చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘నురగల్లె’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పాలనురుగుగా’ అనండి. * పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. బాలిక పరంగా మీ పద్యానికి నా సవరణ.... బంతి పూల మధ్య బాలిక దనరెను చంద్ర బింబమువలె జక్క గాను ముద్దు లొలుకుచున్న మోముతో దనరెను నవ్వు మొగము దాని నగవు చూడు . * వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. బాలిక పరంగా మీ పద్యానికి నా సవరణ.... బంతి పూవుల మధ్యను - బాల యొకతి చంద్ర బింబము వోలెను - చక్క నైన మోము వెలయించు చున్నది - ముద్దు గాను చిరుత నగవును చూడుడు - చెలువు మీర ! * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. * కుసుమ సుదర్శన్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘చందమామగా’ అనండి. * తాడిగడప శ్యామలరావు గారూ, మనోహరమైన పద్యాలు చెప్పి అలరింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు. * బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. పువ్వులును.. అనడమే సాధువు.
కవిమిత్రులకు నమస్సులు... మరికాసేపటిలో మిత్రులతో భద్రాచలం బయలుదేరుతున్నాను. రెండు రోజుల పోస్టులను షెడ్యూల్ చేసి ఉంచాను. ఈ రెండు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. అన్నట్టు... భద్రాచలంలో బ్లాగుమిత్రు లెవరైనా ఉన్నారా?
బంతి పూవంటి మోమున్న పసిడి బొమ్మ
రిప్లయితొలగించండిపాలనురగల్లె స్వచ్చమై ప్రబలుచున్న
సుందరంబగు నీనవ్వు సొగసు గూర్చె
చెదర నీకుమానవ్వు కాసింత గూడ
బంతి పూల మధ్య బాలుడు దనరెను
రిప్లయితొలగించండిచంద్ర బింబ మువలె జక్క గాను
ముద్దు లొలుకు చుండె మోమాత ని గదార్య !
నవ్వు మొగము వాని నగవు చూడు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింపను న్నవి !
బాలచంద్రుడు :
01)
__________________________________________
బంతి పూవుల మధ్యను - బాలుడొకడు
చంద్ర బింబము వోలెను - చక్క నైన
మోము వెలయించు చున్నాడు - ముద్దు గాను
చిరుత నగవును చూడుడు - చెలువు మీర !
__________________________________________
విరబూసినచేమంతుల
రిప్లయితొలగించండిసరసన బాలికముఖంబు చైతన్యంబై
మురిసెడు సరళినిఁజూడఁగ
నరయంగా పుష్పమిదియెననుకొంటినయా
ఆ చిత్రంలో ఉన్నది బాలిక... మా మేనబావ కూతురు. అసలు పేరేమిటో మరిచిపోయాను. ‘విన్నీ’ అని పిలుస్తాము. ఓరుగల్లుకోటలోని వాళ్ళ బంతిపూల తోటలో ఆ ఫోటో దిగింది.
రిప్లయితొలగించండిబంతితోటచూడ బాగుగా నుండెను
రిప్లయితొలగించండిపూవులెన్నొవిరగ బూసెనచట
బంతిపూలచెంత బాలికనిలుచుండి
నవ్వుచుండె బంతిపువ్వువోలె
బంతి పువ్వులు వికసించె వనము నందు
రిప్లయితొలగించండిపాప నవ్వులు వెదజల్లె పరవశించి
ముద్ద బంతుల ప్రక్కన ముద్దుపాప
సొంపు గలిగించె దృశ్యము చూపరులకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యలు గురుదేవులకు వందనములు..తప్పులున్నచో సవరించ గలరు.
రిప్లయితొలగించండిబంతి తోటలో బాలిక బంతి పూల
చెంత నిలుచుండి నవ్వుచు చెదర కుండ
చంద మామోలె వెదజల్లె చందిరికను
బంతి పూలలో తానొక బంతిపూవు..
