2, నవంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 723

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

10 కామెంట్‌లు:

 1. పది సంవత్సరముల పై
  ముదిమిని నేచూచుచుంటి " ముష్టీ " సీర్యల్
  ఇదిగో నేడాఖరుగా
  వదలుము పది నిమిషాల్ సమ వర్తీ దయతో !

  రిప్లయితొలగించండి
 2. సీరియళ్ళ తోడ సెల్ ఫోన్ల తోడను
  నగర జీవితమ్ము నరక మయ్యె
  భర్త పిలుపు విన్న భగ్గుమనును పత్ని
  సీరియళ్ళు చూచి చెలగు వేళ

  సీరియళ్ళు నేడు చెదపురుగులవలె
  పాడు చేయు చుండె నాడు వారి
  యముని పిలుపు వినియు సమయము నిమ్మని
  బ్రతిమి లాడు చుండె బామ్మగూడ

  రిప్లయితొలగించండి
 3. పతియైనను, యముడైనను
  సతులుండిన 'టీవి' చెంత సాగదు పనియే
  బతిమాలిన బామ్మైనను
  సుతిమెత్తగ చేతి కర్ర చుర్రని పించున్!

  రిప్లయితొలగించండి
 4. సీరియళ్ళు నేడు చీకాకు పెడుతున్న
  పనులు మాని జూచు పడతులంత
  కదల దాయె మామ్మ కాలుడొచ్చి పిలువ
  పదినిమిషములంటు పట్టు బట్టె

  రిప్లయితొలగించండి
 5. చస్తానికి తయ్యారే
  వస్తానాగు యమరాజ వచ్చే ముందున్
  కాస్తంత సమయము నిడుము
  చూస్తానీ సీరియల్ను సూర్యాజ దయతో

  రిప్లయితొలగించండి
 6. తనదు కొఱ కునై సమవర్తి తనర రాగ
  నొక్క పదియు ని మిషములు నోపి యుండు
  సీరి యలుపూర్తి తోడనే చేర నిన్ను
  వత్తు నోయము డ ! మఱి నే వత్తు, నిజము

  రిప్లయితొలగించండి
 7. మిత్రులందఱకు నమస్కారములు!

  పండుముసళులైనఁ బడుౘువారైనను
  యముఁడు రాఁగ నతని "నాగు" మనుౘు
  "సీరియళులఁ ౙూచి చేరెద నరక"మ్మ
  టంచుఁ బల్కుదురు విడంబనులయి!

  రిప్లయితొలగించండి
 8. గోలి హనుమచ్ఛాస్త్రిగారూ,
  మీ కందపద్యము బాగున్నది. అభినందనలు.

  ***
  అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ,
  మీ యాటవెలది పద్యములు బాగున్నవి. అభినందనలు.

  ***
  గుండా వేంకట సుబ్బ సహదేవుడుగారూ,
  మీ కందపద్యము బాగున్నది. అభినందనలు.

  ***
  శైలజగారూ,
  మీ యాటవెలది పద్యము బాగున్నది. అభినందనలు.
  కొన్నిచోటులందు వ్యావహారికములున్నవి. సవరింపఁగలరు.

  ***
  చంద్రమౌళి సూర్యనారాయణగారూ,
  మీ కందపద్యము బాగున్నది. అభినందనలు.
  కాని, ప్రాసస్థానములందు వ్యావహారికములు పడినవి. అయినను హాస్యస్ఫోరకముగ నున్నది. గ్రాంథికమునకు మార్చినఁ బద్యమే మారఁగలదు.

  ***
  సుబ్బారావుగారూ,
  మీ తేటగీతి పద్యము బాగున్నది. అభినందనలు.

  ***
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. చిత్రానికి తగిన పద్యాలను అందించిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  శైలజ గారికి,
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  పోచిరాజు సుబ్బారావు గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  ***
  గుండు మధుసూదన్ గారూ,
  మిత్రుల పద్యాలను సమీక్షించి, సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి