చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ, ‘కవిఁ గాంచి ప్రజ మేలమాడు’ తున్నారన్నారు కదా! చిత్రానికి సరిపోయింది. ‘భాగ్యనగరి యశోభాగ్యమూర్తుల పంక్తి విశ్వనాధకులేదు విగ్రహమ్ము’ అంటూ మీరు చెప్పిన పద్యం చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘లేదని + అనుచు’ అన్నప్పుడు సంధిలేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘లేదటంచు తా ననుకొనగా’ అనండి. **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. ‘భేషు + అనెను’ అన్నప్పుడు యడాగమం రాదు.“భేషటంచు| నల్లు డొక...’ అనండి.
గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు. **** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. కాని చిత్రానికి అన్వయిస్తున్నట్టు లేదు.
గురువు గారికి నమస్కారములు చిత్రం లో తల్లీ కూతుళ్ళు వంట చేస్తున్నారు గమనించారా? వాళ్ళ భర్తలు కవులయితే వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలిపి చిత్రం లోలేని వాళ్ళ భర్తల భావా లెలా ఉంటాయో ఉహించాను ఆ భావం వస్తుందని భావించాను కొరుప్రోలు రాధా కృష్ణ రావు
తల్లి కూతురితో :
రిప్లయితొలగించండికవియగుటయె పెనులోపము
కవులను పెండ్లాడనన్ని కడగండ్లేనే
కవనంబొక వ్యసనంబా
కవితలు కూడైననింత కడుపుకునిడదే
కవిత లనినయా తల్లికి కడుపు మంట
రిప్లయితొలగించండియేమొ ! లేనిచో నట్లను టిచ్చ గొనునె ?
నిచ్చ గించును గాబోలు తుచ్చ మైన
బూతు పాటల సినిమాలు భూరి గాను
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
తల్లి సుద్దులు :
01)
________________________________
కవితలను వ్రాయుటనియెడి - కాస్త లోప
మున్నను మనమె సర్దుకు- పోవలె నని
తల్లి చెప్పెడి సుద్దులు - పిల్ల వినిన
కష్టములు రావు కూతురు - కాపురమున
లేనిచో భర్త నిర్లక్ష్య - లీలలకును
కలల లోకము విహరించు - కవుల చేష్ట
కలహ కారకమౌ నామె - కాపురంబు !
________________________________
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపట్టెడు పదముల్ చెంచెడు చెణుకుల్
దోరగ వేయించిన జాణ చమక్కుల్
దోసెడు యమాతారాజభానసలగం
తాళింపు వేసిన గద్యమ్ము పద్యమ్ము !!
శుభోదయం
జిలేబి
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండి_/\_
కవుల పల్లకిమోయు భువినేలు మహరాజు
రిప్లయితొలగించండిపచ్చలపల్లకీ పట్టిపోయె
అచ్చరంబుకు లచ్చలిచ్చి కైతలమెచ్చు
లచ్చిపుత్రులు నాకమిచ్చగించె
శ్రీనాధ కవిరాజు చీకాకుపాలాయె
గండపెండెరమాయె బండశిలలు
భాగ్యనగరి యశోభాగ్యమూర్తుల పంక్తి
విశ్వనాధకులేదు విగ్రహమ్ము
భువన విజయమ్ము బుగ్గియైపోయెనన్న
కవుల విభవమ్ము అగ్గిలో కాలెనన్న
అవని కవిగాంచి ప్రజ మేలమాడుచున్న
కవనమల్లంగనదియేల కాముడన్న
ఇచ్చిన బొమ్మకీ చెప్పిన కవితకీ ఎంతవరకు పొంతన కుదిరిందో తెలియదుగానీ చెప్పాలనిపించింది చెప్పేను అంతే.
తల లేని వాడు, పలు కవి
రిప్లయితొలగించండితలనే తా వ్రాయు వాడు తప్పదు తల్లీ
తలనొప్పే ! సర్దుకొనుము
తల మనకే లేదననుచు తాననుకొనుగా !
బిడ్డ కాపురమునుజూసి భేషు యనెను
రిప్లయితొలగించండిఅల్లు డొకగొప్ప కవియని యెరిగె నపుడు
కవుల నడువు బాట బతుకు గడుపు తీరు
చాటుగ తెలియు నామెకు తేట గాను
బిడ్డ నోదార్చ చెప్పెనో దొడ్డ మాట
శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
రిప్లయితొలగించండి‘కవిఁ గాంచి ప్రజ మేలమాడు’ తున్నారన్నారు కదా! చిత్రానికి సరిపోయింది.
‘భాగ్యనగరి యశోభాగ్యమూర్తుల పంక్తి విశ్వనాధకులేదు విగ్రహమ్ము’ అంటూ మీరు చెప్పిన పద్యం చాలా బాగుంది. అభినందనలు, ధన్యవాదాలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘లేదని + అనుచు’ అన్నప్పుడు సంధిలేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘లేదటంచు తా ననుకొనగా’ అనండి.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘భేషు + అనెను’ అన్నప్పుడు యడాగమం రాదు.“భేషటంచు| నల్లు డొక...’ అనండి.
చవులుపుట్టుగతిని వ్రాయశక్తిఁ బడయు వరమునన్
రిప్లయితొలగించండికవుల సత్యశోధనంపు క్షమతఁ బెరుగు నిలను; నా
ధవళమందురంగులున్న తథ్యమెఱుగ తరమె? యీ
కవితనెల్లజనులు రుచినిఁగనగలేరు మిత్రమా,
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
'కవి నాపతి వినుమమ్మా'
రిప్లయితొలగించండి'భవి తవ్యములేదు నీకు వగవకు బిడ్డా !'
కవితలు మరి కవనంబులు
భువిలో కవి కడుపు నింపు ముచ్చట చెల్లెన్
కవిత మొదటి భార్యగా మారెనమ్మ ఆ
రిప్లయితొలగించండిభానుకంటె మున్న బ్లాగు జూచు
సన్న బాధ లన్ని సర్దుకొనుము తల్లి
చూపవద్దు యిట్టి లోపములను
గురువర్యులకు సలహాలకు ధన్యవాదములు .
రిప్లయితొలగించండికళల,సాహిత్యమాధ్యాత్మికముల నేర్వ
రిప్లయితొలగించండి'నచ్చ తెలివి' తోటి మనసు విచ్చుకొనగ
'సహృదయాభిసరణ'మునన్ సాగి రేని
తద్రసాధి సిద్ధుల యాత్మ తత్వమందు
వారలటు యనుసంధానపు భాగ్య మంద
విమల మహిత సధ్రీచీన మమరు గాదె!
'నేను' లేనట్టి యద్భుతమ్ గాను పింప
సత్య దర్శన కైవల్య శాంతి దక్కు!
(స్ఫూర్తి :శ్రీఎర్రా ప్రగడ రామకృష్ణ గారు)
బలమున్ బలహీన మనుచుఁ
తెలియక పరిహాస మాడి తెగటార్చుదురే!
కళల నిరాదరణమునకు
నిల సాక్ష్యమ్మిట్టి మూర్ఖ మేర్పడ జెప్పన్!
కొత్త వింతని దెలియని కూతురంట
రిప్లయితొలగించండిపాత యనుభవ శాలి రా మాత యిచట
ఇచట ఇంతుల వంటలు ఎటుల నుండు ?
కొత్త యల్లుని యడుగంగ గుట్టు దెలియు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
గండూరి లక్ష్మినారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కాని చిత్రానికి అన్వయిస్తున్నట్టు లేదు.
గురువు గారికి నమస్కారములు
రిప్లయితొలగించండిచిత్రం లో తల్లీ కూతుళ్ళు వంట చేస్తున్నారు గమనించారా?
వాళ్ళ భర్తలు కవులయితే వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలిపి చిత్రం లోలేని వాళ్ళ భర్తల భావా లెలా
ఉంటాయో ఉహించాను ఆ భావం వస్తుందని భావించాను
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
మాస్టరుగారూ ! ధన్యవాదములు..
రిప్లయితొలగించండిమీరు చూపిన సవరణతో...
తల లేని వాడు, పలు కవి
తలనే తా వ్రాయు వాడు తప్పదు తల్లీ
తలనొప్పే ! సర్దుకొనుము
తల మనకే లేదటంచు తాననుకొనుగా !
రిప్లయితొలగించండిగురుదేవులకు ధన్యవాదములు.
చివరి పద్యం చిన్న సవసవరతో...
బలమున్ బలహీన తనుచుఁ
తెలియక పరిహాస మాడి తెగటార్చుదురే!
కళల నిరాదరణమునకు
నిల సాక్ష్యమ్మిట్టి మూర్ఖ మేర్పడ జెప్పన్!