25, నవంబర్ 2014, మంగళవారం

నిషిద్ధాక్షరి - 21

కవిమిత్రులారా,
అంశం- అత్తలేని కోడ లుత్తమురాలు.
నిషిద్ధాక్షరములు - తవర్గాక్షరములు (త,థ,ద,ధ,న)
ఛందస్సు - ఆటవెలఁది.

26 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అత్త లేని కోడలుత్తమురాలు :

    01)
    ___________________________

    ఎవ్వ రడ్డు వారు - యే చొప్పు చరియించ
    కసరు వారు లేక - కలల గూడ !
    సర్వ మామె యిచ్ఛ - సామ్రాఙ్ఞి యామెయే
    శ్వశ్రువచ్చిక యగు - శ్రమణె సుగుణ !
    ___________________________
    శ్వశ్రువులు = భర్తతల్లి = అత్త
    అచ్చిక = లోపము
    శ్రమణ = స్త్రీ(కోడలు)
    సుగుణ = ఉత్తమురాలు

    రిప్లయితొలగించండి
  2. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    మామభార్య లేక మగువ సుగుణశీల
    సకల కార్యములకు స్వామి యామె
    కొలువుజేసి సిరులు గూర్చుచు వంశమ్ము
    వెలయజేయు ప్రజలు ప్రియము పొగడ

    రిప్లయితొలగించండి
  3. ఆలి వీడి వెళ్ళె ఆయువే చెల్లగ
    కోడ లొచ్చె వలచి కొడుకు వెంట
    ఇంట వెలసె గొప్ప ఇలవేల్పెయిప్పుడు
    నిండు ప్రేమ జూపి వండి పెట్టు

    రిప్లయితొలగించండి
  4. కష్ట బెట్ట రెవరు కలహమ్ములుండవు
    జంకు లేక సాగు సారసాక్షి
    బార్య రాణి వోలె పాలించు గేహము
    శ్వశ్రు వలకువయగు జామె సుగుణ

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వారు + ఏచొప్పు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఎవ్వ రడ్డువార లేచొప్పు’ అనండి.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘వెళ్ళె’ అన్నదాన్ని ‘వెడలె’ అనండి. ‘వచ్చె’ అనేదానికి ‘ఒచ్చె’ గ్రామ్యరూపం. ‘కోడ లొనర వచ్చె’ అనండి.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. భార్య భూమి వీడి బ్రహ్మ లోకము బోవ
    కొడుకు కరముబట్టి కోడలమ్మ
    మంచి పేరుబడసె మామయ్యఁ సేవించి
    కోడ లమ్మ గూర్చె గొప్ప పేర్మి

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. కోడలమ్మమంచి కోడలమ్మకెరుక!
    శ్వశ్రువు సుగుణమ్ము బ్రహ్మ కెరుక!
    యీమె లేక యామె కే వమ్మ కష్టాలు?
    యింటి రాణి! మగడి కంటి దివ్వె!

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమ:

    మేనక హిమవంతుల స్వగతం

    మామ,మామభార్య మా యుమకు లేరాయె
    మంచివాడు శివుడు మగడు కాగ
    సర్వమంగళములు సమకూర్చు మా యమ్మ
    శ్రేష్ఠురాలు జగము లేలుచుండె

    రిప్లయితొలగించండి
  10. కెయెస్.గురుమూర్త్తి ఆచారి గారి పూరణ

    మగడు కీలు బొమ్మ మాడ్కి యాటాడగా
    భయములేక చెప్పు వారులేక
    వ్యయము చేయు కోడలౌగ గొప్పింటామె
    మామ గారి భార్య మగువకడ్డు

    రిప్లయితొలగించండి
  11. కె.ఈశ్వరప్పగారి పూరణ

    లక్ష్మి,వాణి,యంబ లక్ష్యాలె సాక్ష్యాలు
    ఆడపడుచు లమ్మలేడ లేక
    కొడుకులుంచు సుఖము కోడళ్ళ కబ్బెగా
    లోకులె౦చు టాయెసాకుబెట్టి

    రిప్లయితొలగించండి
  12. శ్వ శ్రువ యిక లేని శ్రమణి యే మిన్నగు
    నెందు కనగ నడ్డు నెవరు రారు
    ఇష్ట మైన మార్గ మెంపిక జేసికు
    లెక్క జేయ కెవరి యొక్క మాట

    రిప్లయితొలగించండి
  13. మామ భార్య లేక మహి వెల్గు వాడుగా
    మగడు భార్యమాట మసలు చుండ
    నాడుబిడ్డ లేక యా కోడలౌ జూడ
    లోకము పలుకాడు రూఢి గొప్ప

    డబ్బు లెక్కలేక డాంబికమ్ములు జేయ
    మగడు మగువ కడ్డు మాట లిడక
    మామ భార్యవీడు మంచి సంసారియౌ
    కోడలప్పుడగుగ గొప్పవడసి

    మలయు మంజులంపు మాటలే గలిగియు
    మగువ మగడు మెచ్చు మంజు గుణియు
    మామ భార్య లోకమటులనే వీడగా
    కోడలపుడు యశము గొప్పవెలుగు

    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జేసికు’...?
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గురుదేవులకు ధన్యవాదములు.చివరి పాదంలో 'ది' వాడాను. సవరించిన పద్యం :
    కోడలమ్మమంచి కోడలమ్మకెరుక!
    శ్వశ్రువు సుగుణమ్ము బ్రహ్మ కెరుక!
    యీమె లేక యామె కే వమ్మ కష్టాలు?
    యింటి రాణి! మగడి కంటి వెలుగు!

    రిప్లయితొలగించండి
  16. సహదేవుడు గారూ,
    నిన్నటినుండి జ్వరం వస్తున్నది. అందువల్ల పద్యాల పరిశీలన నిశితంగా చేయలేకపోతున్నాను.
    సవరించిన పద్యం బాగుంది. సంతోషం!
    ‘పద్యరచన’ శీర్షికకూ ఇదే సమాధానం.

    రిప్లయితొలగించండి
  17. శ్వ శ్రువమఱి లేక శ్రమణి యేయెక్కువ
    యడ్డు వచ్చు వారె యచట లేరు
    ఇష్ట మైన మార్గ మెంపిక జేసికు
    లెక్క జేయ కెవరి యొక్క మాట

    రిప్లయితొలగించండి
  18. భార్య చచ్చి పోయి పరలోక మేగగ
    కొడుకు పెండ్లి జేయ కోడలమ్మ
    వచ్చి మామకు మరి స్వామికి సేవలు
    చేసి పేరు బడసె చిగురుబోడి!

    రిప్లయితొలగించండి
  19. శ్వశ్రువు లేక కోడలికి సౌఖ్యములే యిక మెట్టు వీటిలో
    యశ్రువులేమి పారవుగ యారడి పెట్టెడి వారి లేమిచే
    యే శ్రమ కూడ లేక కడకింటికి యామెయె రాణియౌ సుమా
    ప్రశ్రయముల్ లభించు పరివారములోగల వారివాక్కులో

    రిప్లయితొలగించండి
  20. సుబ్బారావు గారూ,
    ‘జేసికు’ అన్నదానికి వివరణ ఇవ్వలేదు.
    ****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మెట్టువీటిలో’ అన్నదాన్ని ‘మెట్టినింటిలో’ అంటే?

    రిప్లయితొలగించండి
  21. మొదట మెట్టినింటిలో అనే వ్రాసాను మాష్టారు ..'న' నిషేధించబడింది గదా !

    రిప్లయితొలగించండి
  22. ఛందస్సు ఆటవెలది అని ఇప్పుడే చూసాను ... క్షంతవ్యుడిని

    రిప్లయితొలగించండి
  23. రుకులు పరుగుల మీద ఆట వెలది వ్రాయ వలసి వచ్చింది
    శ్వశ్రువు భువి విడిచి పరలోక మేగుటే
    గొప్ప వరము సుమ్మ కోడలమ్మ
    యింటి సర్వ హక్కు లింక యెవ్వరివిలే
    చక్కబెట్టుకొమ్మ సంసరణము

    రిప్లయితొలగించండి
  24. సూర్యనారాయణ గారూ,
    నిజమే... మన్నించండి... నకార నిషేధం గుర్తులేదు.
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. శంకరయ్య గారికి నమస్కారములు. చేసికొని అను అర్ధములో చేసికు అని వ్రాసాను.తప్పయితే క్షంతవ్యుడను.మార్పు చేయగలవాడను. తెలియజేయగోర్తాను

    రిప్లయితొలగించండి