పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** మాజేటి సుమలత గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో ‘ద్రోవ’లో రకారాన్ని ప్రయోగించి నియమోల్లంఘన చేశారు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చందమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘తండ్రి’లో రకారాన్ని ప్రయోగించి నియమోల్లంఘన చేశారు.
జనకు ని పలుకు జవదాట మనసు లేక
రిప్లయితొలగించుజాన కీ పతి వెడలెను కాన నమున
కీయ దిమనకు బోధించె నీ విధముగ
మనము సాగించ వలయును మనుగ డనిక
శివ ధనువును భంజించియు సీత బట్టి
రిప్లయితొలగించుజనకు నాఙ్ఞను పాలింప జనియె నడవి
దమ్మమే తానుగా తానె దమ్మమై చె
లంగి లంకేశు నడచె, మహత్వమైన
గాథ, జగతి కట్టివాని గమము దెలుపు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించుఅందరి పూరణలూ అలరింప నున్నవి !
రామాయణము :
01)
_________________________________
సకల దేవత లదె వేడ - సమ్మతించి
నింగి విడచిన విష్ణువు - నేలకు దిగి
చంప వింశతిబాహుని - సంఖ్యమందు
మానవుండయి మసలిన - మహిత గాథ !
మలయవాసిని నాథుండు - మనన జేయు
జానకీపతి నామమే - సంతతమును
వినిన జూచిన దలచిన - వేడుకగను
సకల పాపము చిటికెల - సమసి పోవు !
_________________________________
చిటికెల = క్షణంలో
రిప్లయితొలగించుతల్లి కౌసల్య దీవించి తనయునంపు
రిప్లయితొలగించువేళ నిట్టులనె నడువు, విడకు మంచి
పథమునంచు బోధనుఁ జేయు పగిది గనిన
కన్నులు తడి గాకుండునే కలికికైన?
పోచిరాజు సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రామాయణ ప్రాశస్త్యము ర,బండి ర,లు లేకుండా వర్ణన
రిప్లయితొలగించుపూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
పావనమ్మగు కౌసల్యభవుని గాధ
పఠనజేసిన వినినను బాపు నఘము
ఐహికమ్ములౌ బంధములన్ని తొలగి
నంతమందున కైవల్య మందుకొనగ
నవంబర్ 13, 2014 10:17 AM
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ‘ద్రోవ’లో రకారాన్ని ప్రయోగించి నియమోల్లంఘన చేశారు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జానకీమాత కడగండ్ల దీనగాధ
రిప్లయితొలగించునీచ దశకంఠు నణచిన నీతి గాధ
హైందవుల కిదియె యమోఘమైన గాధ
పతిత పావన కౌసల్య సుతుని గాధ
ఇందు పితృవాక్య పాలనమింపుగాను
అన్నదమ్ముల యనుబంధమందముగను
సాధ్వి లక్షణములనెంత చక్కగాను
తాను లిఖియించి వాల్మీకి ధన్యుడాయె
కపట నీతిని వాలిని కాటు బెట్టె
రిప్లయితొలగించుఅల్పు డొకడి మాటను నమ్మి ఆలినడవి
కంపి నఘనుడు కుజనుడో కంట జూడ
మచ్చ యే నిది యెంచగ మనము నేడు
తప్పుకు క్షమార్హుడను . సరిచూసి మార్చినాను .
రిప్లయితొలగించుసుగుణ ధాముడు శ్యాముడు సుజన గాన
అనుజు డుసతియు తోడున అడవి నుండి
దుష్ట శక్తులన్ శిక్షించె దోష మెంచి
సత్య లోక కళ్యాణుడు శాంతి హితుడు
తండ్రి మాటను కలలోన దాటకుండ
రిప్లయితొలగించునాడినట్టి మాటలను తా వీడ కుండ
జనులు మెచ్చిన పాలన జరిపినట్టి
విభుని కథ గొప్ప కావ్యమై వినుతి కెక్కె
గురువుగారు,
రిప్లయితొలగించుధన్యవాదాలు.
చందమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
అధిక్షేపాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తండ్రి’లో రకారాన్ని ప్రయోగించి నియమోల్లంఘన చేశారు.
