7, నవంబర్ 2014, శుక్రవారం

పద్యరచన - 728

కవిమిత్రులారా,

 పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి

17 కామెంట్‌లు:

  1. కర్ర చేత బట్టి కళ్ళ గంతల గట్టి
    శ్రవణ శక్తి తోడ సాము జేయ
    సాహసించుచుండె చక్కని బాలిక
    చిన్నవయసులోన చిరుత వలెను

    రిప్లయితొలగించండి



  2. చేతి కఱ్ఱ ను జేబట్టి చిన్న పిల్ల
    సారు చేసెడి చేతుల సవ్వ డివిని
    వింత దోచెను, గ ళ్ళకు గంత లుం డి
    సాము గరిడీలు సేయుట సహచ రులకు

    రిప్లయితొలగించండి
  3. శబ్ద భేదిని నేర్చెనా చక్కనమ్మ?
    గంతలుకనులఁ బూర్తిగ కప్పివేయ
    శక్తి యుక్తులతోడను సాముఁజేయ
    సిద్ధ మైనది చినతల్లి చిఱుతవొలె

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మార్గదర్శి యగును’ అనండి. ‘రక్షణ + ఇపుడు, శీర్షిక + అవ్వ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. ప్రసాద్ గారూ,
    సవరించినందుకు సంతోషం.
    ‘శీర్షిక + అవగ’ అన్నప్పుడూ యడాగమం వస్తుంది. అక్కడ ‘శీర్షిక యన’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. గంతలు గట్టెను కళ్ళకు
    వింతగమరి సాము జేయ వేడుక తోడన్
    నంతట కోలను కరమిడి
    పంతముతో శబ్దభేది పాపయె నేర్చెన్


    రిప్లయితొలగించండి
  7. ఆకలి నేర్పునువిద్యల!
    నా కలికే గంతలున్న ఔరా! యన దా
    నేకాగ్రతతో రెచ్చుచు
    భీకరమగు కర్ర సాము బిరబిర జేసెన్!

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శబ్దమును బట్టి లక్ష్యము శ్రద్ధతోడ

    కన్నులకు గంతలను గట్టి కర్ర చేత

    బట్టి కొట్ట యత్నించెడి బాల కౌర

    చూడ ముచ్చట గానుంది సుజన శీల

    రిప్లయితొలగించండి
  10. గురుతుల్యులు శంకరయ్య అమూల్యమైన సలహాలకు కృతజ్ఞలతో ...

    సాము నేర్చ నామె శబ్ధమును వినుచు
    శ్రవణ శక్తి పెంచి సాహసించి
    మార్గ దర్శి యగును మహిళలందరకును
    స్త్రీల రక్ష యిపుడు శీర్షకయన

    రిప్లయితొలగించండి
  11. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘బాలకౌర’...? ‘బాలిక + ఔర’ అన్నా సంధిలేదు. యడాగమం వస్తుంది. ‘బాల యౌర’ అనండి.
    ****
    శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ (మీ పూర్తి పేరు ఇదే కదా! పొరబడలేదు కదా!)
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘దమ్ము + ఉన్న’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘దమ్ములున్న’ అనండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి

    2. శంకరయ్యగారూ, నా పూర్తిపేరు - చిట్టిభొట్ల శ్రీనివాస భరద్వాజ కిశోర్. వంశం పేరు గత మూడు తరాలుగా రికార్డులలో లేదు. మిగిలిన పేరు మూడు భాగాలనుంచి మొదచటి అక్షరం క్రమం తిరగేస్తే వచ్చేది - కిభశ్రీ.

      తొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి