15, నవంబర్ 2014, శనివారం

న్యస్తాక్షరి - 15 (రా-వే-పో-వే)

అంశం- ద్రౌపదిని సభ కీడ్చుకొనివచ్చు దుశ్శాసనుని మాటలు
ఛందస్సు- కందము
నాలుగు పాదాలలో చివరి అక్షరాలుగా వరుసగా ‘రా - వే - పో - వే’ ఉండాలి.

37 కామెంట్‌లు:

 1. మంచిగ నాతో నువు రా !
  యుంచిరి నిను పందెమందు నోడిరి నీవే
  యెంచిన యా వెధవలు పో !
  ముంచిరి నట్టేట నిన్ను ముండా పదవే!
  (దుశ్శాసనుడు తిడుతూ తీసుకువెళ్ళి యుంటాడని పై పదాలు వాడాను ...తప్పైతె క్షమించండి)

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  ద్రౌపదిని సభకు రమ్మని పిలుచుచూ దుశ్శాసనుడు :


  01)
  _____________________________

  జూదమున నోడె నిను, రా !
  నీదు మగడు ! నీవు మాకు - నిజ బానిసవే !
  వాదన విననిక పోపో
  యాదుకొన నెవరి తరమది - యచట నెరుగవే !
  _____________________________

  రిప్లయితొలగించండి
 3. ద్రౌపది మంచిగ నికరా
  యేపుగ నీచీర లూ డ్తు నిచటకు రావే
  ప్రాపుగ నెవరును మఱి ,పో
  దాపునకుం రారు భామ !తడవక పదవే

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ముండా’ అనడం బాగాలేదు. అక్కడ ‘పొలతీ రావే’ అనండి.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. కవిమిత్రులకు మనవి...
  రేపు ఉదయం వరకు నేను బ్లాగుకు అందుబాటులో ఉండను. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
 6. గురువు చెంతనే శిష్యుడు గోటు జూపి
  చిక్కు ప్రశ్నను వేసెను చిలిపి గాను
  ముడిని విప్పలేక గురువు మూతి బిగిసె
  తోటి విద్యార్ధి బృందము పోటు గాను
  సాయ మివ్వగ వచ్చిరి సాథు లవుచు
  (సాథులు -> సాథీ (లు) -> స్నేహితులు )

  రిప్లయితొలగించండి
 7. మరియాదను వీడి నిరా
  దరమున ద్రౌపది నకట మదముమీరగ వే
  గిరముగ సభకున్ గొంపో
  వ రక్కసుడు లలననీడ్చె బరబర బావే

  రిప్లయితొలగించండి
 8. "దుశ్శాసనుని మాటలు" అని చూడలేదు. క్షమించండి. మళ్ళీ ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 9. ఓసీ! ద్రౌపది! యిటురా!
  నాశన మొనరింతు, సభకు నాతో రావే!
  ఈశుడు నిను కాచడు పో!
  చేసిన యవమానము సరి చేసెద పదవే!

  రిప్లయితొలగించండి
 10. కవిమిత్రులకు సవినయ మనవి-కౌరవులు నిత్యజీవితంలో మర్యాదాపరులే. దుర్యోధనుడి పరిపాలన చాలా బాగా సాగింది. అయితే సినిమా ఫక్కీలో వ్రాసిన సంభాషణలు విని జనభాహుళ్యానికి ఆ పదాలే, ఆ కథలే నాటుకు పోయాయి మనసులో. మూలం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి, భారతం ఆసాంతం చదవటం అంత తేలిక కాదనిపించింది.

  రిప్లయితొలగించండి
 11. మాదే విజయము భళిరా!
  జూదములో నోడె నిన్ను శుంఠలు గనవే!
  వాదనలిక చెల్లవు ఫో!
  ఏదీ! నీజుట్టుపట్టి నీడ్చెద పదవే!!!

  రిప్లయితొలగించండి
 12. పాంచాలీ! వెసనిటురా!
  పాంసుల! సభలోని పతులవద్దకు పదవే!
  వాంచగ నీపతులు తలలఁ
  గాంచెదమే నీ దిసమొల కాంక్షన్ రావే!
  పాంసుల: ఱంకుటాలు

  రిప్లయితొలగించండి
 13. తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన భారతాన్ని నేను పూర్తిగా చదివాను.
  "పాంచాలి బంధకి యనంబడు. నిట్టి దాని విగతవస్త్రం జేసి తెచ్చినను ధర్మవిరోదంబు లేదని కర్ణుండు వికర్ణు వచనంబులకు బ్రత్యాఖ్యానంబు చేసిన"
  యిక్కడ కర్ణుని రెండవ మొఖం కనబడుతుంది. దుర్యోధనుడు కర్ణుని మాటలను విన్న తరువాత ద్రౌపది వస్త్రాలు లాగి తీసుకో అని ఆజ్ఞా పించాడు.అలా ద్రౌపది నగ్న సౌందర్యాన్ని చూడ ఉసిగొల్పిన వాడు కర్ణుడు.ఈ విధంగా దుష్ట చతుష్టయం జేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి.

  రిప్లయితొలగించండి
 14. ఓడిరి నిను పణమున రా!
  వేడిన పంచాలి విడువ వేగమె రావే!
  నేడే సభలోనను పో
  రాడిన నీ వలువలిప్పు వాడను వినవే!

  రిప్లయితొలగించండి
 15. తేజమెసంగిన కురురా
  రాజుకు బందీవగుచును బ్రతుకఁగరావే
  నీజీవితబందీ పో
  దాజన్మాంతంబు సేవలందించెదవే

  రిప్లయితొలగించండి
 16. శ్రీ సత్యనారాయణ రెడ్డిగారికి నమస్సులు.

  మీ పద్యములో స కు శ కు ప్రాస వర్తించదు. అలాగే మీ ఇంకొక పద్యములో
  పాంచాలీ - పాంసుల.... ఫ్రాస భంగము

  రిప్లయితొలగించండి
 17. సంపత్ కుమార్ శాస్త్రి గారికి – తమరి సూచనలకు ధన్యవాదాలు. రెండు పద్యములు సవరించటానికి ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 18. వదినా యోడిరి మిము! రా
  జదియే నానతి యొసంగె! సభకేగగ వే
  డెద, పతు లచ్చట తలపో
  సెదరేమౌనో యిటనని శీఘ్రమె పదవే!

  రిప్లయితొలగించండి
 19. పాంచాల రాజ సుత! రా
  పాంచాలి! కురు సభౕ విభుని వద్దకు రావే!
  వాంచగ పతులతలలు పో
  గాంచెదమే నీ దిసమొల కాంక్షన్ రావే!

  రిప్లయితొలగించండి
 20. ఓసీ ద్రౌపది! వెసరా!
  కాసులు రాజ్యంబు నోడి కాంతులు రావే!
  చేసిరి నిను దాసిగ పో!
  చేసిన యవమానము సరి చేసెద పదవే!

  రిప్లయితొలగించండి
 21. మల్లెలవారిపూరణలు
  ఓ పాంచాలిసభకు రా
  నీ పంచ పతులల సేవ లింపైరట వే
  తా పొంది రోటమిని పో
  మా పాదమ్ములకు మ్రొక్కి మమ్ము కొలువవే
  2.పంచ పతులున్నసతి రా
  అంచిత పూజితవుగావు నందిడ రావే
  పంచను సేవలనిడ పో
  ఒంచుచునినువలువలూడ్చినొప్పుగ పదవే
  3.మయసభను నవ్వితివి రా
  భయమౌ కౌరవసభ నటు పాటు నిడుగు వే
  రయమున చీరను విడి పో
  నయముగ సభలో కుములుదు నాచే గదవే
  4.నయమగు పోరు జరుప రా
  భయమయి పాచిక రణమున బడయగ నిను వే
  రయమున సభ నణచును పో
  ప్రియమగు నీవలువ లూడ్చ భీతిల రావే
  5.కుంతీ పుత్ర్హ్లులతో,రా
  వంతుగ కౌరవుల నెల్ల భర్తగ గొనవే
  ని౦తిరొ గౌరవ మిది పో
  వింతయు గాదిదియ పొంద వేవుర నీవే


  ======

  రిప్లయితొలగించండి
 22. మల్లెలవారిపూరణలు
  ఓ పాంచాలిసభకు రా
  నీ పంచ పతులల సేవ లింపైరట వే
  తా పొంది రోటమిని పో
  మా పాదమ్ములకు మ్రొక్కి మమ్ము కొలువవే
  2.పంచ పతులున్నసతి రా
  అంచిత పూజితవుగావు నందిడ రావే
  పంచను సేవలనిడ పో
  ఒంచుచునినువలువలూడ్చినొప్పుగ పదవే
  3.మయసభను నవ్వితివి రా
  భయమౌ కౌరవసభ నటు పాటు నిడుగు వే
  రయమున చీరను విడి పో
  నయముగ సభలో కుములుదు నాచే గదవే
  4.నయమగు పోరు జరుప రా
  భయమయి పాచిక రణమున బడయగ నిను వే
  రయమున సభ నణచును పో
  ప్రియమగు నీవలువ లూడ్చ భీతిల రావే
  5.కుంతీ పుత్ర్హ్లులతో,రా
  వంతుగ కౌరవుల నెల్ల భర్తగ గొనవే
  ని౦తిరొ గౌరవ మిది పో
  వింతయు గాదిదియ పొంద వేవుర నీవే

  పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
  నీ పతు లోడిరి నిను రా
  వే పాంచాలీ యటంచు వేణిని గొని ,వే
  నూపుచుదుశ్శాసను డనె
  నీపోడిమి జూతురు సభ నె౦చక పదవే


  ======

  రిప్లయితొలగించండి

 23. తిమ్మాజీరావుపూరణ
  పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
  నీ పతు లోడిరి నిను రా
  వే పాంచాలీ యటంచు వేణిని గొని ,వే
  నూపుచుదుశ్శాసను డనె
  నీపోడిమి జూతురు సభ నె౦చక పదవే


  ======

  రిప్లయితొలగించండి


 24. కె ఈశ్వరప్ప గారిపూరణ
  జూదమునందోడిరి రా
  కాదన్నను వదల నిన్ను కదలుము నీవే
  వాడిన్చాకు ద్రౌపది పో
  నాదము వినరు యెవరుగమనమ్మునపదవే
  2.ద్రౌపది పతు లుండిరి,రా
  కోపమ్మును మానకున్న కుదురదు నీవే
  లోపమునె౦చక నిలు పొ
  రాపిన విలువలుడుగునిది రావే పోవే
  ======

  రిప్లయితొలగించండి
 25. కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 26. జూదమ్మున నోడిరి రా
  పోదము కురురాజ సభకు పోరక రావే
  యే దారిక లేదే పో!
  వేదిజ నీ వలువలన్ని విప్పెద పదవే!

  రిప్లయితొలగించండి
 27. కవి మిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారి జన్మదినమని ఇప్పుడే చూసాను. వారికి జన్మదిన శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
 28. గురువు గారికి వందనములు ,గురువా! ఈ సమస్యను పూరించడం నాకు చాలా కష్టమైంది అయినా.ప్రయత్నం చేసాను. తప్పులున్నచో సవరించ మనవి.

  తెమ్మనిరి సభకు నిను రా
  వమ్మా! ఓ వదిన గారు వడివడిగను, వే
  షమ్ములికను చెల్లవుపో!
  రమ్మిక బింకమ్ము వీడి ద్రౌపది రావే!

  రిప్లయితొలగించండి
 29. గురువర్యులు, శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 30. సుదర్షన్ కుసుమ గారు మీపూరణ బాగుంది.

  రిప్లయితొలగించండి
 31. ఏమే! అంతటి పొగరా!
  నీ మానమునింక గాచు నిక్కము చావే!
  భీముండే రానీ పో
  మామాటల కెదురునిల్చి మనగలడటవే!

  రిప్లయితొలగించండి
 32. గురువర్యులు, శ్రీ గుండు మధుసూదన్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 33. గురువు గారికి వందనములు, మా గురువు శ్రీ గండూరి లక్ష్మీనారాయణ(నేను వారి పాఠశాల శిష్యున్ని) గారు సూచించిన ప్రకారం సవరణతో...

  తెమ్మనిరి సభకు నిను రా
  వమ్మా! పాంచాలి నీవు వడివడిగను వే
  దమ్ములు చాలునికను రా !
  సమ్మతితో బింకమొదలి సతివా? రావే!

  రిప్లయితొలగించండి
 34. కవిమిత్రులందఱకు నమస్కారములు!

  నేఁడు నా యంతర్జాలము చక్కఁగఁ బనిచేయకపోవుట వలన నేను నా పూరణముం బెట్టుటకును, మిత్రుల పూరణములను సమీక్షించుటకును వీలుకాకపోయినది. మన్నింపఁగలరు.
  నాకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపిన మిత్రులందఱకునుం గృతజ్ఞతాపూర్వక వందనములు!
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 35. మిత్రులకు నమస్కృతులు..
  నిన్న ప్రయాణంలో వ్యస్తుణ్ణై ఉండడం వల్ల పూరణల, పద్యాల సమీక్ష చేయలేకపోయాను. మన్నించండి.
  నిన్నటి వ్యస్తాక్షరికి చక్కని పూరణలను రచించిన కవిమిత్రులు....
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  బి.యస్.యస్. ప్రసాద్ గారికి,
  మాజేటి సుమలత గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  శైలజ గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  కె. ఈశ్వరప్ప గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  కుసుమ సుదర్శన్ గారికి,
  ఆదిత్య గారికి (స్వాగతం పలుకుతూ),
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి