15, నవంబర్ 2014, శనివారం

పద్యరచన - 736

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

 1. తుంటరి పనులను చేయుట
  గంటల తరబడి షికార్ల గడుపుట కాదోయ్
  తంటాలు వచ్చినప్పుడు
  వెంటుండి సహాయపడుట ప్రియమిత్రతయౌ

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ఆప్తుడు :

  01)
  _____________________________

  కష్టముల యందు వదలెడు - కటిక వాడు
  కాడు కాబోడు యేనాటి - కాప్తుడనగ
  కష్టసుఖముల యందును - కలసి యుండి
  యాపదల నాదు కొను వాడె - యాప్తుడగును !
  _____________________________

  రిప్లయితొలగించండి
 3. చెప్పిన చేతుల పద్ధతి
  గొప్పగ వంటికిని బట్టె కూరిమి వలనన్,
  విప్పిన చేతుల వేళ్ళకు
  ఒప్పునె పదకొండు సంఖ్య ఒజ్జల మదికిన్
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 4. నల్ల బోర్డు మీద నల్లని బాలుడు
  రెండు ,రెండు వ్రాసి రెండు కూడ
  నెంత వచ్చు ననుచు వింతగా, నొజ్జను
  నడుగ వింత గొలిపె నార్య నాకు

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళీ సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘వెంటనిలిచి సాయపడుట...’ అనండి.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. ఆపదలో నాదు కొనఁగఁ
  జూపించిన జేతి వ్రేళ్లఁ సొంపుగ గీయన్
  సూపరనంగన్ దగునా?
  కాపీ కొట్టుటయు రాని గాడిద యననా?
  (గుడ్డిగా కాపీ చేసేవాడు దోమచచ్చుంటే దోమను చంపే రకమనే ఉద్దేశ్యంతో వ్రాశాను. కవిమిత్రులు ఈ భావాన్ని ఇంకా బాగా వ్రాస్తే చూడాలని వుంది)

  రిప్లయితొలగించండి
 7. గురువు చెంతనే శిష్యుడు గోటు జూపి
  చిక్కు ప్రశ్నను వేసెను చిలిపి గాను
  ముడిని విప్పలేక గురువు మూతి బిగిసె
  సాటి విద్యార్ధి బృందము పోటు గాను
  సాయ మివ్వగ వచ్చిరి సాథు లవుచు

  రిప్లయితొలగించండి
 8. రెండు కలుప రెండు రెట్టించి నాల్గవు
  చేతి నొకటి గీసె చిరుత బుడత
  అక్ష రములు లెక్క ఆంగ్లము నపదియే
  రెండు ప్లుస్సు చేర్చి రెండు కలుపు

  సాయ పడగ నతని గీయ మనిరిరెండు
  హస్త ములను చూపి అర్థ మవగ

  రిప్లయితొలగించండి
 9. పాఠశాలలో గురువొక బాలునకును
  జెప్పె లెక్కను బోర్డుపై జేయుమంచు
  లెక్క రాకను పంతులు దిక్కు చూచె
  జేతు లెత్తిరి కొందరు చేతు మంచు

  రిప్లయితొలగించండి
 10. సంకలనము జేయునపుడు
  నంకెల గూడుచు గురుతు నగుపించునటుల్
  కుంక యొకడు చిత్రమ్మును
  పొంకముతో గీసి చూపె ముచ్చట గొలుపన్!

  రిప్లయితొలగించండి
 11. రెండవ పాదంలో 'గూడుచును' అని చదువ మనవి.

  రిప్లయితొలగించండి
 12. అంకెల నిచ్చుచు బోర్డున
  సంకలనము జేయమనెను సద్గురువచటన్
  జంకక గీసెను బాలుడు
  బింకముతోబొమ్మతోడ విలువను చూపెన్  రిప్లయితొలగించండి
 13. మిత్రులకు నమస్కృతులు..
  నిన్న ప్రయాణంలో వ్యస్తుణ్ణై ఉండడం వల్ల పూరణల, పద్యాల సమీక్ష చేయలేకపోయాను. మన్నించండి.
  నిన్నటి చిత్రాన్ని చూచి స్పందించి మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు....
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  బి.యస్.యస్. ప్రసాద్ గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  శైలజ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి