని పరిహరించుటకై...మొదటి పాదమున "నీ దయ"కు బదులుగా "దయతో"ననిన సరిపోఁగలదు. రెండవ పూరణమున... "పాపము లెన్నెన్నొ" అసాధువు. దీనిని "పాపము లన్నియును"ననిన సరిపోవును.
*** కె.యెస్.గురుమూర్తి ఆచారిగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు. "భక్తీ"..."భక్తి"కి టైపాటు కాఁబోలును!
నిన్నటినించి బ్లాగ్ చూడకపోవుట వలన మాస్టారి అనారోగ్యము గురించి తెలియ లేదు. మాస్టారు త్వరగా కోలుకోన ఆ భగవంతుని ప్రార్ధించెదను మాపుము తలపై దెబ్బను కాపాడుము శంకరార్యు కరుణను యని నే నా పరమాత్ముని వేడుచు దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్
కవిమిత్రులకు నమస్సులు.
రిప్లయితొలగించండినిన్న ఇంట్లో పనిచేసుకుంటుండగా తలకు దెబ్బ తగిలింది. రాత్రి జ్వరం వచ్చింది. అందువల్ల నిన్నటి పూరణలను, పద్యాలను సమీక్షించలేకపోయాను.
గుండు మధుసూదన్ గారు, శ్యామలరావు గారు నా పట్ల సానుభూతితో నిన్న బ్లాగును సమీక్షించారు. వారికి నా ధన్యవాదాలు.
పూరలు, పద్యాలను రచించిన మిత్రులకు అభినందనలు. నా స్వాస్థ్యాన్ని కోరినవారందరికి ధన్యవాదాలు.
శ్రీ పరమాత్ముని దలచుచు
రిప్లయితొలగించండిపాపమ్ముల దొలగుకొరకు ప్రతి నరుడిలలో
నాపక ప్రతిరోజూ నొక
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్.
మాస్టరు గారూ ! మీ గాయము త్వరగా మాని స్వస్థత చేకూరాలని కోరుకొను చున్నాను.
రిప్లయితొలగించండిపూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి స్వస్థత చేకూర్చమని ప్రభువును ప్రార్ధిస్తూ
రిప్లయితొలగించండిపాపాలు సేయ రాతిరి
దీపములార్పంగ వలయు తేకువ మీరన్
పాపాలు పోవ గుడిలో
దీపము బెట్టంగ వలయు తెల వారంగన్
రిప్లయితొలగించండిదీపము పరమమ్మ నుచున్
నాపదలను దొలగజేసి ననిశము మనలన్
కాపాడే దైవమునకు
దీపము బెట్టంగ దగును తెలవారంగన్!!!
రిప్లయితొలగించండిఆ పంకజాక్షు దయతో
ప్రాపించెను మనుజ జన్మ, భగవత్ భక్తిన్
చూపించి దేవుని కడన్
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్.
కూపమ్ముఁబోలు యింటను
రిప్లయితొలగించండిమాపే పగలైన గాని మనుజుల కందున్!
రూపములన్ జూడ నట నో
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్!
మాపటి వేళ వెలుగుఁ గన
రిప్లయితొలగించండిదీపముఁ బెట్టంగ దగును, తెలవారంగన్
దీపము నార్పంగ వలయు
పాపుట కొరకై కరెంటు బాధల నెల్లన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాపిష్టి తనువు వదలిన
రిప్లయితొలగించండిదాపునకున్ రాదు ధనము ధర్మంబొకటే
కాపాడు ననెడు జ్ఞానోద్
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్II
తెలవాఱంగన్ = జ్ఞానము కలుగజేయడానికి.
