6, నవంబర్ 2014, గురువారం

పద్యరచన - 727

కవిమిత్రులారా,
 పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి

11 కామెంట్‌లు:

  1. దీపమ్ముల వెలిగించుచు
    నాపరమేశ్వరుని భక్తి నారాధించన్
    గాపాడునీశ్వరుండే
    మా పరివారంబులనని మహిళలు తలచున్

    రిప్లయితొలగించండి
  2. మూర్తుల బోలిన ప్రమిదల
    నార్తితొ వెలిగించు చుండె నచ్చట భామల్
    కార్తిక పున్నమి యౌటన
    పూర్తిగ నట శివుని మహిమ బొగడుచు నుండెన్

    రిప్లయితొలగించండి
  3. తేజ !కార్తీక పూర్ణిమ దివస మగుట
    నియమ నిష్ఠ ల తోడన నెలతు లచట
    దీప తతిచేత గుడియంత దేజ రిల్ల
    వేలకొలదిగ దీపాలు బెట్టి రమ్మ !

    రిప్లయితొలగించండి
  4. తమ్మి పత్ర నేత్రులచట తనివి తీర
    చిన్ని దివ్వెల వెలిగించ చెన్ను గాను
    శివుని కోవెల వెలిగెను శిఖల తోడ
    వెన్నెలల ప్రభవించె నా వేది కనుడు

    రిప్లయితొలగించండి
  5. జ్యోతి పరదైవమగు ,నీ
    నాతులిచట భక్తి తోడ నమ్మి నిడుదురా
    శ్వేతగిరిశిఖరు దీవన
    చేత జగములెల్ల వృద్ధి సిద్ధమటంచున్.

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. నా పతి, సంతానంబుల
    నే పీడలు వెంటఁ బడక, యిడుములుఁ దీరన్
    మాపై దయఁ జూపుమయా!
    దీపమ్మై పూజ సేతు దేవా ప్రీతిన్!

    రిప్లయితొలగించండి
  8. కార్తీకదీపారధనలో భక్తులు.......................

    భక్తిన్ పూజలు చేసి హారతులఁసేవల్ శక్తినర్పించి యా
    సక్తిన్ దివ్యపదారవిందములనశ్రాంతంబు ధ్యానించుచున్
    ముక్తవ్యాపకజీవసంఘములునై మోదప్రకాశాత్ములై
    శక్తిన్ కార్తికదీపమాలికల తేజప్రాభవోపేతులై.

    రిప్లయితొలగించండి
  9. పున్నమి రోజున గుడిలో
    చెన్నుగ దీపములు బెట్టి చేడియలంతా!
    మిన్నగ బూజలు సేయగ
    జన్నపుగొంగయె జనులను చల్లగ జూడున్!!!

    రిప్లయితొలగించండి

  10. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ శార్దూల పద్యం చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి