12, నవంబర్ 2014, బుధవారం

పద్యరచన - 733

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

23 కామెంట్‌లు:

 1. సీ తాఫలముల గంపలు
  సీతా ! మఱి చూడు మచట శిఖరముల వలె
  న్నాతా వుల గనిపించెను
  నాదారిన వచ్చుకారు నాగున! నచట న్ ?

  రిప్లయితొలగించండి
 2. బుట్టల నిండుగ నక్కడ
  పెట్టిన సీతాఫలములు ప్రీతిగ కొనుమా
  చుట్టములకు పంచుటకును
  లొట్టలు వేయుచు తినుటకు లుబ్ధత యేలన్

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  సీతాఫలము :

  01)
  ____________________________

  శీతకాలము మాత్రమే - చెట్ల కాసి
  చేరువగు నట్టి ఫలమదే - సీమనెల్ల
  తెల్లనైనట్టి గుజ్జదే - తియ్యగుండు
  పచ్చ సీతాఫలంబుల - ప్రాభవమును
  మాటలే లేవు వర్ణింప, - మధుర ఫలము
  మధుర మాధుర్య మది తిన్న - మరువ గలమె !!!
  ____________________________

  రిప్లయితొలగించండి
 4. సీతాఫలము :

  02)
  ____________________________

  బుట్ట లందున చక్కగా - పెట్ట బడిన
  గుట్ట గుట్టలు గానున్న - తట్టల గని
  దృష్టి మళ్ళింప జనులకు - కష్టమైన
  సృష్టి సీతాఫలంబులె - స్పష్టముగను !

  ఎట్టి పట్టుల నైనను - చెట్టు పెరుగు
  సృష్టి జేసిన స్రష్టయే - నిష్ఠ దప్పి/నిష్టముగను
  లొట్ట లేయుచు దినదగు - నట్టి ఫలము
  సృష్టి సీతాఫలంబులె - స్పష్టముగను !

  పట్టు దప్పించు మధు మేహ - మెట్టి దైన(type-1or2)
  పట్టు పట్టరె జనులంత - చుట్టు ముట్టి
  చిట్టి పిల్లల కైనను - పెట్ట దగిన
  సృష్టి సీతాఫలంబులె - స్పష్టముగను !
  ____________________________

  రిప్లయితొలగించండి
 5. శీతాకాలమ్మందున
  శీతాఫలమందివచ్చు చేతికి మనకే
  ప్రీతిగ తినుడీ దీనిని
  మీతోడుత నున్నవార్కి మెచ్చగ నిడుడీ.

  రిప్లయితొలగించండి
 6. పచ్చని రూపము, పైనను
  గిచ్చిన విధముండు లోన గింజలు నలుపే
  మెచ్చెడు గుజ్జే తెలుపుగ
  వచ్చెను శీతాఫలమ్ము బాగుగ తినుడీ.

  రిప్లయితొలగించండి
 7. పచ్చని సీతా ఫలములు
  నచ్చిన వేచూ సియెంచి నాణ్యత ఎరిగీ
  తెచ్చితి మింటికి మాతో
  మెచ్చుతు మనమందు ప్రకృతిమేలిమి నెంతో

  రిప్లయితొలగించండి
 8. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘కారు నాగున యచటన్’ అనండి.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ****
  బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 10. శీత కట్టునే వచ్చునీ శ్రేష్ట ఫలము

  కోత కొచ్చిన మంచివి కోసు కొచ్చి

  పేర్చి చక్కగ నుంచగ పేద రైతు

  కారు నాపిపండ్లు కొనుము కరుణ కలిగి

  రిప్లయితొలగించండి
 11. సీతా ఫలములు గనగా
  ప్రీతిగ గొనుచుండు జనులు వెల యెంతైనన్
  శీతా కాలమున దొరుకు
  సీతా ఫలములనుతినుట శ్రేయము గాదే!!!

  రిప్లయితొలగించండి
 12. రూపముఁ జూడగా జనులు రోసియు వీడరు తీపి పండ్లనే
  లోపముఁ గానరాదనగ లుబ్ధతతో తిని సొక్కుచుంద్రు ; సీ
  తాఫలముల్ ఘనాటవుల దండిగ పండు మృగాళికెల్ల క్షు
  ధాపరిహారమౌనటుల ధాత్రి యొసంగు వరమ్ము భంగినిన్.

  రిప్లయితొలగించండి
 13. ప ఫ కు ప్రాసమైత్రి లేదు. వేరే విధముగా ప్రయత్నించెదను.

  రిప్లయితొలగించండి
 14. రూపముఁ జూడగా జనులు రోసియు వీడరు కొన్ని పండ్లనే
  లోపముఁ గానరాదనగ లుబ్ధతతో తిని సొక్కుచుందురీ
  తీపి ఫలమ్ములన్; వనుల తీరుగ పండు మృగాళికెల్ల క్షు
  త్తాప నివారణమ్మవగ ధాత్రి యొసంగు వరమ్ము భంగినిన్.

  రిప్లయితొలగించండి
 15. ఒళ్లంతా కళ్లఁ గలిగి
  పళ్లల్లో మేలుఁ జేయు ఫలమన్ననిదే!
  పిల్లల్లో పెద్దల్లో
  చెల్లదు! జలుబిడు నపోహ చింతలఁ బెట్టన్!

  రిప్లయితొలగించండి
 16. సీతా కాలముగద యిది
  సీతాఫల రాశు లవిగొ చేర్చిరి యట సం
  ప్రీతిని జెందియు వెళ్ళే
  మాతలు కొనుచుందు రిట్టి మధుర ఫలములన్

  రిప్లయితొలగించండి
 17. సీతా కాలముగద యిది
  సీతాఫల రాశు లవిగొ చేర్చిరి యట సం
  ప్రీతిని దారిన వెళ్ళే
  మాతలు కొనుచుందు రిట్టి మధుర ఫలములన్

  రిప్లయితొలగించండి
 18. అమృత ఫలమె సీతాఫల మనుట నిజము
  నీరసము బాపు చిటికలో నిశ్చయముగ
  గంపలన్ విక్రయించగ నింపినారు
  కొనుడు కాయల తృప్తిగా తినుడు నేడె

  రిప్లయితొలగించండి
 19. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

  సీతా ఫలములు విరివిగ
  శీతా కాలమ్మునందు చేతికి వచ్చున్
  ప్రీతిని కలిగించు తినిన
  చేతన నిచ్చును శరీర సేదను దీర్చున్.

  రిప్లయితొలగించండి

 20. 1.వేయి కనుల పండు తీయనైన గుజ్జు
  దజనువంద గొనుడు సుజనులార
  శీత కాలము నందు సీతాఫలమ్మిది
  వాతహరిణి తినగ వలయు నిపుడు
  2.చాకిలేటు కన్న చౌక.ఆరోగ్యము
  పాడుచేయు నూనెవంట కాదు
  ప్రకృతి సహజ ఖాద్య లవణములతో పాటు
  వైటమిన్లు యున్న స్వీటుయనగ
  3.కారుదొరలు బైకుదారులు సైకిలు,
  బస్సు లందు పోవుప్రజలు,బాల
  తరుణు లెల్లవారు తప్పక తినినచో
  మేలుస్స్వాస్థ్య మొదవి గ్రాలు చుంద్రు

  రిప్లయితొలగించండి
 21. శీతాకాలమునందువచ్చు ఫలముల్ సీతాఫలమ్ముల్ కదా
  యాతీరైన ఫలమ్ములన్ గనగనే అయ్యారె నోరూరుగా
  ప్రీతిన్ గొందము త్రోవ ప్రక్కగల యా శ్రేష్ఠంపు పండ్లన్నిటిన్
  ప్రాతఃకాలమునందుతిన్న రుచి సంప్రాప్తించు సంతృప్తియున్!

  రిప్లయితొలగించండి
 22. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వచ్చిన, వచ్చి’లను ‘ఒచ్చిన, ఒచ్చి’ అన్నారు. రెండవ పాదాన్ని ‘కోతకై వచ్చు మంచివి కోసి తెచ్చి’ అనండి.
  ****
  శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘వెళ్ళే’ అన్నదాన్ని ‘వెళ్ళెడి/ వెడలెడి’ అనండి.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  కుసుమ సుదర్శన్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  మీ ఇంటిపేరును టైప్ చేసినప్పుడల్లా సంవత్సరం క్రితం మరణించిన మా మిత్రుడు కుసుమ రాజేందర్ గుర్తుకు వస్తాడు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘శీతకాలము నందు’ అన్నప్పుడు గణదోషం.. ‘శీతకాలమందు’ అనండి.
  ‘లవణములతో పాటు’ అన్నప్పుడు గణదోషం. ‘లవణాలతో పాటు’ అనండి. ‘వైటమిన్లు + ఉన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వైటమిన్లు గలుగు’ అనండి.
  ****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
  గణ దోషములకు మన్నించ వలెను తమరిసూచనలతోసవరించినపద్యములు
  1.వేయి కనుల పండు తీయనైన గుజ్జు
  దజనువంద గొనుడు సుజనులార
  శీత కాలమ౦దు సీతాఫలమ్మిది
  వాతహరిణి తినగ వలయు నిపుడు
  2.చాకిలేటు కన్న చౌక.ఆరోగ్యము
  పాడుచేయు నూనెవంట కాదు
  ప్రకృతి సహజ ఖాద్య లవణాల తో పాటు
  వైటమిన్లు కలుగు స్వీటుయనగ
  3.కారుదొరలు బైకుదారులు సైకిలు,
  బస్సు లందు పోవుప్రజలు,బాల
  తరుణు లెల్లవారు తప్పక తినినచో
  మేలుస్స్వాస్థ్య మొదవి గ్రాలు చుంద్రు
  1.వేయి కనుల పండు తీయనైన గుజ్జు
  దజనువంద గొనుడు సుజనులార
  శీత కాలమ౦దు సీతాఫలమ్మిది
  వాతహరిణి తినగ వలయు నిపుడు
  2.చాకిలేటు కన్న చౌక.ఆరోగ్యము
  పాడుచేయు నూనెవంట కాదు
  ప్రకృతి సహజ ఖాద్య లవణాల తో పాటు
  వైటమిన్లు కలుగు స్వీటుయనగ
  3.కారుదొరలు బైకుదారులు సైకిలు,
  బస్సు లందు పోవుప్రజలు,బాల
  తరుణు లెల్లవారు తప్పక తినినచో
  మేలుస్స్వాస్థ్య మొదవి గ్రాలు చుంద్రు
  1.వేయి కనుల పండు తీయనైన గుజ్జు
  దజనువంద గొనుడు సుజనులార
  శీత కాలమ౦దు సీతాఫలమ్మిది
  వాతహరిణి తినగ వలయు నిపుడు
  2.చాకిలేటు కన్న చౌక.ఆరోగ్యము
  పాడుచేయు నూనెవంట కాదు
  ప్రకృతి సహజ ఖాద్య లవణాల తో పాటు
  వైటమిన్లు కలుగు స్వీటుయనగ
  3.కారుదొరలు బైకుదారులు సైకిలు,
  బస్సు లందు పోవుప్రజలు,బాల
  తరుణు లెల్లవారు తప్పక తినినచో
  మేలుస్స్వాస్థ్య మొదవి గ్రాలు చుంద్రు

  రిప్లయితొలగించండి