24, నవంబర్ 2014, సోమవారం

సమస్యా పూరణం - 1553 (పిల్లన్ గ్రీకంటఁ గనుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.

26 కామెంట్‌లు:

  1. ఇల్లాలిగ తనతండ్రికి,
    తల్లిగ తన,కవగ కోరి దాశ సుతను తా
    మెల్లగ తండ్రికి వధువగు
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్

    రిప్లయితొలగించండి
  2. ఇల్లాలుగ దన తండ్రికి
    తల్లిగ మఱి తనకు జేయ దలచియు మదిని
    న్నల్లన నా దాసరాజు
    పిల్లన్ గ్రీ కంట గ నుచు భీష్ముడు మురిసెన్





    రిప్లయితొలగించండి
  3. అల్లరి పిల్లయె దుస్సల
    మెల్లగ దరి చేరి తాత మీసము లాగున్
    వల్లని పనులను జేసెడి
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్!!

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    వంశమే అంతరించి పోతున్న దనుకున్న తరుణమున జన్మించిన
    ధృతరాష్ట్ర, పాండురాజులలో - చిన్నవానిని గనిన భీష్ముడు :

    01)
    _____________________________

    పిల్లలు కలుగక వంశపు
    వెల్లడి యేమౌనొ యనుచు ♦ వేదన బొందన్
    కొల్లగ గలిగిన నందొక
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు ♦ భీష్ముఁడు మురిసెన్ !
    _____________________________
    వెల్లడి = కీర్తి
    కొల్ల = అధికము
    పిల్ల = చిన్న

    రిప్లయితొలగించండి
  5. అల్ల కురుక్షేత్రమ్మున
    నెల్ల బలమ్ములను గూల్చ యెఱిఁగిన నరుఁడే
    కల్లోలహృదయుఁడై దుర
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘శరాజు’ అని బేసిగణంగా జగణం వేశారు. ‘మదిలో|నల్లన సత్యవతి యనెడి...’ అనండి.
    ****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒల్లని’ ఉంది కాని ‘వల్లని’ శబ్దం లేదు. ‘మీసమ్ముల లా| గొల్లని పనులను...’ అనండి.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. జల్లన గుండియలాజిన్
    పెల్లున వర్షించు విజయు పెను యమ్ములకు
    న్నుల్లము చెదరిన మొన దుర
    పిల్లన్, గ్రీకంట కనుచు భీష్ముడు మురిసెన్

    రిప్లయితొలగించండి
  8. గొల్లడు విడువగ దూడయె
    యల్లన మరి గంతులేసి యాకలి తోడన్
    తల్లిని చేరెడి యాపసి
    పిల్లన్ గ్రీగంట గనుచు భీష్ముడు మురిసెన్

    రిప్లయితొలగించండి
  9. పూజ్యులు శంకరయ్య గార్కినమస్సులు
    విల్లున్ వధించి శత్రున్
    దొల్లుల్ బెట్టయభిమన్యు దూకి రణమ్మున్
    మెల్లగ నా వడి సింగపు
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.

    రిప్లయితొలగించండి
  10. నల్లని వాడగు కృష్ణుడు
    చెల్లెను కాపాడ వచ్చి చేలము లొసగన్,
    ఉల్లము ఝల్లన ధర కం
    పిల్లన్ గ్రీ కంట c గనుచు భీష్ముడు మురిసెన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  11. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    తల్లిగ తనకును,తండ్రికి
    నిల్లాలగు దాశకన్య నిర్మల మదితో
    కల్లా,కపటములేకను
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.

    రిప్లయితొలగించండి
  12. భిల్లుని రూపము నందున
    విల్లందుకు నరుని గావ వెడలిన తనతో
    మెల్లగ నడు యుమఁ గోయల
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్!
    నరుడు = అర్జునుడు
    భీష్ముఁడు = ఈశ్వరుఁడు

    రిప్లయితొలగించండి
  13. ప్రల్లదముల చైద్యునిపై
    ఫుల్లాజ్జాక్షుండు చక్రమును పంపింపన్
    గొల్లున వా డార్చుచు దుర
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్.

    రిప్లయితొలగించండి
  14. "క్రీగంటి చూపు" ఇక్కడి పద్యాలలోఅదే అర్ధంలో వాడబడిందా అని నాకు సందేహంగా ఉంది. పెద్దలు వివరిస్తే బాగుణ్ణు.

    రిప్లయితొలగించండి
  15. అర్జునుని విజృంభణ జూసి భీష్మునికి ఆనందం కలిగింది. కానీ పూర్తి ఆనందాన్ని కౌరవులముందు ప్రదర్శింప లేడు. కనుక క్రీ(లోపల) కంట ముదమును పొందాడు.

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    తాడిగడప శ్యామలరావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ఇక్కడ ‘క్రిగంటిచూపు’ అనే అర్థంలోనే వాడబడిందని గమనించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి

  17. కె ఈశ్వరప్ప గారి పూరణలు

    1.ఎల్లరు కృష్ణుని గట్టగ
    చెల్లున తా విశ్వరూప చిత్రము చేతన్
    కల్లను గని మురహరి,కో
    పిల్లన్ గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్
    2.చెల్లెలుగోరగ కురువీ
    రెల్లరి తలపాగ ముక్క లేర్పడి కోయన్
    మెల్లగ నుత్తరు గని సొం
    పిల్లన్ గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్

    రిప్లయితొలగించండి
  18. ఉల్లము సోదరులకు వే
    పిల్లల దెచ్చియును పెండ్లి వేడుక జేయన్
    నల్లన కాశీ తనయుల,
    పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్

    అల్లన కోరగ శంతను
    డుల్లము సత్యవతిని వెస నోరిమి భీష్ముం
    డల్లన,నామెను తల్లగు
    పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్

    ఉల్లము నందున నాత్మను
    నల్లన గని తపము సేయు,నా శివు గొలువన్
    నెల్లెడ తననే గొలిచెడు
    పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్

    భీష్ముడు = భీషణ తపస్సు చేయు శివుడు.

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణలో ‘చెల్లెలు గోరగ కౌరవు| లెల్లరి...’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  21. అల్లన నూర్గుర గలవక
    గిల్లాలాటాడ తాత ! కేలందుమనన్
    అల్లరి జేసెడు దుస్సల
    పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్.

    రిప్లయితొలగించండి
  22. శ్రీగురుభ్యోనమ:

    ఉల్లము రంజిల్లంగా
    నల్లన మనువాడ నెంచె యాతుర తోడన్
    మల్లెల మాటున శంతను
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు, భీష్ముఁడు మురిసెన్

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా !
    చక్కని పూరణతో మమ్మల్నలరించినందుల కభినందనలు - ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  24. చెల్లెలు దుస్సల తోడుత
    యుల్లసమున నూరుగురు సహోదరులంతా
    అల్లరి జేయుచు నాడగ
    పిల్లను గ్రీకంట గనుచు భీష్ముడు మురిసెన్!

    రిప్లయితొలగించండి
  25. అల్లరి కొడుకుల శతమును
    జిల్లుగ నోర్చుచు భరించి, చీకటి గదిలో
    చల్లగ గాంధారి కనిన
    పిల్లన్ గ్రీకంటఁ గనుచు భీష్ముఁడు మురిసెన్!

    (కళ్ళకు గంతలు కట్టిన గాంధారికి గదులన్నియు చీకటివే)

    రిప్లయితొలగించండి