16, నవంబర్ 2014, ఆదివారం

చమత్కార పద్యాలు - 211


నిరోష్ఠ్య నిర్బిందు నిష్కేవలస్వర నిష్పంచవర్గ అష్టాక్షరీయ అష్టనాగబంధ కందము
క.         వే యరుసు వసి రహిల,
హ్వా! యాలరి సేవవాపి వల్లవవశ్య
ర్ష్యాయువు సౌ రెలయ వలయ
యాయి యుసుర్లెల్ల వ్రీల యాయు విలేశా!
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి చిత్రభారతముకావ్యం భీష్మపర్వము నుంచి -

7 కామెంట్‌లు:

 1. సుకవి మిత్రులు ఏల్చూరి మురళీధర రావు మహోదయులకు,

  తమరి “నిరోష్ఠ్య నిర్బిందు నిష్కేవలస్వర నిష్పంచవర్గ అష్టాక్షరీయ అష్టనాగబంధ కందము” అనన్యసామాన్యము...అనిదంపూర్వము...సుందరతమము. ఇది చక్కని చిక్కని పదబంధములతో...నొకచో తత్సమపదములతోడను, వేరొకచో నచ్చతెనుఁగు పదముల పొందికతోడ నలరారుచున్నది. ఇట్టి బంధకవిత్వమునుం బఠించు భాగ్యమునుఁ బ్రసాదించినందులకు మీకు సర్వదా...సర్వథా...వినయ వినమిత మస్తకుండనై, మత్కృతజ్ఞతాపూర్వక వందనములు...అభినందనలు తెలుపుకొనుచుంటిని!

  రిప్లయితొలగించండి
 2. అయ్యా - అసామాన్యమైన రచనకు - సహస్త్రాంజలి

  రిప్లయితొలగించండి
 3. శ్రీ ఏల్చూరివారి ఈ పుస్తక వివరాలను, ఎక్కడ కొనుక్కొనవచ్చో తెలుయజేయగలరా?

  రిప్లయితొలగించండి
 4. పుష్యం గారూ,
  ఏల్చూరి వారు ఈ పుస్తకాన్ని వ్రాసి చాలాకాలమైనా ఇంకా ప్రచురించలేదని తెలియజేశారు.

  రిప్లయితొలగించండి
 5. నా అల్పకృషిని అనవరతం దయతో ప్రోత్సహిస్తున్న మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,
  ఆదరించిన విద్వత్సత్కవులు శ్రీ గుండు మధుసూదన్ గారు, శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారు, శ్రీ వసంత కిశోర్ గారు, శ్రీ పుష్యం గారలకు,

  ప్రణతి!

  రిప్లయితొలగించండి
 6. బంధ చిత్రకవిత్వ ప్రక్రియలు అబ్బురపాటు గొల్పే కవససామర్ధ్యప్రతీకలు.

  అక్షరాలా అతిక్లిష్టమైన అక్షరప్రహేళికలు.

  ఏల్చూరివారి ఈ పద్యం అద్భుతంగా ఉంది.

  రిప్లయితొలగించండి