3, నవంబర్ 2014, సోమవారం

పద్యరచన - 724

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి

11 కామెంట్‌లు:

 1. దశదిశల వ్యాప్తిఁ జెందిన
  యశోన్వితుని రూప మభినయ మందున్
  విశదీకరించ నిట మీ
  దశావతారమ్ము లన్ని తక్కువ గాదే!

  రిప్లయితొలగించండి
 2. సహదేవుడుగారూ, నమస్తే
  రెండో పాదం సరిచెయ్యాలెమో చూడండీ

  రిప్లయితొలగించండి
 3. ఒక్కడె బాపూ దొరలకు
  చుక్కలు చూపించి స్వేచ్ఛ చొప్పడజేసెన్
  పెక్కురు బాపూలుండిన
  నిక్కము భరతమ్ము శాంతి నిలయంబనగన్

  రిప్లయితొలగించండి
 4. నమస్కారమండి శ్రీ కామేశ్వర శర్మ గారూ, మీ పద్యం బాగుంది. తప్పు తెలియజేసినందులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  దశదిశల వ్యాప్తిఁ జెందిన
  యశోన్వితుని రూపు మీరలభినయ మందున్
  విశదీకరించ నిట మీ
  దశావతారమ్ము లన్ని తక్కువ గాదే!

  రిప్లయితొలగించండి
 5. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ (సవరించిన) పద్యం బాగున్నది. అభినందనలు.
  ***
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. రేపటి పౌరుల మనుచును
  బాపూజీవేషమందు వచ్చిరి గనుమా
  లోపంబుల సవరించుచు
  కాపాడగ దేశ భవిత కరములు కలిపె్

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కలిపెన్’ దగ్గర టైపాటు...

  రిప్లయితొలగించండి
 8. దేశ స్వా రా జ్యమునకునై దిశలు పదియు
  జనుల నొక్క ద్రా టిననడి పినమ నుజుడ !
  నీ దు ధీశక్తి నెన్నగ రాదు నాకు
  వంద నంబులు నీకివె వంద లాది .

  రిప్లయితొలగించండి
 9. బాపు రూపు తోడ పదిమంది బాలురు
  వేష ములను వేసి, ప్రేమ తోడ
  జాతి పితను తలచి, స్వాతంత్ర్య వేడుకల్
  జరుపు కొనుచు నుండ్రి సంతసముగ

  రిప్లయితొలగించండి
 10. స్వచ్ఛ భారత దేశము ​సాధ్యమౌను
  కల్లకపటము లేకుండ గాంధిగారి
  ఆశయములను సాధించ నరిగినట్టి
  నేటి బాలలు రేపటి నేత లైన!

  రిప్లయితొలగించండి
 11. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘దేశ స్వారాజ్యము’ అన్నప్పుడు ‘శ’ గురువై గణభంగం. ‘దేశమునకు స్వేచ్ఛను గోరి...’ అనండి.
  ***
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ***
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి