10, నవంబర్ 2014, సోమవారం

పద్యరచన - 731

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి

20 కామెంట్‌లు:

  1. రెండు వృక్షము లచ్చట నుండె చూడు
    గజము ఖుని యాకృ తి దనర గాను నాహ !
    యేమి యద్భుత మద్దియ యేమి ప్రతిమ ?
    వంద నంబులు గణపతీ ! వంద నమ్ము

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఇదుగో పులి - అదుగో తోక :

    01)
    ____________________________

    చెట్టులో వినాయకు డదె - పుట్టె ననిన
    జనులు తండోపతండాలు - కనగ వచ్చి
    పూలు, నరటి,కొబ్బరులతో - పూజ సలిపి
    ధూప, దీప, నైవేద్యము - తోడ మురిసె !
    ఇదిగొ పులియన్న , పొడవు తో - కదిగొ ననెడు
    జనుల రక్షింప జగపతి - సాధ్యమౌనె ?
    ____________________________
    తండోపతండాలు = చాలా అధికమైన సంఖ్య (జనం)
    అదిగొ, అదిగో = అదెచూడు

    రిప్లయితొలగించండి

  3. ఇందు గలడందు లేడు
    అను కల్ల మాట వలదు
    చూచు కనులున్న చూడవచ్చు
    మర్రి తొర్రిన గజాననుని కూడను !!


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. ఆకులతో పూజందెడు
    నాకరిముఖ దేవుడిటుల నాకుల మధ్యన్
    శ్రీకరముగ కాండముపై
    ప్రాకటముగ నిలచినాడ ! భళిభళి యనగా !

    రిప్లయితొలగించండి
  5. శిలను కొయ్యను మలచగశిల్పులెల్ల
    ప్రకృతికాంత పరవశించి ప్రతిమ దాల్చె
    విఘ్ననాధుని మానున విరివి కొలువ
    చేరరే పర్యటకులట చిత్ర మవగ

    రిప్లయితొలగించండి
  6. "గాడిద! నాబొమ్మలతో
    నాడకు - చెట్టున వెలసితినని కధలల్లన్
    జూడకు వేడెద" నని యా
    గాడిద పాదములఁ బట్టె గజకర్ణుఁ డహో!

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.


    చెట్టు కాండమందున శిల్పి చెక్కి నటుల
    భక్తవరులను దీవించి వరము లీయ
    విఘ్న నాథుడు మూర్తియై వెలసి నాడు
    మొక్కు వారికి తప్పక దక్కు ఫలము.

    రిప్లయితొలగించండి
  8. చెట్టులొ, పుట్టలొ, రాతిలొ,
    మట్టిలొ,మంటలొ,జలాది మారుతములలోన్
    దుట్ట తుదకు మింట్లోనను
    గట్టిగ దైవంపు రూపు గాంచెదమయ్యా!

    రిప్లయితొలగించండి
  9. నమ్మకమున్న చాలును మనంబున విశ్వచరాచరుండు తా

    నిమ్మహి మానవాళికిని యిచ్చును దర్శన భాగ్య మంతటన్

    నమ్మిన రూపులోన మరి నమ్మిన చోటను శ్రీ గనేశుడా

    యమ్మల గన్నయమ్మ సుతు డట్టుల గోచర మాయె చెట్టులో

    రిప్లయితొలగించండి
  10. చెక్కను రాయీ రప్పను
    చెక్కుచు మూర్తులనుమలచు చేతి చలువతో
    చక్కని విఘ్నుడు పుట్టగ
    ఎక్కువనటచేరిపూజ పేర్పులు కావే

    రిప్లయితొలగించండి
  11. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    జిలేబీ గారూ,
    _/\_
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘పూజను గొను’ అనండి.
    *
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    ఒక్క దెబ్బకు రెండు పిట్టలా? బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. మీ పద్యానికి నా సవరణ....
    చెట్టున, పుట్టను, రాతిని,
    మట్టిని, మంటను,జలాది మారుతములలోన్
    దుట్ట తుదకు నా మింటను
    గట్టిగ దైవంపు రూపు గాంచెదమయ్యా!
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మానవాళికిని నిచ్చును’ అనండి.

    రిప్లయితొలగించండి
  12. మక్కువ గొలుపుతు గణపతి
    నక్కజమగు రీతి నమరె నాహా! తరువున్ !
    చక్కని రూపుకు జేజే !
    గ్రక్కున వరమిచ్చు వేల్పు గజకర్ణుండే !!!

    రిప్లయితొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘మక్కువ గొలుపుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. మాస్టరు గారూ ! ధన్యవాదములు
    మీరు చూపిన సవరణతో....

    ఆకులతో పూజలుగొను
    నాకరిముఖ దేవుడిటుల నాకుల మధ్యన్
    శ్రీకరముగ కాండముపై
    ప్రాకటముగ నిలచినాడ ! భళిభళి యనగా !

    రిప్లయితొలగించండి
  15. చెట్టు కనిపించె నచట విచిత్రముగను
    పెరుగుదలలోన మార్పులు జరుగు కతన
    గణపతియె వెలసెననుచు కరము భక్తి
    మూడ జనులంత మురిసిరి పూజ సలిపి

    రిప్లయితొలగించండి
  16. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. చిత్రముగ నున్న దిది చూడ చిత్తరువున
    దెట్టుల నొక యాకృతి వలె నేర్పడినదొ!
    ప్రకృతి వింతలఁ జూడఁగ బలు వినోద
    ములవి, నిత్యము క్రొత్తగ మురియును మది.

    రిప్లయితొలగించండి