మల్లెలవారిపూరణలు
రిప్లయితొలగించుమానవుండౌచు బుట్టిన మాన్యవిభుడు
దానవాళిని దండించి ధన్యగతిని
సీత పతి యైన వాడు తా జేసె పాల
నమును మానవు డెట్లుండ నదియు తెలిపె
2.తనదు పిత మాట తప్పని తనయు డతడె
మానవాళికి తా జూపె మనసు కెక్క
నొకటె పెండ్లాము బాణము నొకటి యనగ
దుష్ట దనుజుల దునిమెడి దొడ్డ విభుడు
3.అన్నదమ్ములు, దంపతుల౦దమైన
జీవనమ్మని చాటుచు చెప్పుగాధ
భక్తీతత్వ౦బు ఘనతను పల్కు గాధ
మానవాళియెమనుటకు మాన్యనీతి
4.పతినిసేవించు టెట్లనన్ సతికి,నిలను
సతిని ననువుగ జూచేటి పతియు నెవడొ
దివ్యమౌ గతి తెలిపియు తెల్లముగను
మాన్యమైన కుటు౦బముమలచు గాధ
5.సీతబాధల విపులంబు జేసిచూపి
జాలి నింపిన కథయిది సదమలముగ
సతికి విలువను పెంచిన సౌమ్యగాధ
లివియ సీతాయన౦ బగు నెంచి జూడ
కె ఈశ్వరప్పగారిపూరణలు
రిప్లయితొలగించుసీతహితపతి లంకేశు చిదుమజేసి
నీతినిష్ఠను నిలలోన నిలుప నెంచి
సంతస౦బున సాకిన సంవిధాత
లక్ష్మణన్నయ్య మమతల లక్ష్య సిద్ధి
2.అన్నదమ్ముల బంధమ్ము లల్లుకొనగ
అమ్మనాన్నలమాటలు నమ్మియుండి
ఆంజనేయుని భక్తుల నాదు కొనుచు
భూపతిగజానకీ పతి పుణ్య ధాత
అన్న దమ్ముల బంధమ్ము మిన్నగాను
రిప్లయితొలగించునవని జనులకు నందించు నాది కవిత
కష్ట సుఖముల నొకటిగా నిష్టపడుచు
బేధ భావమ్ము నెంచని వేద గాధ
అయ్య మాటల నాలించు నాత్మజునిగ
కౌసలేయుని కమనీయ కధను వినిన
మాన వాళికి గల్గును మహిత శక్తి
తలప హనుమయె సాక్షిగ తధ్యమిదియె
కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించుజానకీపతి కథ మనుజ విలువలకు
కల్ప వృక్ష మయ్యది విష క్ష్మాజమనుచు
వ్రాసె నొక్కతె మిక్కిలి వక్రముగను
మొగలి జడలోన దాల్చునే మోటు పడతి ?!
తనజనకుని మాటలనెప్డు దాట కుండ
రిప్లయితొలగించునాడినట్టి మాటలను తా వీడ కుండ
జనులు మెచ్చిన పాలన సలిపినట్టి
విభుని కథ గొప్ప కావ్యమై వినుతి కెక్కె
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
రిప్లయితొలగించుమీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘చూచేటి’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘అనువుగ జూచెడు’ అనండి.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘లక్ష్మణన్నయ్య’ అన్నదాన్ని ‘లక్ష్మణుని యన్న’ అనండి.
****
శైలజ గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ సవరణ బాగున్నది. అభినందనలు.
జానకీ సతి పతి గాథ జగతిలోన
రిప్లయితొలగించుఖ్యాతి జెందెను జదివిన గలుగు ముక్తి
విధితమౌ నీతి, యెలిమి, యా విభుని ఘనత
జనకు నాజ్ఞను దాటని సజ్జనుండు
గురువు గారికి వందనములు, మా ఇంటి పేరు మీ మిత్రుడు కుసుమ రాజేందర్ ను గుర్తుకు తెస్తున్నందుకు ఆనందంగా ఉంది గురువు గారూ..
రిప్లయితొలగించుతప్పులను సవరించ మనవి.
జనకు నాజ్ఞను పాటించి జడియ కుండ
జానకీపతి ఆలితో కాన కేగి
దుష్ట శిక్షణ గావించి శిష్ట జనుల
గాచి నొందెను ఖ్యాతిని ఘనము గాను
జానకీపతి పాలన జయము జయము.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించుజానకీ దేవి జగతికి జనని యనగ
భూమి జామాత భువనైక పూజ్యుడాయె
దివ్యమైనట్టి గాథయై తేజ మొసగు
వాల్మికోద్భవ కావ్యమే పథము జూపు.
(వాల్మికోద్భవ కావ్యమా వందనములు)
కవిమిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించుతపసి వాల్మీకి లిఖిత సత్కావ్యనేత,
సీతతో, లక్ష్మణునితో వసింప నడవి,
దశముఖుఁడు సీతఁ గొంపోవ, స్పశముఁ జేసి,
వాని వధియించి, చెలిఁగొని, పావనుఁడయె!
ఆలుమగల వలపు దెల్పు నట్టిగాథ
రిప్లయితొలగించుఅన్నదమ్ముల యనుబంధ మల్లు గాథ
స్వామి భక్తిని దెలిపెడు భవ్యగాథ
జానకీసతి పతుల విశ్వాస గాథ!
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో ‘గాచి పొందెను ఖ్యాతిని’ అనండి.
****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నా మఱియొక పూరణము:
రిప్లయితొలగించుపుట్టపుట్టువు కన్నట్టి పొత్తపుఁ బతి
జన్నమునుఁ గాచి, విల్తున్మి, జానకి మను
వాడి, వనికేగి, యిల్లాలి బందెవట్టు
వాని నొంచి, గేహినిఁ గొని, పావనుఁడయె!
గుండు మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించుమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.