21, నవంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 742

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. తనదు తోకనే చుట్టల నొనర జుట్టి
    రావణా సురు నికెదురు రాజు వోలె
    తిష్ఠ వేసికొ నియుండు తీరు జూడ
    నద్భు తంబుగ నుండెనా హనుమ ఠీవి

    రిప్లయితొలగించండి
  2. నీ వాలకమును జూడగ
    మా వానరజాతి కున్న మర్యాదైనన్
    రావణ కొదవాయెగ నే
    నీ వాలపు గద్దెనెక్కి నిక్కెద గనుమా

    రిప్లయితొలగించండి
  3. తనదు తోకనే చుట్టల నొనర జుట్టి
    రావణా సురు నికెదురు రాజు వోలె
    తిష్ఠ వేసికొ నియుండు తీరు జూడ
    నద్భు తంబైన ఠీ వది యంగదుడె గ

    రిప్లయితొలగించండి

  4. మండోదరీ భర్త్రుక ! నీదు వోలె క్షణ క్షణముల్
    మారు మనంబురాలు కాదు మా యమ్మ,
    వానరుడిని, నీదు మంచి కోరి చెప్పెద,
    విడువుము సీతన్, శరణు వేడు మా రామునిన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. రామ దూతను రగిలించె రావ ణుండు
    వాలమే యాసనముజేసె వానరుండు
    కీచు మాటలు బల్కెను కించ పరచి
    నిప్పు పెట్టిరి తోకయె గుప్పు మనగ
    లంక నంత కాల్చెనతడు పొంక ముదిరి

    రిప్లయితొలగించండి
  6. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘తిష్టవేసి కూర్చున్నట్టి తీరు...’ అనండి.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    జిలేబీ గారూ,
    _/\_

    రిప్లయితొలగించండి
  7. .... అంత హనుమ యిట్లు పలికె ...
    మంచి తో చెప్పగ వినుము కొంచ మైన
    కండ కావరమ్ములు వీడ గౌరవమ్ము
    మొండి మాటలు చాలించ మేలు యౌను
    కరుణ జూపును రాముడు శరణు వేడ

    రిప్లయితొలగించండి
  8. రామునాజ్ఞ నంగదుడుతా లంక కేగి
    దూత నని ప్రకటించెను తుష్టి తోడ
    ఆసనమ్మిడక నిలుప నాగ్రహించి
    వాలమును బెంచి రయమున వాలిసుతుడు
    కూరుచుండెను దానిపై ధీరవరుడు

    రిప్లయితొలగించండి
  9. నిన్నటి పద్య రచన :
    బిర్ర్రుగ జుట్టుచు తాడును
    సర్రున బొంగరము విసర చక్కగా దిరుగ
    న్నెర్రగ కమిలిన గాయము
    చిర్రెత్తించిగ మరువను చిన్న తనంబున్!

    నేటి పద్యరచన :
    దురితుడవు! రాయబారిని
    మరియాదగఁ జూడక యవమానించన్ మే
    మెరుగమె మా స్థాయిని మీ
    రెరుగక నాశమ్ము నెంచ నేమని జెప్పన్!

    రిప్లయితొలగించండి
  10. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మంచిగాఁ జెప్పెద వినుము... మేలు గలుగు’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఏవాలి ముంచె నో పా
    రావారములందు నిన్ను రాక్షస రాజా
    యావాలికి తనయుడ నే
    నీ వాలము చుట్టి యెత్తునెక్కితిగనుమా

    రిప్లయితొలగించండి
  12. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి