6, నవంబర్ 2014, గురువారం

సమస్యా పూరణం - 1544 (పున్నమి వెన్నెలయె వేఁడి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

36 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులందఱకుం గార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలతో...

మిన్నగ నుండఁగ నెంచి్న
నిన్నటి తెలగాణ రాష్ట్ర నిశ్చిత బడ్జె
ట్టెన్నఁగ నాయకులకు నీ
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

వన్నెల యన్నుల మిన్నలు
వెన్నెలలో నాట్యమాడ వేడ్కను కంటిన్
నన్నేమి తప్పు బట్టకు
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

Sumalatha Majeti చెప్పారు...

పున్నెము యంచు తలచి గుడి
తిన్నెల పై భక్త కోటి దీపములిడ, లో
నున్న భవుడు సతితో యనె
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

subbarao చెప్పారు...

మిన్నగ హాయిని నిచ్చును
పున్నమి వెన్నెలయె, వేడి పుట్టించె శివా !
సన్నని వర్షపు జల్లులు
మన్నున బడి యుష్ణ మగుచు మాతనువు లకున్

వసంత కిశోర్ చెప్పారు...

అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

హైదరాబాదు ఎన్.టి.ఆర్ స్టేడియములో
కార్తీక పున్నమి నాడు-కోటి దీపాలొకేసారి - వెలిగినప్పుడు :

01)
__________________________________

చిన్నవి యైన ప్రమిద లట
కన్నుల పండువుగ కోటి, - కాంతు లెగయగన్
చెన్నుగ వెలిగించ జనులు
పున్నమి వెన్నెలయె వేఁడిఁ - బుట్టించె శివా !
__________________________________

వసంత కిశోర్ చెప్పారు...

మిత్రులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు !

A.Satyanarayana Reddy చెప్పారు...

అన్నుకొని యతివ లందరు
కన్నుల పండువగ దీప కలికల బెట్టన్
చెన్నగు కాంతులతోడను
పున్నమివెన్నెలయె వేడి బుట్టించె శివా!

krkr చెప్పారు...

మిన్నున చంద్రుడు చల్లని
వెన్నెల గురిపించినాడు విస్ఫుర లీలన్ ,
చిన్నెల దివ్వెలు మేదిన
పున్నమి వెన్నెలయె వే c డి c బుట్టించే శివా
కొరుప్రోలు రాధా కృష్ణ రావు

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఎన్నగ హెచ్చగు భక్తిని
నెన్నడు పూజ సలుపంగనేరనదెట్లో,
కన్నులు తెరిపించె, గొలువ
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఎన్నగ హెచ్చగు భక్తిని
నెన్నడు పూజ సలుపంగనేరనదెటులో,
కన్నులు తెరిపించె, గొలువ
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

బొడ్డు శంకర్ చెప్పారు...

కన్నుల పండువగు నటుల
పున్నమి రేయిన ముదితలు ముద్దగు ప్రమిదల్
మిన్నగ వెలిగించిగనే
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా ద్వితీయ పూరణము:

(ఒక యువకుని స్వగతము)

"అన్నుల మిన్నల హొయళులఁ
గన్నులఁ జూడంగ, మదినిఁ గాంక్షలు హెచ్చెన్!
మిన్నంటె విరహతాపము!!
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!!!"

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

జన్నము జేసిరి, దీపపు
సన్నని వత్తులను నేయి సమిథలు కాగా
నెన్నగ జ్యోతుల సెగలై
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా

కంది శంకరయ్య చెప్పారు...

గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పున్నె మటంచు తలచి,.... సతితో ననె’ అనండి.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘మిన్నుయు’ అన్నదాన్ని ‘మిన్నును’ అనండి.
రెండవ పూరణలో ‘తన్నుల కెగస’ టైపు దోషం అనుకుంటాను. అక్కడ ‘తన్నుల కెగసె’ అని ఉండాలి కదా.
మూడవ పూరణలో ‘కోటి దివ్వె కాంతులు’ అన్నది దుష్టసమాసం. దానిని ‘కోటి దీపకాంతులు’ అనండి.
*****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వెలిగించగనే’ టైపాటు వల్ల ‘వెలిగించిగనే’ అయింది.
*****
శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

sailaja చెప్పారు...

పున్నమి పర్వదినమ్మున
కన్నులపండువగ జనులు కామారి గుడిన్
మిన్నగ దీపము లుంచగ
పున్నమి వెన్నెలయె వేడి బుట్టించె శివా!!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా మూఁడవ పూరణము:

ౙన్నపుగొంగవు! నీకున్
గన్నయె నగ్గియు! మహేశ కరుణింౘుము! నీ
మిన్నంటు రూక్షవీక్షకుఁ
బున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!!

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

కన్నులు మిరుమిట్లుగొలుపు
చున్నవి దీపములు కాంతిశోభాయుతమై
మిన్నంటఁ గార్తికమ్మున
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా.

Unknown చెప్పారు...

పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
1.సన్నని చలి చక్కిలి గిలి,
చెన్నుగ ప్రియసతి సరసన, చిలిపిగ నేయన్
కన్నులవిల్తుడు యమ్మును
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చె శివా
2.చెన్నుగ తరుణుల బృందము
యెన్నో దీపములు పెట్ట నేర్పడు కాకల్
యెన్నగ కార్తిక మాసపు
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చె శివా

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘విల్తుడు + అమ్మును, బృందము + ఎన్నో, కాకల్ + ఎన్నగ’ అన్నపుడు యడాగమం రాదు.
‘విల్తుం డమ్మును... బృంద|మ్మెన్నో... కాకల్|పన్నుగ...’ అనండి.

