14, నవంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 735

కవిమిత్రులారా,


పైచిత్రాలను పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. చాచా నెహ్రూ జన్మదినమున నివాళి :
    స్వాతంత్ర్య భారత ప్రధమ ప్రధానియై
    దేశభవిత తీర్చిదిద్దెనితడు
    నాజర్ టిటోల తో నాలీన దేశాల
    నేర్పరచినయట్టి నేతయితడు
    పొరుగుదేశములతో పొందగోరుచు మైత్రి
    పంచశీలను సూత్రపరచెనితడు
    బాలబాలికలను భావిపౌరులనుచు
    వాత్సల్యముగజూచె వారినితడు
    జాతిరత్నమితడు శాంతిదూత యితడు
    పుడమి నేతలందు ప్రోడ యితడు
    రాజకీయమందు రాజ్యపాలనమందు
    నైతికత కలిగినయట్టి నేత యితడు

    బాలల దినోత్సవ శుభాకాంక్షలు :

    భావిపౌరులైన బాలబాలికలార
    దేశ భవిత మీరు - తెలివి గల్గి
    మంచి పనులయందు మనసు లగ్నముచేసి
    మాయమర్మమెంచి మసలుకొండు

    మూఢనమ్మకములు మూర్ఖత్వములవీడి
    జ్ఞానమొందునటుల చదువుకొనుడు
    శాస్త్రవిద్యలందు సాంకేతికతలందు
    తేవలయును పేరు దేశమునకు

    చెడు చెలుముల విడనాడుచు
    చెడు నలవాట్లైనవాని జేర్చక దరికిన్
    తడబడి తప్పులు జేయని
    నడవడి తో జీవితంబు నడుపుట శుభమౌ

    రిప్లయితొలగించండి
  2. పుట్టితి వట యీ రోజున
    బుట్టిన యో నెహ్రు !నీవు పూర్ణిమ చంద్రు
    న్చట్టున వెలిగితి విప్పుడ
    య ట్టులె యొకసారి రమ్ము హర్షము గలుగన్

    నీదు పుట్టిన రోజును నేడు మేము
    జరుపు కొనుచుంటిమి మఱి బా లలది నముగ
    పండు గనువోలె ,మనసార పంచి పెట్టి
    చాకు లైట్లను బాలలు సంతసించ

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    నెహ్రు పుట్టిన దినము - బాలల దినోత్సవము - నవంబరు పదునాల్గు :

    01)
    ______________________________

    ప్రతి నవంబరు పదునాల్గు - పదుల కొలది
    బాలురందరు గుమికూడి - పాఠశాల
    తీపి వస్తువులవి యెన్నొ - తినెడి వేళ
    వివిధ చిత్ర విచిత్రమౌ - వేషములను
    వేసి బహుమతు లందెడి - వేళ గాన
    "బాలల దినోత్సవము" పేర - బరగు నెపుడు
    నెహ్రు పుట్టిన దినమున - నేర్పు మీర !
    ______________________________

    రిప్లయితొలగించండి
  4. శ్రీ మంతుడైనట్టి చిరునవ్వు చిందించు
    శ్రీ జవహరులాలు శ్రీల నొసగె
    భారతావని చుట్టు బంగారు కడియము
    వేయించ గల తండ్రి వీరి తండ్రి
    మాత స్వరూపమ్మ మహితాత్ము రాలిగా
    మణి రూప మీతని మనకు నొసగ
    బాలలే లొకమై భారత రత్నయై
    విశ్వ శాంతికి తాను వేదికయ్యే
    శాంతి సాధన జేసిన దాంతి యతడు
    ప్రజల స్వామ్యము దెలిపిన ప్రజల జీవి
    పంచ వర్షపు పథకాలు పంచినాడు
    పండిత నెహురు మాన్యుడు మండి తుండు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  5. శాంతి దూతగ వచ్చిన క్రాంతి కారి
    దేశ స్వాతంత్ర పోరుకు దిశను జూపె
    విశ్వ మానవ జాతికే వెలుగు నొసెగె
    పండి తనెహురు జన్మయే ప్రజల వరము

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవ పద్యం రెండవ పాదంలో యతి తప్పింది.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. జాతి మెచ్చిన జవహరు జన్మ దినము
    ప్రజల మొత్తము జరిపేటి పర్వ దినము
    బాల లందిరి కోసమీ భవ్య దినము
    భావి భారత పౌరుల వరలు దినము

    రిప్లయితొలగించండి
  8. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. నవయుగ వైతాళికుడని
    సవినయముగఁ జెప్పు చుండ సాటెవరయ్యా!
    సువిశాల భారతావని
    నవలీలగ నేలి నట్టి నాయక జయహో!

    రిప్లయితొలగించండి
  10. నిన్నటి పద్య రచన :
    శవమే రీతిగనడిగిన
    సవివరముగ బదులు నొసఁగు సన్మతి! మరలా
    శవమే చెట్టున్ జేరుచు
    జవాబుకై ప్రశ్నించు కధలు సరదా గుండున్!

    రిప్లయితొలగించండి
  11. దేశ వృద్ధికి బాటలన్ వేసి నట్టి
    నెహ్రు జన్మ దినమ్మును నేతలంత
    జరుపుచుండ్రి నేడు కరము సంతసముగ
    బాలలకు కడు ప్రేమను పంచి నట్టి
    మొదటి దేశ ప్రధానిని ముదముతోడ
    తలచు చుండిరి పిల్లలు తనివితోడ

    రిప్లయితొలగించండి
  12. మల్లెలవారి పూరణ
    బాలలందరు చాచాను బందువనుచు
    నెంచి జన్మదినమ్మును నేర్పు మీర
    ఆట పాటల నాడంగ నౌను గాదె
    బాలల దినోత్సవ మది పెద్ద వేడ్క

    రిప్లయితొలగించండి
  13. నా సీసపద్య ఎత్తుగీతి నాల్గవపాదం లో యట్టి తొలగించి చదువ వలెను

    రిప్లయితొలగించండి
  14. జాతి రత్న మంటి నెహ్రు జగతి మేలు గోరుచున్
    ఖ్యాతి దెచ్చు శాసనముల కలత దీర్చె నెల్లెడన్
    నీతి బాట నడువ మనుచు నిదుర లేపె బాలలన్
    జ్యోతి వోలె తాను వెలిగి శుభము లొసగె ధాత్రికిన్

    రిప్లయితొలగించండి
  15. బాలల దినోత్సవమ్ముగ
    మేలుగ నీ జన్మ దినము మెరిసెను చాచా !
    బాలలు నిను గీర్తించుచు
    వాలాయము నిన్ను దలచి వందన మనరే!!!


    రిప్లయితొలగించండి
  16. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  17. నీదు పుట్టిన రోజును నేడు మేము
    జరుపు కొనుచుంటిమి మఱి బా సు రముగాను
    బం డు గనువోలె ,మనసార పంచి పెట్టి
    చాకు లైట్లను బాలలు సంతసించ

    రిప్లయితొలగించండి
  18. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. చిరునవ్వులొలికించు చిన్నారులను చేర
    దీసి యాతడు సేద తీరినాడు
    ముచ్చటైన సుమము ముద్దు గులాబిని
    యెదపై పెట్టుక యెదిగినాడు
    స్వాతంత్ర్య సమరమ్ము సాగించు నప్పుడు
    గాంధీయనుచరుడై గడిపినాడు
    ముక్తినొందిన దేశ మొదటి ప్రధానిగా
    పంచశీల నమలు పరచినాడు

    ధనికుడైనను భారతావనికి సేవ
    జేయ బూనిన నిస్వార్థ జీవియతడు
    చిన్న పిల్లల బ్రేమించి చివరి వరకు
    నెహ్రు చాచగా నిలలోన నిలిచినాడు!


    రిప్లయితొలగించండి
  20. అలంకారము లేదు :

    పాపల బట్టిన పురుషుడు బాలలకు పండుగయ్యే , పాపల బట్టినయప్పుడు ఛా ఛా నెహ్రు , పిలుచుటకు మనకు అయ్యెను చా చా నెహ్రు

    రిప్లయితొలగించండి