బంతిపూల మధ్యనున్న బాలికాముఖాంబుజం
రిప్లయితొలగించండిబెంత ముగ్ధమోహనముగ నెసగుచున్నదో కదా
యింతులార గంటిరే మహీతలంబు నందు కే
రింతలాడు పిల్లదాని కేది సాటి చెప్పుడీ
పూలసొగసు గూర్చి యేమి పొగడ నుండు క్రొత్తగా
బాలసొగసు గూర్చి చెప్పవలెను నేడు చక్కగా
మేలు మేలు బంతిపూల మేలమాడు బాలికా
పోలలేవు నీనగవుల పూలకులుకు లెన్నగా
కొన్ని పూవు లిపుడు కోసి దేవుని సేవ
కర్పణంబు సేయు మపుడు విభుని
ముందు జన్మమందు ముద్దులపాపలై
పుట్టవలె నటంచు పూలు కోరు
పిల్లలు పువ్వులుయు పుడమి- ( పువ్వులును)
రిప్లయితొలగించండితల్లికి చేరువ ఒదిగిలి తలనిడ శుభమే
మెల్లగ మరిగిన వీడరు
చల్లగ బంతులనుతాక చక్కగ కనమే !
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నురగల్లె’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘పాలనురుగుగా’ అనండి.
*
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాలిక పరంగా మీ పద్యానికి నా సవరణ....
బంతి పూల మధ్య బాలిక దనరెను
చంద్ర బింబమువలె జక్క గాను
ముద్దు లొలుకుచున్న మోముతో దనరెను
నవ్వు మొగము దాని నగవు చూడు .
*
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బాలిక పరంగా మీ పద్యానికి నా సవరణ....
బంతి పూవుల మధ్యను - బాల యొకతి
చంద్ర బింబము వోలెను - చక్క నైన
మోము వెలయించు చున్నది - ముద్దు గాను
చిరుత నగవును చూడుడు - చెలువు మీర !
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
కుసుమ సుదర్శన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చందమామగా’ అనండి.
*
తాడిగడప శ్యామలరావు గారూ,
మనోహరమైన పద్యాలు చెప్పి అలరింపజేశారు. అభినందనలు, ధన్యవాదాలు.
*
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
పువ్వులును.. అనడమే సాధువు.
విరబూసిన బంతులలో
రిప్లయితొలగించండిమురియుచు తా మోము దాచె ముద్దుగ విన్నీ!
మెరియుచు పూవుల తోటన
చిరునగవులు చిందుచుండె చిత్రము లోనన్!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్సులు...
రిప్లయితొలగించండిమరికాసేపటిలో మిత్రులతో భద్రాచలం బయలుదేరుతున్నాను. రెండు రోజుల పోస్టులను షెడ్యూల్ చేసి ఉంచాను. ఈ రెండు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
అన్నట్టు... భద్రాచలంలో బ్లాగుమిత్రు లెవరైనా ఉన్నారా?
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిపద్య రచన విరిబాల
బాలిక సోయగమ్ముగన బంతి సుమమ్ములు పూచె నావనిన్
మేలిమి నున్నబుగ్గలను మెల్లగతాకెను తన్మయమ్మునన్
మీలిత కన్నులన్ చిరుత మించు సువాసన లాశ్వసించగా
మాలిమిజేసె నీ ప్రకృతి మాత యొసంగుచు దీవెనల్ సదా
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిపచ్చని పూబంతులతో
నచ్చిన భంగిమను నిల్చి నవ్వెడి బాలా!
మెచ్చిన ఛాయా చిత్రము
విచ్చెను గా విరుల నడుమ ప్రేమామృతమై.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
*
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ముద్ద బంతి పూ తోటలో ముద్దుగాను
రిప్లయితొలగించండిబూసినటువంటి చిన్నారి పూవు వీవు
వచ్చితివి యొంటిగా పూల వనికి తల్లి
చోరు లుంటారు జాగ్రత్త చూచి నడువు
ఆటలఁ బాటలఁ దేలుచు
రిప్లయితొలగించండితోటకుఁ జేరిన సొగసరి,తుంటరి విన్నీ!
నీటైన నీ నగవులకుఁ
బోటీ పడలేవె బంతి పూలెన్నైనన్!
పచ్చని బంతులు జూడగ
రిప్లయితొలగించండివిచ్చినవైయుండె నచట విరి బోలుచునే
విచ్చిన ముఖమున బాలిక
పచ్చగ తా నవ్వుచుండె బంతికి వంతై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి