26, నవంబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం - 1554 (దిగ్జయుం డనఁగ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దిగ్జయుం డనఁగ సవర్ణదీర్ఘసంధి.

22 కామెంట్‌లు:

  1. సంధులను నేర్పుచుండెను శంక రార్యు
    లచట సోదాహరణముగ నద్భుతముగ
    గోకులోత్తముడననది గుణసంధి, సర్వాష్ట
    దిగ్జయుం డనఁగ సవర్ణదీర్ఘసంధి

    రిప్లయితొలగించండి
  2. దిక్కులను పాలనము సేయు దేవతలను
    యుద్ధమందున ఓడించు సిద్దు డెవరు?
    అచ్చులకు నచ్చు cగూడగ వచ్చునేమి ?
    దిగ్జయుం c డనగ ,సవర్ణ దీర్ఘ సంధి
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  3. దిక్కు లెల్లను జయియించు దీటు గాడు
    దిగ్జయుండనగ ,సవర్ణ దీర్ఘ సంధి
    యచ్చున కదియే యచ్చు లు వచ్చి యగును
    దెలిసి కొను మమ్మ యి ట్లుగా తేజ ! నీవు

    రిప్లయితొలగించండి

  4. సంధులు తెలియని జిలేబి తెలుగు పరీక్షన
    రాసెన్ దిగ్జయుం డనఁగ సవర్ణదీర్ఘసంధి !
    అయ్యవారు తలబట్టుకుని ఈ జిలేబి ని
    పో పో పొమ్మని 'ప్యాసు' మార్కు వేసి తరిమెన్ !!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. విశ్వ మంతయువిహరించి విసుగు బుట్టి
    తెనుగు నేర్వగ కూర్చొంటి తీట గొద్ది
    సంధి యన వ్రాసెనెట్టున పందియొకడు
    "దిగ్జయుం డనఁగ సవర్ణదీర్ఘసంధి."

    రిప్లయితొలగించండి
  6. http://www.andhrabulletin.in/AB_Telugu/telugu_vyaak_sandhulu.php
    1.సవర్ణదీర్ఘ సంధి - ఆ,ఇ,ఉ,ఋ లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.
    ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,

    రిప్లయితొలగించండి

  7. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తెనుగు తరగతి లోవ్యాకరణపు పాఠ
    మందు ప్రశ్ని౦చె నధికారి "యర్ధమేమి,
    దిగ్జయుండనగ?" "సవర్ణ దీర్ఘ సంధి"
    యని తడబడి ఛాత్రు౦డు పల్కెను భయమున

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మరికాస్త - శ్రద్ధ :

    01)
    ___________________________

    దిగ్జయుం డనఁగ సవర్ణ ♦ దీర్ఘసంధి
    యనిన శిష్యుని తెలివికి, ♦వినిన గురువు
    తెల్లబోయెను మరియును ♦ తల్లడిల్లి
    చదువ మనె నంత మరికాస్త ♦ శ్రద్ధతోడ
    ___________________________

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సర్వాష్ట’ లో సరే... మరి ‘దిగ్జయుడు’లో జశ్త్వసంధి ఉంది కదా!
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    అచ్చునకు అచ్చు కలిసేవి గుణ, యణాదేశ, వృద్ధిసంధులు కూడా. అచ్చున కదే అచ్చు కలిసేది సవర్ణదీర్ఘసంధి కదా! ‘అచ్చున కదె యచ్చు కలువ వచ్చు నేది’ అనండి.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జయియించు’ అన్నచోట ‘గెలిచెడి’ అనండి.
    ****
    జిలేబీ గారూ,

    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఆంధ్రబులెటిన్’ వారి లింకు ఇవ్వడంలో మీ ఉద్దేశ్యం అక్కడి ఉదాహరణ తప్పు అని చెప్పడమా? ‘రాజు + ఆజ్ఞ = రాజునాజ్ఞ’ అవుతుంది. వాళ్ళు ‘రాజ + ఆజ్ఞ = రాజాజ్ఞ’ అని ఇవ్వవలసింది.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అధికారి అర్థం అడిగితే పిల్లవాడు సంధి చెప్పాడు!

    రిప్లయితొలగించండి
  10. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నెట్టు లో పంది యని నేను అన్న దాన్ని సమర్ధిస్తూ ఈ ఉదాహరణ చూపాను

    రిప్లయితొలగించండి
  12. దిగ్జయుండెవ్వరు సవర్ణ ధీర్ఘసంధి
    సూత్ర మేమని యడిగెను స్కూలు పెద్ద
    తెలుగు పదనిధి వెదకినా తెలియ లేదె
    దిగ్జయుండనగ, సవర్ణ ధీర్గసంధి
    యచ్చునకదె యచ్చు కలువ వచ్చు ననుచు
    గురువు గారికి చెప్పెను చిఱుత యొకడు

    రిప్లయితొలగించండి
  13. కె.ఈశ్వరప్పగారిపూరణ
    కంది శంకరయ్యిడుప్రశ్న అందరికిని
    "దిగ్జయుండనగ?సవర్ణ దీర్ఘ సంధి"?
    ఒప్పనెను నేల ననగను "గొప్పగైడు"
    జూచి తెలిపెను విద్యార్ధి చోద్యముగను

    నవంబర్ 26, 2014 3:00 PM

    రిప్లయితొలగించండి
  14. కె.యెస్.గురుమూర్తి గారిపూరణ

    దిగ్జయుండనగ, సవర్ణదీర్ఘ సంధి
    కాదు దానిలో దీర్ఘంబు లేదు కనుక
    దిగ్జయుండన జస్త్వ సంధి యగును కద
    పండితులు మీకు తెలియని పాఠమేది

    రిప్లయితొలగించండి
  15. ఒకటొకగ దిక్కులఁ గెల్చు యోధు నకును
    తోటి రాజులు సామంత కోటి యైన
    దిగ్జయుండనఁగ 'సవర్ణ దీర్ఘ సంధి'
    నమరి నట్లౌను భువి పైన హద్దు లేక
    ( సవర్ణ దీర్ఘ సంధి=తోటి రాజులతో ఏర్పడ్డ దీర్ఘ సంధి. )

    రిప్లయితొలగించండి
  16. దిక్కులను పాలనము సేయు దేవతలను
    యుద్ధమందున ఓడించు సిద్దు డెవరు?
    అచ్చున కదెఅచ్చు కలువ వచ్చు నేది ?
    దిగ్జయుం c డనగ ,సవర్ణ దీర్ఘ సంధి
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు26/11/14

    రిప్లయితొలగించండి
  17. సంస్కృతంబున సంధులు చాల గలవు
    హల్లులందున జస్త్వంబు ననెడు నదియె
    దిగ్జయుండనగ-సవర్ణదీర్ఘ సంధి
    యగును రామాలయంబన,నమరు నవియె

    దిక్కులన్నియు నొకటైన దీర్ఘమైన
    రాజ్యమగునుగా-నొకరాజు రాజితముగ
    జయమునందిన రాజ్యాల చయము జేరు
    దిగ్జయండనగ,సవర్ణదీర్ఘ సంధి

    రిప్లయితొలగించండి
  18. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ వ్యాఖ్య అర్థం కాలేదు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శంకరయ్య + ఇడు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
    ****
    కె.యస్. గురుమూరి ఆచార్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీగురుభ్యోనమ:

    దిక్కులన్నియు గెలువంగ ధీరవరుని
    దిగ్జయుండనఁగ, సవర్ణదీర్ఘసంధి
    కాదు, జస్త్వసంధి యనుచు మోదముగను
    శిష్యులకు ప్రేమతో బోధ జేసె గురువు.

    రిప్లయితొలగించండి
  21. సమాన కులాల మధ్య జరిగే దీర్ఘమైన సంధి అనే అర్ధంలో దిగ్జయుడనే రాజు,మంత్రుల తంత్రం..

    దిగ్జయుండనగ 'సవర్ణదీర్ఘ సంధి'
    అతని మంత్రియె తెల్పెను యదియె మేలు
    రాజ్య విస్తృతి కదియౌను రాచబాట
    ప్రజల యుద్ధ భీతియె నాడు వాసిపోయె!

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి