10, నవంబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1546 (గాడిద పాదములఁ బట్టె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో!

27 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  గోకర్ణ మంటే పామని తెలుసుకున్న ఒక బాలుడు
  కంగారులో గోకర్ణ మనబోయి తప్పుగా గజకర్ణు డన్నాడంతే :

  01)
  ____________________________

  పాడేరున గోకర్ణము
  గాడిద పాదముల జుట్ట - కళవళమున నో
  బోడిక యీ వంక పలికె
  " గాడిద పాదములఁ బట్టె - గజకర్ణుఁ డహో "!
  ____________________________
  పాడేరు = ఒక ఊరు
  గోకర్ణము = పాము
  బోడిక = బాలుడు
  వంక = తప్పు

  రిప్లయితొలగించండి
 2. రేడగు నావసుదేవుడు
  గాడిద పాదముల బట్టె ,గజ కర్ణు డహో
  వేడుకగా గనిపించెను
  జూడగ నాచెట్ల మధ్య చూడ్కులు లలరన్

  రిప్లయితొలగించండి


 3. వేడెను తలిదండ్రులనే
  స్పీడుగ నే తిరుగలేను శిఖి వాహనుతో
  నైడియ నిమ్మని , " వినరా
  గాడిద" ! పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో !

  రిప్లయితొలగించండి
 4. మల్లెలవారి పూరణలు
  నాడెపు తామర పాకులు
  గాడిద పాదముల తాకె గజకర్ణములై
  కూడగ దప్పిక చెరువున
  గాడిద పాదముల బట్టె ,గజ కర్ణు డహో
  2.వేడుక గజకర్ణ మనెడు
  వాడగు విద్యను నొకండు ఘనముగజూపెన్
  తాడును పాముగ బట్టగ
  గాడిద పాదముల బట్టె ,గజ కర్ణు డహో

  రిప్లయితొలగించండి
 5. నాడా వసుదేవుండే
  గాడిద పాదములఁ బట్టె, గజకర్ణుఁ డహో!
  జూడగ చవితిన జంద్రుని
  పోడిమి చెడి నేలపైన పొర్లాడెనుగా!

  రిప్లయితొలగించండి
 6. పద్యరచన లో యిచ్చిన బొమ్మ ని తయారు జేసిన వానికి వినాయకుని విన్నపము
  "గాడిద! నాబొమ్మలతో
  నాడకు - చెట్టున వెలసితినని కధలల్లన్
  జూడకు వేడెద" నని యా
  గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో!

  రిప్లయితొలగించండి


 7. గాడిద పాదము బట్టిన
  వాడికి నిచ్చెదను వేయి వరహా లనినన్
  నీడగనద్దమ్మ౦దున
  గాడిద పాదముల బట్టె ,గజ కర్ణు డహో

  రిప్లయితొలగించండి
 8. వీడుము మూర్ఖపు చేతలు
  గాడిద, పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో !
  వేడెన నుగ్రహమునకై
  చూడుము తలిదండ్రి నటుల వేడుము నీవున్

  రిప్లయితొలగించండి
 9. గోలివారి పూరణ చాలాబాగుంది. చివర కాస్త అన్వయం సరిజేయండి

  రిప్లయితొలగించండి
 10. ఆడాలని బొమ్మలతో
  కూడేసిరి కరి,ఖరమ్ము,గోవుల ప్రతిమల్!
  చూడాలని బుట్టఁ దెరువ
  గాడిద పాదములఁ బట్టె గజ కర్ణుడహో!

  రిప్లయితొలగించండి
 11. కె ఈశ్వరప్ప గారి పూరణలు
  గోడకు వేసిన బొమ్మది
  గాడిద పాదముల బట్టె ,గజ కర్ణు డహో
  నాడతడెంతో వీరుడు
  జూడగ నా యన్న అహము జూపగ నింతే
  2.చూడగనప్పుడె బుట్టిన
  గాడిదపాదముల బట్టె ,గజ కర్ణు డహో
  వాడొక చాకలి రేవున
  తోడుగసా హాయ పడెను తొందర చేతన్

  రిప్లయితొలగించండి
 12. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
  మేడలకు కన్నము౦చుచు
  గాడిదపాదముల బట్టె ,గజ కర్ణు డహో
  వాడభినవ వసుదేవుడు
  వాడొక గజ దొంగ పట్టుబడు నను భీతిన్

  రిప్లయితొలగించండి
 13. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చూడ్కు లలరగన్’ అనండి.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో ‘వేడుచు’ అనండి.అన్వయం కుదురుతుంది.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వాసుని తండ్రియె’... అర్థం కాలేదు. వాసుడు అనే వ్యక్తి అనే అర్థమైతే సరే! వసుదేవుడు అనే అర్థంలో పొసగదు. ‘నాడా వసుదేవుండే’ అనవలసి ఉంటుంది.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తలిదండ్రుల నటు...’ అనండి.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఆడాలని, కూడేసిరి, చూడాలని’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘ఆడుటకై, చూడదలచి’ అనవచ్చు. కాని ‘కూడేసిరి’కి సవరణ నావల్ల కాలేదు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులు శంకరయ్య గారి సవరణలకు కృతజ్ఞతలు

  నాడా వసుదేవుండే
  గాడిద పాదములఁ బట్టె, గజకర్ణుఁ డహో!
  రౌడీ నాయకు డిప్పుడు
  వేడుచు వెంటబడిబట్టు వీడక కాళ్ళన్

  రిప్లయితొలగించండి
 15. మాస్టరు గారూ ! సహదేవుడు గారూ ! ధన్యవాదములు
  మాస్టరుగారు చూపిన సవరణతో....

  వేడుచు తలిదండ్రులనే
  స్పీడుగ నే తిరుగలేను శిఖి వాహనుతో
  నైడియ నిమ్మని , " వినరా
  గాడిద" ! పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో !

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం పరిశీలించ ప్రార్థన:
  ఆడుటకై బొమ్మలతోఁ
  గూడన్ బెట్ట కరి,ఖరము, గోవుల ప్రతిమల్!
  చూడుటకై బుట్టఁ దెరువ
  గాడిద పాదములఁ బట్టె గజ కర్ణుడహో!

  రిప్లయితొలగించండి
 17. సహదేవుడు గారూ,
  ‘చూడుటకై’ అనరాదు. చూచుటకై అనడం సాధువు.

  రిప్లయితొలగించండి
 18. కవిమిత్రులందఱకు నమస్కారములు!

  వేడి గజకర్ణనాముఁడు
  తోడెవ్వఁడు లేకయె సనె దొంగిలు కొఱకై!
  గాడిద యఱవఁగ, వద్దని
  గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో!!

  రిప్లయితొలగించండి
 19. గాడిద నెట్లుగ వేడెను
  వీడగ చెరసాల కట్లు వెన్నుడు బుట్టన్,
  చూడగ శివ తనయు డెవరు ?
  గాడిద పాదములు c బట్టె గజ కర్ణు డహో!
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 20. గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  క్రమాలంకార పద్దతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గురుదేవులకు ధన్యవాదాలు సవరించిన పద్యం :
  ఆడుటకై బొమ్మలతోఁ
  గూడన్ బెట్ట కరి, ఖరము, గోవుల ప్రతిమల్!
  చూడదలఁచి బుట్టఁ దెరువన్
  గాడిద పాదములఁ బట్టె గజ కర్ణుడహో!

  రిప్లయితొలగించండి
 22. వేడుకొనుచు వసుదేవుడు
  గాడిద పాదముల బట్టె; గజకర్ణుడహో
  వేడిన వారికి కష్టము
  లీడేరుచునుండు గదర యిహలోకమునన్!

  రిప్లయితొలగించండి
 23. బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఈడేరుచు’ శబ్దానికి కాపాడు, సిద్ధింపజేయు అని అర్థాలు. ‘కష్టము లీడేరుచు’ అంటే కష్టాలను కలిగించు అని అర్థం వస్తున్నది. అక్కడ ‘కోరిక| లీడేరుచు..’ అనండి.

  రిప్లయితొలగించండి
 24. గురువు గారికి నమస్సులు, అర్థ దోషము గ్రహించక పద్యం వ్రాసి పంపినందులకు క్షమించమని కోరుతూ సవరణతో...

  వేడుకొనుచు వసుదేవుడు
  గాడిద పాదముల బట్టె ; గజకర్ణుడహో
  వేడిన వారికి కోరిక
  లీడేరుచునుండు గదర యిహలోకమునన్!

  రిప్లయితొలగించండి
 25. వీడుము పాడౌ బుద్ధులు!
  కూడుగ హిందువుల తోడ కూర్మిగ జిన్నా!
  జోడుగ నుందమ్మనుచున్
  గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో!

  గజకర్ణుడు = మహాత్మా గాంధి

  రిప్లయితొలగించండి
 26. వీడగ బుద్ధిని సిద్ధిని
  గాడిద కూయగను బోవ గంభీరముగా
  బూడిద వ్రాయుచు మొగమున
  గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో!

  రిప్లయితొలగించండి