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ చెప్పారు...

1.వన్నెల దుస్తుల కిలకిల
కన్నెలు కన్నుల సొగసుగ కాంతులు జిమ్మన్
మిన్నును నెర్రగ నవ్వగ
పున్నమివెన్నెలయె వేడి బుట్టించె శివా!

2.ఎన్నిక వాగ్దానమ్ముల
పన్నులు భారము పెరుగుగ ప్రజ భీతిల్లన్
తన్నుల కెగసె విపక్షము
పున్నమివెన్నెలయె వేడి బుట్టించె శివా!

3.సన్నని గొంతున పాడుచు
కన్నులశతకోటి దీప కాంతులు వెలుగై
చిన్నులు నృత్యము లాడగ
పున్నమివెన్నెలయె వేడి బుట్టించె శివా!

పూజులు , గురుతుల్యులు శంకరయ్య గారి సూచనలమెరకు , సరిదిద్ది నాను . ధన్యవాదములు

Unknown చెప్పారు...

కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
సన్నని నగవులరుచియే
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చెశివా
కన్నులననంగు తాపము
చెన్నుగ బిగి కౌగిలింత జేర్చగ రాదా

కంది శంకరయ్య చెప్పారు...

కె.యస్. గురుమూర్తి ఆచార్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

కె ఈశ్వరప్ప గారి పూరణ
పున్నమి వెన్నెల కంటెను
మిన్నగు వెలుగుంచె దీపమెరుపులు చలి లే
కున్నది గన కార్తీకపు
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చెశివా
2.పన్నెడి యూహల మనసున
తిన్నగ సద్భక్తి చమురు దీపము వెలుగుల్
ఎన్నడు చలిగిలి నుండగ
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చెశివా

Unknown చెప్పారు...

పూజ్యలు గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు..
ఈ పద్యంలోని భావ, గణ దోషాలను సవరించ మనవి.

సన్నగ వర్షము మొదలై
మిన్నగ చలిగాలి వీచి మేనును దాకీ
వెన్నంటిన వణుకునకున్
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘దీపమెరుపులు’ దుష్టసమాసం. ‘దివ్వెమెరుపులు’ అనండి.
*****
కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మేనును దాకన్’ అనండి. ‘తాకీ’ అన్నది వ్యావహారికం.

Unknown చెప్పారు...

మల్లెల వారి పూరణలు
మిన్నగు సేవల పార్వతి
క్రొన్ననలౌ తా మదనునికోమల బాణాల్
వెన్నెల నీమది కలచుట
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చెశివా
2.అన్నులమిన్నగు భార్యయు
పున్నమినాడల మడిగను పూజను దీపాల్
మిన్నగనిడ గాంచిన మది
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చెశివా
3.మిన్నగు చలి కటు కన్నెలు
వన్నెలతో దిరుగు చుండ బాగుగ గుడులన్
పున్నెము నొదవెడు నటుపై
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చెశివా
4.పున్నెపు కార్తీక మదియె
వెన్నెల దీపపు కణికల వెలువడు వేడిన్
చెన్నగు భామల యందా
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చెశివా





గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తిన్నగ బ్రోచెద వని నే
నన్నము విడి నక్తముండి యర్చన జేయన్
మిన్నగు జఠరాగ్ని సెగలఁ
బున్నమి వెన్నెలయె వేడిఁ బుట్టించె శివా!

Unknown చెప్పారు...

పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు తమరు సూచించిన విధముగ పద్యములను సవరించితిని
సన్నని చలి చక్కిలి గిలి,
చెన్నుగ ప్రియసతి సరసన, చిలిపిగ నేయన్
కన్నుల విల్తు౦డమ్మును
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చె శివా
చెన్నుగ తరుణుల బృంద
మ్మెన్నో దీపములు పెట్ట నేర్పడు కాకల్
పన్నుగ కార్తిక మాసపు
పున్నమి వెన్నెలయె వేడి బుట్టి౦చె శివా

కంది శంకరయ్య చెప్పారు...

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
సంతోషం!

బొడ్డు శంకర్ చెప్పారు...

గురుదేవులకు నమస్కారములు, సవరణతో.....

కన్నుల పండువగు నటుల
పున్నమి రేయిన ముదితలు ముద్దగు ప్రమిదల్
మిన్నగ వెలిగించగనే
పున్నమి వెన్నెలయె వేడి బుట్టించె శివా!

Sumalatha Majeti చెప్పారు...

ధన్యవాదములు గురువు గారు. సవరణతో....

పున్నెమటంచు తలచి గుడి
తిన్నెల పై భక్త కోటి దీపములిడ, లో
నున్న భవుడు సతితో యనె
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

Unknown చెప్పారు...

గురుదేవులకు నమస్కారములు, సవరణతో.....
సన్నగ వర్షము మొదలై
మిన్నగ చలిగాలి వీచి మేనును దాకన్
వెన్నంటిన వణుకునకున్
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

చిన్నప్పటి మిత్రులతో
మున్నెప్పుడు త్రాగనట్టి ముతక గుడుంబన్
తిన్నగ గుటగుట గొట్టగ...
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

అన్నులు చేరగ బీచిని
కన్నును కొట్టంగ నేను కలబడి డజనుల్
కన్నెలు చీరగ వీపును
పున్నమి వెన్నెలయె వేఁడిఁ బుట్టించె శివా!