కె.ఈశ్వరప్ప గారిపూరణలు
రిప్లయితొలగించండిహేపరమాత్మా!నీదయ
మాపై కార్తీకమందు మంగళమగు నీ
రూపమె వెలుగని భక్తిని
దీపము బెట్టంగ వలయు తెలవారంగన్
కోపమునందున బ్రతుకుచు
పాపములెన్నెన్నొ జేసి పరిహారముకై
రూపము విడిచెను తలకడ
దీపము బెట్టంగ వలయు తెలవారంగన్
పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిమరియొక పూరణ
ఆపగ నందున కార్తిక
దీపము బెట్టంగ వలయు తెలవారంగన్
బాపును నరకపు జీకటి
జూపును ముక్తికిని దారి చొప్పడు వెలుగుల్
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిరేపే కార్తిక పౌర్ణమి
యా పరమేశ్వరుని భక్తీ నర్చించుటకై
ధూపము నైవేద్యంబును
దీపము బెట్టంగ వలయు తెలవారంగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవిమిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రిగారూ,
మీ పూరణము బాగున్నది. అభినందనలు.
మూఁడవ పాదమున "ప్రతిరోజూ నొక" అసాధువు కావున
"ప్రతిదినమున నొక" యనఁగలరు.
***
కెంబాయి తిమ్మాజీరావుగారూ,
మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణమున "ఆపగ నందున"ను...
"ఆపగ యందున"నని యనఁగలరు.
***
శైలజగారూ,
మీ పూరణము బాగున్నది. అభినందనలు.
ఇందుఁ గొన్ని సవరణము లవసరము.
దీపము పరమమ్మ నుచు
న్నాపదలను దొలగజేసి యనిశము మనలన్
కాపాడెడి దైవమునకు
దీపము బెట్టంగ దగును తెలవారంగన్!!!
***
డా.మాడుగుల ఆనిల్‍గారూ,
మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
***
గుండా వేంకట సుబ్బ సహదేవుడుగారూ,
మీ పూరణము బాగున్నది. అభినందనలు.
ప్రథమపాదమున "కూపమ్ముఁ బోలు నింటను" ననిన సరిపోవును.
***
అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ,
మీ పూరణము బాగున్నది. అభినందనలు.
***
కె.ఈశ్వరప్పగారూ,
మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణమున...
"నీ" పునరుక్తమైనది. దీనిని పరిహరించుటకై...మొదటి పాదమున "నీ దయ"కు బదులుగా "దయతో"ననిన సరిపోఁగలదు.
రెండవ పూరణమున...
"పాపము లెన్నెన్నొ" అసాధువు. దీనిని "పాపము లన్నియును"ననిన సరిపోవును.
***
కె.యెస్.గురుమూర్తి ఆచారిగారూ,
మీ పూరణము బాగున్నది. అభినందనలు.
"భక్తీ"..."భక్తి"కి టైపాటు కాఁబోలును!
***
స్వస్తి.
మధుసూదన్ గారూ ! దన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
రిప్లయితొలగించండిశ్రీ పరమాత్ముని దలచుచు
పాపమ్ముల దొలగుకొరకు ప్రతి నరుడిలలో
నాపక ప్రతి దినమున నొక
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్.
ౘూపరి సూర్యుఁడు జనులకుఁ
రిప్లయితొలగించండిదాపపుఁ దిమిరమ్ముఁ బాప ధవళిత కరుఁడై
తూపగు నిరులకు నిఁక త
ద్దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్!
గుoడు మధుసూదన్ గారికి
రిప్లయితొలగించండిమీసవరణకు ధన్యవాదములు
నిన్నటినించి బ్లాగ్ చూడకపోవుట వలన మాస్టారి అనారోగ్యము గురించి తెలియ లేదు. మాస్టారు త్వరగా కోలుకోన ఆ భగవంతుని ప్రార్ధించెదను
రిప్లయితొలగించండిమాపుము తలపై దెబ్బను
కాపాడుము శంకరార్యు కరుణను యని నే
నా పరమాత్ముని వేడుచు
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్
గుండు మధుసూదన్ గారి పూరణని ప్రశంసించేటంతటి వాడిని కాకపోయినా ప్రశంసించకుండా ఉండలేకపోతున్నా. చాలా బాగుంది
రిప్లయితొలగించండిఆ పర మశివుని దలచుచు
రిప్లయితొలగించండిదీపము వెలిగించ నరుడు దేదీ ప్యము గా
బాపములుండవు కావున
దీపము బెట్టంగ దగును దెల వారంగన్
శ్రీ పాదము సేవింపగ
రిప్లయితొలగించండిదీపము కార్తికము నందు తేజము నొసగున్ ,
నేపధ్యము నెరిగి మనము
దీపము బెట్టంగ ( దగును తెలవారంగన్
కొరుప్రోలు రాధ కృష్ణ రావు
గురువు గారికి పాదాభి వందనాలు
రిప్లయితొలగించండిత్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను
కొరుప్రోలు రాధ కృష్ణ రావు
రేపకడ దైవము కొరకు
రిప్లయితొలగించండిదీపముఁ బెట్టంగఁ దగును, తెలవాఱంగన్
శాపంబిడి ముని తేజము / కోపఫలమున ముని యశము,
తాపముఁజెంది వెస మరలె తపమును సలుపన్
తెలవాఱు : సారహీనమగు
కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణగారూ,
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్యగారి యారోగ్యము త్వరగా కోలుకోవలెనని పరమాత్ముని కోరుచు చేసిన పూరణము బాగున్నది. అభినందనలు.
"కరుణను యని నే"యనుదానిని "కరుణను నని నే"గా సవరింపుఁడు.
***
సుబ్బారావుగారూ,
మీ పూరణము బాగున్నది. అభినందనలు.
***
కొరుప్రోలు రాధ కృష్ణ రావుగారూ,
మీ పూరణము బాగున్నది. అభినందనలు.
"నేపధ్యము"ను..."నేపథ్యము"గా సవరింపఁగలరు.
***
అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ,
మీ ద్వితీయపూరణము బాగున్నది. అభినందనలు.
***
స్వస్తి.
శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు గాయం మాని త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిపాపంబులు కరములతో
నాపింపగ జేయు మనుచు నా యీశ్వరునే
ధూపంబు వేసి మ్రొక్కుచు
దీపంబును బెట్టదగును తెలవాఱంగన్!
బొడ్డు శంకరయ్యగారూ,
రిప్లయితొలగించండిమీ పూరణము బాగున్నది. అభినందనలు.
శ్రీ పాదము సేవింపగ
రిప్లయితొలగించండిదీపము కార్తికము నందు తేజము నొసగున్ ,
నేపథ్యము నెరిగి మనము
దీపము బెట్టంగ ( దగును తెలవారంగన్
కొరుప్రోలు రాధ కృష్ణ రావు2/11/14
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
రిప్లయితొలగించండికూపమ్ముఁబోలు నింటను
మాపే పగలైన గాని మనుజుల కందున్!
రూపములన్ జూడ నట నో
దీపముఁ బెట్టంగఁ దగును తెలవారంగన్.
సమస్యకు చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
శైలజ గారికి,
డా. మాడుగుల అనిల్ కుమార్ గారికి,
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
కె. ఈశ్వరప్ప గారికి,
కె.యస్. గురుమూర్తి గారికి,
గుండు మధుసూదన్ గారికి,
చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
పోచిరాజు సుబ్బారావు గారికి,
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
మిత్రుల పూరణలను సమీక్షించి, సవరణలను సూచించిన గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు.
పూజ్యులు గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు...
రిప్లయితొలగించండినా పనుల వల్ల జనులకు
కోపము రాకూడదనుచు కోరుతు శివునిన్
ధూపారాధన చేయుచు
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్.
కుసుమ సుదర్శన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కోరుతు’ అన్నదాన్ని ‘కోరుచు’ అనండి.
అలాగే గురువు గారు..
రిప్లయితొలగించండిచూపుల కాంతులు నింపగ
రిప్లయితొలగించండిరేపను కొంగ్రొత్త యాశ రేపగ వడిగా
నా పరమేశుడు నిత్యము
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్.
పాపము పల్లెన బెట్టుచు
రిప్లయితొలగించండికాపుర మీడ్చుచు గడుపుచు కాల్చగ చిలుమున్
ధూపము పీల్చుటకు తగిన
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్
కాపుల లతాంగి రాతిరి
రిప్లయితొలగించండికోపముతో కోసి గింజ కొడవలి తోడన్
పాపము తీరగ దేవుని
దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్