15, నవంబర్ 2014, శనివారం

చమత్కార పద్యాలు – 210


వినూత్న మహానాగబంధము
సీ.        శ్రీమహావిష్ణుని సిద్ధసంకల్పు స
ర్వంసహానన్తర్ధవర్ధమాను
మానుతు ధర్ము ధర్మాధ్యక్షు నందనం
దాదిత్యు గోవిందు నావిలాసు
వాసవు సత్యు నిర్వాణు సాణుశ్రీశు
భాను చలాచలమానవిశ్వ
శాశ్వతైకవ్యాస సాధ్యర్తు గోప్త గ
దాధరు ధన్యదు ధామ సామ
గీ.         శ్రీరమేశుని సువ్యాసు శ్రీనిలయు ని
యుక్తు సుశ్రద్ధధానతాసక్తు దిశు మ
హామఖాధ్యక్షు వాయువాహను సురమ్యు
భక్తభద్రదు ప్రేముడిన్ ముక్తి గనుమ.
శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి చిత్రభారతముకావ్యం భీష్మపర్వము నుంచి -

3 కామెంట్‌లు:

  1. గురుతుల్యులు ఏల్చూరి వారికి నమస్కారములతో

    బంధము లన్నిటి గంటె ను
    బంధమె మఱి 'నాగ ' గొప్ప బంధము కాదే ?
    బంధములు చాల యున్నవి
    బంధముగా గవిత వ్రాయ పరులకు వశమే ?

    రిప్లయితొలగించండి
  2. పోచిరాజు సుబ్బారావు గారూ,
    ధన్యవాదాలు. మీ పద్యం బాగున్నది. కొన్ని సవరణలు...

    బంధము లన్నిటి కంటెను
    బంధమె మఱి గొప్ప నాగబంధము కాదే ?
    బంధము లెన్నో యున్నవి
    బంధకవిత వ్రాయ నెల్లవారికి వశమే ?

    రిప్లయితొలగించండి
  3. నా అల్పకృషిని అనవరతం దయతో ప్రోత్సహిస్తున్న మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,
    పద్యాశీస్సుతో ఆదరించిన విద్వత్సత్కవులు శ్రీ పోచిరాజు సుబ్బారావు గారికి,

    ప్రణతి!

    రిప్లయితొలగించండి