సుబ్బారావు గారికి వందనములు .... నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను. కొన్ని వ్యక్తిగత ఇబ్బందులవలన రాత్రి 12 గంటలకు కాని నాకు సమయం దొరుకుట లేదు. అదికూడా గంట లోపే
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, సూర్యనారాయణ గారితో మీ ఛందోభాషణ బాగుంది. సంతోషం! మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. **** జిలేబీ గారూ, _/\_ **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
బొప్పాయిని చూడగనే
రిప్లయితొలగించండిచప్పున నా నోటిలోన జలమూరునులే
తప్పక తినవలె నెల్లరు
'పెప్పిన్' గలదిందు గలవు విటమినులెన్నో
రిప్లయితొలగించండిశ్రీ సూర్య నారాయణ గారికి నమస్కారములు . మీరు ప్రతి దినము మొదటి వరుస .
అందులకై నా స్పందన
అమెరి కాలోన నుంటిర ? యార్య ! మీరు
శంక రాభర ణంబున శంక రయ్య
వారు పోస్టు జే యంగనే వ్రాయు చుండ
వచ్చె ననుమాన మయ్యది పరమ గురువ !
కాని యెడ లన రే యిని గాపు గాచి
పద్య రచనము గావించి పండు కొనెద
రేమొ , యటులైన మీకుగా నిప్పుడా ర్య !
వంద నంబులు సేతును భవ్య చరిత !
నాదు విషయము దెలుపుదు నమ్ము డా ర్య !
మూడు మాసము లైనది ముత్యముగను
వచ్చి యమెరికా ,మఱి యుందు మార్చి వరకు
పద్య రచనము మఱి యును పఠ న ములిట
నిత్య కృత్యము లాయెను నిక్క ముగను
సుబ్బారావు గారికి వందనములు .... నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను. కొన్ని వ్యక్తిగత ఇబ్బందులవలన రాత్రి 12 గంటలకు కాని నాకు సమయం దొరుకుట లేదు. అదికూడా గంట లోపే
రిప్లయితొలగించండిపండ్ల బారిన బొప్పాయి పండ్లు జూడ
రిప్లయితొలగించండినూరు చున్నది నోరునా యూర్మి ళ మ్మ !
తెచ్చి పెట్టుమ యొక పండు తీపి గలది
డబ్బు లిత్తును వెనువెంట నిబ్బ డిగను
అమ్మ పాలను పెంచెడి అమృత ఫలము
రిప్లయితొలగించండికనుల చూపును కాపాడు కమ్ర ఫలము
పచ్చి కాయయె శాఖము వంట యందు
పచ్చ పండును భుజియింప ఫలము నిచ్చు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
బొప్పాయి ని పెట్టి పద్యము రాయమన
రిప్లయితొలగించండిఏమని చెప్పుదు, పప్పాయి , పాయి
మేలు ఇంతిత గాదోయి , సరియైన
బాపాయి గారి తిరుగులేని వైద్యమోయి !!
శుభోదయం
జిలేబి
సూర్య నారాయణుడు ఉదయించకముందే...పద్య పూరణ పారాయణమును ..ప్రతిరోజూ చేయుచున్న సూర్యనారాయణ గారూ..అందుకోండి..నా అభినందనలను కూడా...
రిప్లయితొలగించండిపచ్చిగ నున్నను కూరను
రిప్లయితొలగించండిమెచ్చగనే చేయవచ్చు, మేలుగ పండన్
ముచ్చటగా కోసి తినగ
వచ్చును బొప్పాయి మంచి ఫలమే తెలియన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరువు తక్కువనుకొనిపప్పాయితినరు
రిప్లయితొలగించండిబరువు తగ్గింప దినము కో పండు తినుము
ఫేసు మాస్కులకా పెద్ద ఫీజు లేల
గుణము జెప్ప ఫలము నందు కొల్ల లుండు
పెంచ నొక్కచెట్టుయె చాలు పెరిటి లోన
ఇష్ట మైన ఫలములిక ఇంట నుండు
బొప్పాయి పండు తినినన్
రిప్లయితొలగించండిచప్పున నుదరంపు శుద్ధి సాకారమగున్
తిప్పలు గర్భిణులకనుటఁ
దప్పది కేవలమపోహ ధరణిని సుమతీ!
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
సూర్యనారాయణ గారితో మీ ఛందోభాషణ బాగుంది. సంతోషం!
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
****
జిలేబీ గారూ,
_/\_
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
గొప్పగ విటమినులుండును
రిప్లయితొలగించండిముప్పును తప్పించిమంచి పుష్టిని యిచ్చున్
చప్పున దొరికే ఫలమిది
బొప్పాయిని తినిన చాలు బోవును వ్యాధుల్
ఉదరపు జబ్బులు పోవును
మధరమ్ముగనుండు ఫలము మహిలో జనులే
విధిగా తినినను రోజూ
మదనానపు పండు మంచి మవ్వము నిచ్చున్
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనల.
గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
రిప్లయితొలగించండిబొప్పాయి పండ్లలోనన్
గొప్పగ జవసత్తువనిడు గుణములు యుండున్
బొప్పాయి పండ్లు తినినన్
తప్పక పరిపుష్టి కలుగు తనరును దేహం.
నా పద్యానికి చివర ముఖ్యమైన సూచన: గర్భిణులకు బాగా మాగిన (పండిన ) పండు మాత్రమే దోషరహితమని పరిశోధనల సారాంశం.
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదాలు. తమరికి జ్వరం తగ్గిందా? త్వరగా తగ్గాలని భగవంతునికి నా ప్రార్థన.
కుసుమ సుదర్శన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘గుణములు + ఉండున్’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘గుణములు గలుగున్’ అనండి.
****
సహదేవుడు గారూ,
జ్వరం ఇంకా తగ్గలేదు. మందులు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
మాస్టరు గారూ ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీకు త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకొనుచున్నాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్య గురువర్యులు కంది శంకరయ్య గారికి నమస్సులు. జ్వరము త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను. దోమలుంటే దోమతెర ఉపయోగించండి.
రిప్లయితొలగించండిపెరటిలోన కాయు ప్రియమగు పండది
రిప్లయితొలగించండితెగులు లేవి గూడ తగులు కొనవు
జీర్ణ శక్తిఁబెంచు, చికెను మటనులో
కలుప, కూర లుడుకు కరము వేగ
గురువు గారికి వందనములు,మీకు త్వరగా స్వస్థత చేకూరాలని కోరుకొనుచున్నాను.
రిప్లయితొలగించండి