జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, పూర్వపరాల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పద్యం అమరశిల్పి జక్కన్న చిత్రంలోని ‘నిలువుమా నిలువుమా నీలవేణీ’ పాటను గుర్తుకు తెచ్చింది.
కీచకాధమా! మత్పతుల్ కాచనన్ను సంతతము సమాయత్తమై పొంతనుంద్రు ఖలుడ! జబ్బావహించెనా కరము విడువు బువ్వఁ దినలేవు నీ వింక పుడమి పైన నిన్ను నా విభుల్జంపుట నిశ్చయంబు
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. ‘ద్రోవది’ సరియైన రూపం. ఆ పాదాన్ని ‘ద్రోవది నగుబాటు సలుప దురితమతిని’ అందామా? ‘ఉన్మత్త’లో అత్త లేదు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘భీమామాత్రభావదినమది’... ఇది అర్థం కాలేదు. **** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నది. అభినందనలు. రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం ఉంది. సవరించండి.
గుండు మధుసూదన్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. గ్రుడ్డివాణ్ణి సూర్యనిభునిగా సంబోధించడంలోని చమత్కారం బాగున్నది. **** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీరు తెలియజేసిన విషయం మనోరంజకంగా, ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదాలు.
మాష్టారు పద్యాన్ని కొంచం సవరించాను ..... మదము తీసివేసి మతిలేని పని అని పెత్తాను. తమ్ముడికి ఆ మాత్రం దగ్గరితనం ఉంటుందేమో కదా వికర్ణుడు: ఏమా మతిలేని పనులు కోమలియగు ద్రోవది నలుగురిలోనిలుపన్ సేమంబా వలదత్తరు ణీమణి యశ్రువులశుభమునిచ్చు కురువరా
అత్తఱి కురు సభకునేగి యాదవపతి!
రిప్లయితొలగించండిమామనంబు తెలియజెప్ప మాటలాడు
సమరము సబబా? వలయును సంధి మనకు
మాధవ! దినములిక మారె మాకునిపుడు!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
నర్తనశాల సినిమాలో కీచకుడు ద్రౌపది వెంటబడి తరిమే సన్నివేశం :
(ప్రాణప్రతిష్ఠ జేసిన
యశస్వి , సావిత్రి, దండమూడి, మిక్కిలినేని , ముక్కామల
గుర్తుకొస్తున్నారు )
01)
________________________________
ఉపక్రమణిక :
ద్రౌపదిని గాంచి కీచకుం - డాప లేని
మోహపరవశ మంది , పూ - బోడి నిష్ట
పరుప, నిష్ట మై నట్టు వ - దరుచు ,దరిమి
చూపులకు విందు జేసిన - సుందరాంగి
పూరణ :
మా మదికి విందు నొనగూర్ప - మనుచు వేడు
నత్తరి, గనిన పావని - యాగ్రహించి
పాదపము పీక దలపెట్ట - బావనయ్య
చావ దినమున కొక్కటి - చంకురములు
నిష్క్రమణము :
వల్లకాడగు నీ సీమ - వలదన విని
భీమసేనుండు వృక్షపు - పీకు డాపె
నభయ మిడుమని సైరంధ్రి - సభను గోర
సభను మన్నించ మని రాజు - జఱభు వేడ
వంట యింటను కుందేలు - వంటి దాన
యెట్టులైనను నాదు సం - ఘట్టమునకు
జేర కుందువె ? యని వీడె - సింహబలుడు !
చూపులందున క్రోధము - జూపి , పతుల;
నణగ దుఃఖము ద్రోవది - నగరు జేరె !
________________________________
పాదపము = చంకురము = వృక్షము
బావనయ్య = బ్రాహ్మణుడు(పురోహితుడు-కంకుభట్టు-ధర్మరాజు)
జఱభుడు = దుష్టుడు
సంఘట్టము = కౌగిలి
నగరు = అంతఃపురము
నర్తనశాల - వికీపీడియా నుండి
రిప్లయితొలగించండిhttp://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D
%E0%B0%A4%E0%B0%A8%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2
సుభద్రతో అర్జునుడు
రిప్లయితొలగించండినిలువుమా! మది లో నిన్నె నింపుకొంటి,
పెండ్లి యాడగ నాయత్త ప్రియవు కాగ
బావనములందె యుత్తేజ పఱచితీవె.
యతివ! దినదినమిదె తపమయ్యె నాకు.
బావనములు= శిల్పము చెక్కుటకుముందు గీచుకొన్న రూపురేఖలు
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
పూర్వపరాల ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యం అమరశిల్పి జక్కన్న చిత్రంలోని ‘నిలువుమా నిలువుమా నీలవేణీ’ పాటను గుర్తుకు తెచ్చింది.
వికర్ణుడు:
రిప్లయితొలగించండిఏమా మదము సుయోధన
కోమలియగు ద్రోవది నలుగురిలోనిలుపన్
సేమంబా వలదత్తరు
ణీమణి యశ్రువులశుభమునిచ్చు కురువరా
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కీచకాధమా! మత్పతుల్ కాచనన్ను
రిప్లయితొలగించండిసంతతము సమాయత్తమై పొంతనుంద్రు
ఖలుడ! జబ్బావహించెనా కరము విడువు
బువ్వఁ దినలేవు నీ వింక పుడమి పైన
నిన్ను నా విభుల్జంపుట నిశ్చయంబు
ఏమా ?మయసభ మాయలు
రిప్లయితొలగించండిమామా! ద్రోవది నగవులు మరువగ లేనే!
మేమత్తరి నగుబాటున్
నా మడతుక బావనముల నణచంగవలెన్
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండివికర్ణుడు తన అన్నతో ‘ఏమా మదము’ అనడంలో ఔచిత్యం లేదనుకుంటాను.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ్యులు గురువర్యులు శంకరయ్య గారికి వందనములు భామామణి సైరంద్రిని
రిప్లయితొలగించండిఆముగ కీచకుడు బట్టి అత్తరి, "నేమే
నీమంబా?వగలాడీ!
కామన దీర్చవ? దినమణి కడలిని గ్రు౦కెన్
2.
రిప్లయితొలగించండిద్రౌవది నగుబాటు సలుప రచ్చలోన
మా మనంబునకున్ గాయ మయ్యె సుమ్మ!
కర్ణ! అబ్బా!వనిత నవ్వు కర్కశమ్ము
త్రుంచ వలయు నున్మత్త యౌ దుష్ట వనిత
రచ్చః సభ
ద్రౌవది నగుబాటు సలుపి రచ్చలోన
రిప్లయితొలగించండిమా మనంబును దహియించె మామ! కనుము
కర్ణ! అబ్బా!వనిత నవ్వు కర్కశమ్ము
త్రుంచ వలయు నున్మత్త యౌ దుష్ట వనిత
కె ఈశ్వరప్పగారి పూరణ
రిప్లయితొలగించండిమామది కౌరవ సభలో
క్షేమంబత్తగను సంధి జేయి౦పుము భీ
మామాత్రభావదినమది
వామునుపరిమార్చుట సబబా వల్లించు హరీ !
'మామ'క కొర్కెను దెలిపియు
రిప్లయితొలగించండినో!మాధవ!నీ పలుకులనుం 'బావ'నమై
వే,మము గా'వ దిన'ము లవి
సేమానను 'నత్త'రి, నని సేయని రీతిన్
విను'మా! మ,నకును, నత్తరి
పిన, పెద్దలు బాగ'వది'న వేతనమును 'బా
వ'న రీతి మాకిడు గతిలో
వినయమునను పలుకు కౌరవేంద్రుని సభలో
'మామ'క సోదరులందరు
సేమమునను బాగ'వ ది'నసేవ్యుడ!నిన్నే
నేమము 'బావ'నుడ!మనో
ధాముడ!'నత్త'రతమముల దాటి కొలవమే!
కవిమిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండి(కురుసభలో్ శ్రీకృష్ణుఁడు ధృతరాష్ట్రునితోఁ బలికిన సందర్భము)
"మామ! మామకోక్త విషయమై త్వదీయ
సుతులు బంధింప నాయత్తకృతులునైరి!
కాన, మిముఁ బావనులఁ జేయు క్రమములోని
దీ విరాడ్రూపముఁ గనవ! దినకరసమ!"
మామనము సంతసిల్లగ
రిప్లయితొలగించండిబ్రేమగ నిక నత్త బావ ప్రియమగు వదినె ల్
క్షేమముగా నుండునటుల
నేమము తోజేయు సంధి నేర్వగ కృష్ణా !
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ద్రోవది’ సరియైన రూపం. ఆ పాదాన్ని ‘ద్రోవది నగుబాటు సలుప దురితమతిని’ అందామా? ‘ఉన్మత్త’లో అత్త లేదు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘భీమామాత్రభావదినమది’... ఇది అర్థం కాలేదు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నది. అభినందనలు.
రెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం ఉంది. సవరించండి.
గురువుగారికి వందనములు.
రిప్లయితొలగించండిశ్రీమాడుగుల నాగఫణిశర్మగారి ద్విశతావధానములో అటుఇటుగా ఇదే దత్తపది ఇచ్చి సంస్కృతములో పూరణను అడిగినారు.
అత్త - మామ - అన్న - వదిన ---- అంశము => సత్యభామ మధురకలహ వృత్తాంతము
పూరణ :
అన్నత్వాం నైవశంకేహం
స్వభావ దిన మండన
అత్త మాం త్వం త్వదీయాశ్చ
మామా స్పృశ జగత్పతే
అం + న త్వాం = అన్నత్వాం
మామా = వద్దు వద్దు
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గ్రుడ్డివాణ్ణి సూర్యనిభునిగా సంబోధించడంలోని చమత్కారం బాగున్నది.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీరు తెలియజేసిన విషయం మనోరంజకంగా, ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదాలు.
నా రెండవ పూరణము:
రిప్లయితొలగించండి(శ్రీకృష్ణుఁ డర్జునుని యుద్ధమునకై పురికొల్పు సందర్భము)
"చూపుమా మహాశౌర్యప్రతాపములను!
యుద్ధమాయత్తమాయె, నో యిద్ధచరిత!
బాడబావహ్నికీలోగ్రభాసమాన!
నీవ దినమణి సుతునోర్చ నెగడు యశము!"
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
పూజ్య గురుదేవులకు నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదములు. శవరించిన పద్యము.
రిప్లయితొలగించండిద్రోవది నగుబాటు సలుప దురితమతిని
మామ నంబత్తరి కృశించె మామ కనుము
కర్ణ! అబ్బా!వనిత నవ్వు కర్కశమ్ము
త్రుంచ వలయు నున్మత్త యౌ దుష్ట వనిత
రారాజు మనోగతం...
రిప్లయితొలగించండిమా మనస్సునమెదలెను మయుని సభయె
మరువ దినమందు రాత్రియు మానినచట
నత్తరినిగేలి జేసిన నాటి ఘటన
ఏమి చేతునబ్బా వగ లేమిగాగ.
నా మూఁడవ పూరణము:
రిప్లయితొలగించండి(సంజయుఁడు ధృతరాష్ట్రునకు కురుక్షేత్రమందు యుద్ధమెటుల జరుగుచున్నదో వివరించు సందర్భము)
ఇది వినుమా మహోగ్రతర హింస్ర యుతాంచిత హేతివాదరల్
కదనమునందుఁ ద్రుంచ క్షతగాత్ర విరోధి గతాత్త రోషముల్
వదన సరోవరాంబక వివర్ణ సమాక్రమితమ్మయెన్ బయిన్
జదలది యెఱ్ఱఁబాఱినది సాంఖ్యముఁ బావనమౌ దివిప్రసా
ద దినపరాస్తతావదినదర్శితమయ్యెను సంగరమ్మునన్!
అత్తరమున రణముజేసి యరుల గెలుచు
రిప్లయితొలగించండిప్రభవ దినముకై మా మది వేచి యండె
ననుచుఁ బావన చింతన హాయి గొలుప
యద్ధమున పాండవులు బోరి రురకలెత్తి
మాష్టారు పద్యాన్ని కొంచం సవరించాను ..... మదము తీసివేసి మతిలేని పని అని పెత్తాను. తమ్ముడికి ఆ మాత్రం దగ్గరితనం ఉంటుందేమో కదా
రిప్లయితొలగించండివికర్ణుడు:
ఏమా మతిలేని పనులు
కోమలియగు ద్రోవది నలుగురిలోనిలుపన్
సేమంబా వలదత్తరు
ణీమణి యశ్రువులశుభమునిచ్చు కురువరా
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండిఅత్తరుణమున కురుసభ యందు నకట
ద్రోవది నలిగి ప్రార్ధింప బావనుడగు
వాసుదేవుడామె కొసంగె వస్త్రములను
కాచును సుమామనలను శ్రీకాంతు డొకడె
శ్రీకృష్ణుడు, అర్జున సుయోధనులతో...
రిప్లయితొలగించండిఅత్తలములన్ ధరించను
సత్తెము వినుమా మనీష సాయమిడుదు మీ
చిత్తపు బావనముల మో
సెత్తిన ద్రోవది నడచెదఁ జేరఁ బలుకుమా!
నా మూఁడవ పూరణము: (కొన్ని సవరణములతో...)
రిప్లయితొలగించండి(సంజయుఁడు ధృతరాష్ట్రునకు కురుక్షేత్రమందు యుద్ధమెటుల జరుగుచున్నదో వివరించు సందర్భము)
ఇది వినుమా మహోగ్రతర హింస్ర యుతాంచిత హేతివాదరల్
కదనమునందుఁ ద్రుంచ క్షతగాత్ర విరోధి గతాత్త రోషముల్
వదన సరోవరాంబక వివర్ణ సమాక్రమితమ్మయెన్ బయిన్
జదలది యెఱ్ఱఁబాఱినది సాంధ్యనుఁ బావనమౌ దివిప్రసా
ద దినపరాస్తతావదినదర్శితమయ్యెను సత్వరమ్మునన్!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండు మధుసూదన్ గారూ,
మీ మూడవ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
సవరించినందుకు ధన్యవాదాలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.