8, నవంబర్ 2014, శనివారం

సమస్యా పూరణం - 1545 (హరిని భజించువారలకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
హరిని భజించువారల కనంతవిపత్తులు గల్గు మిత్రమా!

41 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింపను న్నవి !

    హరుణ్ణి తిట్టి - హరిని భజిస్తే - అంతేగదా మరి :

    01)
    __________________________________________

    హరిహరు లేక మూర్తులని - యాత్మ దలంపక నంధ భావనన్
    యురగపు భూషధారి, మరి - యుక్షపు వాహనధారి, ఝర్ఝరిన్
    గిరిసుత భర్త దిట్టుచును - గేలిని సేయుచు హెచ్చ మూర్ఖతన్
    హరిని భజించువారల - కనంత విపత్తులు గల్గు మిత్రమా!
    __________________________________________

    రిప్లయితొలగించండి
  2. బుద్ధి లేని ముగ్గురు శిష్యులు
    ఒక గురువు వద్ద శుశ్రూష జేసి
    ఎముకల నతికించే మంత్ర మొకడు
    రక్త, మాంసముల నేర్పరచే మంత్ర మొకడు
    ప్రాణప్రతిష్ఠ జేయగల మంత్ర మొకడు నేర్చుకొని
    ఒక అడవిలో నున్న ఎముకలగుట్టను గాంచి, మంత్రముల పరీక్షింప నెంచి
    ఒక సింహమునకు ప్రాణము పోసిన పిమ్మట
    చేతులెక్కి మ్రొక్కినా, చుట్టూ ప్రదక్షిణలు చేసినా
    రక్షింపమని ప్రార్థించినా , పూజించినా
    జరిగేదదే గదా :

    02)
    __________________________________________

    దొరకొని బుద్ధి హీను లట - దొడ్డగు మంత్ర పరీక్ష జేయగన్
    దిరుగుచు కాన లోన నొక - త్రెళ్ళిన సింహపు కీకసంబులన్
    స్థిరముగ బేర్చి, ప్రాణ మిడి - చేతుల మ్రొక్కుచు, చుట్టు దిర్గి, యా
    హరిని భజించు వారల , క - నంత విపత్తులు గల్గు మిత్రమా !
    __________________________________________
    కీకసము = దేహధారకము = ఎముక
    హరి = సింహము; పాము;

    రిప్లయితొలగించండి
  3. దుష్ట,ధన మదాంధ మంత్రి రావుగోపాలరావు కొడుకు శ్రీహరి !
    కాలేజీలో పదిమందిని వెంటేసుకొని అల్లరి చేస్తుంటాడు !
    తనను పొగడే వారికి మందు విందు తదితరాల కోసం
    చేతికి ఎముక లేనట్టు ఖర్చు పెడతాడు !

    వాడి జోలి కెళ్ళకు - వెళ్తే ఖర్చయి పోతావని
    కొత్తగా చేరిన ఆటగాడైన రామారావునకు
    బుద్ధిమంతుడైన నాగేశ్వరరావు ఉద్బోధ :

    03)
    __________________________________________

    సిరులకు లోటు లేదు తన - చేతికి నస్థులు లేవు చూడగన్
    విరి వన మందు బంగి వలె - వీ డిట నుండెను దుష్టవర్తనన్
    దొరలకు వాని వెంట, పలు - దోషము లంటును, చేర మిత్రతన్ !
    హరిని భజించు వారల , క - నంత విపత్తులు గల్గు మిత్రమా !
    __________________________________________
    బంగి = గంజాయి
    దొరలు = తిరుగు

    రిప్లయితొలగించండి
  4. అరయగ మోక్షమిచ్చి సముదంచితరీతినిసంస్కరింపఁ బల్
    తెఱఁగు పరీక్షలన్ సలిపి తీవ్రతరంబగుభక్తిభావనల్
    మెరయగఁజేసినిల్పఁగలమిన్నగు ప్రక్రియగాదె కాన శ్రీ
    హరిని భజించువారలకనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  5. ధరణిని యేలు దైవమను తత్వమెరుంగక భక్తిలేమితో
    చరణములన్ స్పృశింపక విచారము లేకను వాదులాడుచున్
    కరములతోడ మ్రొక్కక నకారణ ధూషణ చేయుచుండి యా
    హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘అంధభావనన్ + ఉరగపు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘అంధచిత్తుఁడై| యురగవిభూషణుండు...’ అనండి.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్దు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధరణిని + ఏలు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ధరణిని బ్రోచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. సవరణతో.....

    ధరణిని బ్రోచు దైవమను తత్వమెరుంగక భక్తిలేమితో
    చరణములన్ స్పృశింపక విచారము లేకను వాదులాడుచున్
    కరములతోడ మ్రొక్కక నకారణ ధూషణ చేయుచుండి యా
    హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా

    రిప్లయితొలగించండి
  8. హరిని పరాత్పరుం విడచి యన్యుల సేవల నుండవచ్చునే
    నరులకు దేవదానవగణంబుల నెవ్వరికైనను దారిదప్పి స్త్రీ
    పరముగ బుధ్ధి నుంచి సుఖవాంఛల దోగుచు నిత్యమున్ మనో
    హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  9. తాడిగడప శ్యామలరావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పరాత్పరున్ విడచి’ అనాలి కదా. అక్కడ ద్రుతకార్యానికి అవకాశం లేదు. రెండవ పాదంలో గణదోషం. ‘గణంబుల కైనను దారితప్పి స్త్రీ...’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  10. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు మురియుచువ్రాసెభాగవతమున్ తెనుగున్ మనపోతరాజు నున్
    మరి యెవరయ్యదిక్కనినమాన్యులు త్యాగయ రామదాసుల న్
    తరణము జేసె నీ భవము దర్శన మిచ్చుచు బ్రోచె గాని శ్రీ
    హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా

    రిప్లయితొలగించండి
  11. అరుణుని వంకజూచి మరి యంజలిచేసిన ప్రొద్దుమాపునన్
    దొరుకును పుణ్యమంచు తమ దోసిలినుంతురు జ్ఞానకోవిదుల్
    ఎరుకగు వారుచేయు విధమెప్పుడు నిల్చియు మండుటెండలో
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    కాని సమస్య పరిష్కరింబడనట్టున్నది.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కోవిదుల్ + ఎరుగక’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘జ్ఞానులెల్ల తా| మెఱుగక...’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్సులు...
    మరికాసేపటిలో మిత్రులతో భద్రాచలం బయలుదేరుతున్నాను. రెండు రోజుల పోస్టులను షెడ్యూల్ చేసి ఉంచాను. ఈ రెండు రోజులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
    అన్నట్టు... భద్రాచలంలో బ్లాగుమిత్రు లెవరైనా ఉన్నారా?

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    స్మరణ సుకీర్తన శ్రవణ సఖ్య నివేదన సేవ నార్చనా
    పరతను దాసులై యెపుడు వందనమున్ దగఁ జేయుచున్ హరిన్
    నిరతము హృత్సరోజమున నిల్పక, నిత్యము హృత్స్థయౌ మనో
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి

  15. గురుదేవులు సూచించిన సవరణకు ధన్యవాధములు, సవరణతో....

    అరుణుని వంకజూచి మరి యంజలిచేసిన ప్రొద్దుమాపునన్
    దొరుకును పుణ్యమంచు తమ దోసిలినుంతురు జ్ఞానులెల్ల తా
    మెరుగక వారుచేయు విధమెప్పుడు నిల్చియు మండుటెండలో
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    ఇరువురు రాక్షసాథములు హీన తనంబున పల్కి రిట్టులన్
    సురలకు మేలు జేయు మధుసూధను డెన్నడు స్వార్థ చిత్తుడై
    స్థిరముగ గీడు గోరునట దేవవిరోధుల కెల్ల, శత్రువౌ
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  17. కె.యెస్, గురుమూర్తి ఆచారి గారి పూరణ
    పరవశుడై హిరణ్య కశిప ప్రియపుత్రు డిటుల్ వచి0చె సు
    స్థిరమగు సౌఖ్యసంపదలు చేకురు మోక్షము లభ్యమౌగదా
    హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గు మిత్రమా
    మరచి చరి౦చు నా మృగసమాన జనాళికి నిశ్చయమ్ముగా

    రిప్లయితొలగించండి
  18. హరికిని భక్తులైనపుడు,హాయగు నాతని నామమొక్కటే,
    అరయగ నెల్లభక్తులును నైహికమందున సౌఖ్యమందకే
    పొరలరె కష్టవాహినుల పూర్తిగ,నా పరమందు మోక్షమున్
    హరిని భజించు వారలకనంతవిపత్తులు కల్గు మిత్రమా!

    హరికల భక్తుడై కనడె యంతము లేకను కష్టముల్ వెసన్
    కర మరి యైన యా కనక కశ్యపు చేతను వాని సూనుడే
    భరమగు కష్టముల్ కలిగె పాండవవీరుల కెన్ననెన్నియో
    హరిని భజించువారలకనంత విపత్తులు కల్గు మిత్రమా!

    హరి గన బద్రినాధమున నందరు నేగిరి కష్టనష్టమా
    కరమగు మంచుకొండలకు,కాలినడన్ తముపోవు చుండగా
    నెరుగని రీతి గంగయది యెంతయు పొంగుచు ముంచి చంపదే!
    హరిని భజించు వారలకనంత విపత్తులు కల్గు మిత్రమా!

    నరులకు నంకితం బిడక నాతని భాగవతంబు రాముకే
    చిరముగ నంకితంబిడియు,సేద్యము చేతనె భక్తి తా గొనెన్
    వరకవి పోతనార్యుడిల భక్తిని,కష్టము లెన్నొ కల్గినన్,
    హరిని భజించువారలకనంత విపత్తులు కల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. స్థిరమగు భక్తి భావనల చిత్తము నందున చేర నీకయున్,
    నిరతము ఇచ్చి పుచ్చు కొను నేరుపు గానిగనిల్చు మానవున్
    దరతమ భేద మెంచుచును ధర్మము గానని నాస్తి భావ బే
    హరిని భజిం చు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  21. నా భద్రాచలం ప్రయాణం సాయంత్రానికి వాయిదా పడింది.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    నవవిధభక్తులను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    అర్చనాపరత టైపాటువల్ల ఆర్చనాపరత అయినట్లుంది.
    ****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    విష్ణుద్వేషులైన రాక్షసుల మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    చిన్నచిన్నలోపాలున్నవి. ప్రయాణపు తొందరలో సవరించలేకపోతున్నాను.
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ధన్యవాదములు శంకరయ్యగారూ!

    ...సేవన + అర్చనా/పరత...యని వ్రాసితిని.

    సవర్ణదీర్ఘసంధి జరిగి యది..
    ...సేవనార్చనా/పరత..యను రూపమందినది.

    టైపాటు జరుగలేదు. పరిశీలింపుఁడు.

    రిప్లయితొలగించండి
  23. గురుతుల్యులు శంకరయ్య గారు చూసి
    నా ఈ ప్రయత్నమున తప్పులున్న మన్నించి సలహాలనివ్వ ప్రార్ధన
    వరములు కోరి బుద్ధియు ప్రవర్తన తోడునలేక, మోసమున్
    కరమున పూజ లెందులకు? కాటము లవ్వును నీకు చూడగా
    స్వరమును పెంచి పూజలు రచింపగ పాపము కాదె ? వేషమున్
    హరిని భజించువారలకనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  24. మిత్రులు శంకరయ్యగారికి, సవరణలకు ధన్యవాదాలు. (హడావుడిగా బయటకు వెడుతూ వ్రాస్తే దోషాలు దొరలాయి!) సరిచేసిన పద్యం:

    హరిని పరాత్పరున్ విడచి యన్యుల సేవల నుండవచ్చునే
    నరులకు దేవదానవగణంబుల కైనను దారిదప్పి స్త్రీ
    పరముగ బుధ్ధి నుంచి సుఖవాంఛల దోగుచు నిత్యమున్ మనో
    హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  25. హరిని తలంపకుండ మనమర్పన జేయుక దైవసన్నిధిన్
    తరుణుల జూచి మోహపడి తన్మయమొందచు ప్రేమపేరుతో
    నిరతము చూపునిల్పుచును నెచ్చెలు లందున నందమౌ మనో
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  26. దురితము లెల్ల నాశమగు దుఃఖము వాయును దీరు కోర్కులున్

    మరవక నిత్య పూజలును మంచి మనంబున నిర్మ లాత్మతో

    హరిని భజించు వారల , కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    నరహరి సేవ జేయని సనాతన ధర్మవిరోధ జాతికిన్

    రిప్లయితొలగించండి
  27. కె ఈశ్వరప్పగారిపూరణలు
    హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గుమిత్రమా
    హరికడజీవనంబిడిన నందెను కష్టము సాలె పట్టుకున్
    హరి పరమాత్మ సేవకు సహాయము జేసెను ఎంచిచూడ యా
    హరి కరుణామయుండనగ హస్తికి నష్టమె కాళహస్తి లో
    2.హరి యన మూర్తు లంట మరి యంబకు వాహన మంట వింటివా
    హరియన కోతి గుర్రమట హ౦సయు ఇంద్రుడు సూర్యుడ౦దురే
    హరియన పాము అగ్నిచిలుకైనచొయిందున ఏది చెప్పుమా
    హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గు మిత్రమా

    రిప్లయితొలగించండి
  28. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    మరియొకపూరణ హరియనకప్ప పూజలనొనర్చిన పాముగ నాగ్రహించునే
    హరియను గుర్రమున్ కొలువ హాస్యముచేయును వానరమ్ముయౌ
    హరి,నిక చిల్కయౌ హరిని యర్చనసేయగ నొంచు సింహ మే
    హరిని భజించు వారల, కనంత విపత్తులు గల్గు మిత్రమా

    రిప్లయితొలగించండి
  29. తెలుసు కొనుము దేవుని లీ
    లలు హరిని భజించువారల కనంతవిప
    త్తులు గల్గు మిత్రమా! యిడు
    ముల సైచి నిలబడు వారె ముక్తిని బొందున్

    రిప్లయితొలగించండి
  30. ఉరగము లల్లి మాలలిడనోర్పను వీడక మాధవా యనన్
    కరములఁ బంపి దానవుఁడు గాయమొనర్చిన కేశవా యనెన్
    మరువక బాలుడైన తను మానక గొల్వ పరీక్ష జేయడే?
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  31. కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారూ మీ కంద ప్రయత్నం బాగుంది. మన గురువుగారు మీరనుకుని నాతో చరవాణి ద్వారా మీ పద్యం గురించి చర్చించ బోయారు.వారు భద్రాచలం వెళ్లే హడావుడి లో వున్నట్లున్నారు,మీకు వీలైతే మాట్లాడండి.

    రిప్లయితొలగించండి
  32. మరిమరి జెప్పితిన్ వినుము మంచిని గూర్పెడు నొక్క మాటనే
    హరిహరులొక్కటేయనెడు నద్భుత సత్యము త్రోసిపుచ్చుచున్
    హరి మది దిట్టుచున్ హరుని యర్చన జేయుచు, శంభుదిట్టుచున్
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా !

    రిప్లయితొలగించండి
  33. గురువు గారికి వందనములు, తొలిసారిగ వృత్తం రాయుటకు సాహసించాను, తప్పులను సవరించి వెన్ను తట్టి దీవించ మనవి.

    పరవశ మొంది జేసినను పామరు లైన నపార జ్ఞానులై
    న రసమయమ్ము తోడ హరి నాథుని పూజలు పెక్కు భక్తితో
    కరుణ కటాక్షితుండగుచు కావును భక్తుల, నట్లు జేయ కా
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా

    రిప్లయితొలగించండి
  34. పరమగు భక్తి తోడను నివాసము నందున పుట్ట బెంచి నొ
    క్క రమణి పూజలన్ సలిపె కాంచ సుఖమ్ములు నిత్య మింటిలో
    కఱువగ సర్ప మాయమను కాంతుడు పల్కెను శోక మగ్నుడై
    హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి
  35. పరుగులు పెట్టు వారలు ప్రపంచము నంతయు చుట్టుచుండగన్
    కొరియకు బోయి పాములను కోతులు కప్పలు చిల్కలన్నిటిన్
    తరచుగ చూచి యాకలికి తాళగ జాలక తప్పు లేదనిన్
    హరిని భుజించువారల కనంతవిపత్తులు గల్గు మిత్రమా!

    హరి = పాము, కోతి, కప్ప, చిలుక

    క్షమించవలయును: సమస్యా పాదమున "భజించు" కు బదులు "భుజించు" యని చదివితిని :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. క్షమించితిమి ఓల్డ్ యేజు భోజన ప్రియత్వము అందరమూ గలవారమే :)


      జిలేబి

      తొలగించండి
  36. వరముగ నైదు వత్సములు పాపము జేయుచు దోచి వారలన్
    తిరముగ పోయి రూకలిడి తిండికి మందుకు నొక్కపూటనున్
    కరములు మోడ్చి కాపులవి కమ్మల మాలల వోట్లు గోరుచున్
    హరిని భజించువారల కనంతవిపత్తులు గల్గు మిత్రమా!

    రిప్లయితొలగించండి