చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** జిగురు సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ‘తెలిసీ తెలియని’ అన్నదాన్ని ‘తెలిసియు తెలియని’ అనండి. అలాగే ‘కలిసే, తెలిసే’లను ‘కలసియె, తెలిసియె’ అనండి. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్సులు.. బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలను వెంటవెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి. **** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కెంబాయి తిమ్మాజీ రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** గుండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** కె. ఈశ్వరప్ప గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. మూడవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘ఫలపుష్పాదులతోడను/ ఫలపుష్పాదులు గలిగిన’ అనండి. **** కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** గుండు మధుసూదన్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** బొడ్డు శంకరయ్య గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కలికాలంబున తరుగును
రిప్లయితొలగించండివిలువలు సుగుణులను గావ వెధవగ మిగులున్
నిలబడి ధర్మపధంబున
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
పశ్చాత్తాపమే - ప్రాయశ్చిత్తం :
01)
____________________________
నలుగురిలో తన తప్పును
నిలకడగా నొప్పు కొనుచు - నేరము నికపై
కలనైనను చేయ ననిన
తులువను దండించువాఁడు - దుర్మార్గుఁ డగున్ !
____________________________
ఇలనగు సన్మార్గుడుగా
రిప్లయితొలగించండితులువను దండించువాడు ,దుర్మార్గు డగు
న్గలలో సైతము పరులకు
తలచునొ నపకార మె వడు తప్పక యతడే
తెలియక పెద్దలఁ దిట్టుచు
రిప్లయితొలగించండికలహించెడి కొంటెతనపు గాదిలి సుతునిన్
కుల దీపకుడని తలవక
తులువను దండించు, వాఁడు దుర్మార్గుఁ డగున్!!
జిగురు వారి స్ఫూర్తితో :
రిప్లయితొలగించండి02)
____________________________
పలు విధముల చెడు నడతల
నిల నడచెడు శిశువుల యెడ - నెనరది పెరుగన్
తెలివిని గరపగ, కఠినము
తులువను దండించువాఁడు - దుర్మార్గుఁ డగున్ ???
____________________________
నెనరు = దయ, ప్రేమ
పూజ్యులు శంకరయ్య గార్కి నమస్సులు
రిప్లయితొలగించండి( నిర్భయ ఘటణ లో ఇరికిన బాలుడనుద్దేశించి )
తెలిసీ తెలియని వయసున
బలిగొనె నాతండొ కన్య బ్రతుకు కఠినుడై
కలిసితిరిగి దుష్టులతో
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్.
నిలువన దోచిరి దేశము
రిప్లయితొలగించండికలిసే పాచిక కదిపిరి కష్టము లేకన్
తెలిసే చేసెను సుమ ఆ
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్.
తులువల దండించినచో
రిప్లయితొలగించండిపలువిధముల మెత్తురింక వసుధను నరులే
తులువసమూహమునకు మరి
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్.
విలువలు గలిగిన వేళల
రిప్లయితొలగించండికొలుతురు కుత్సుతునిcగొట్ట గొప్పగ మహిలో ,
విలువలు దప్పిన వేళల
తులువను దండించు వాcడు దుర్మార్గు డగున్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండిచెలికాండ్రను రక్షించుచు
నిలపై గల మన్ను దినుచు నింతుల నెల్లన్
వలపించెడి శ్రీకృష్ణుని,
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘తెలిసీ తెలియని’ అన్నదాన్ని ‘తెలిసియు తెలియని’ అనండి. అలాగే ‘కలిసే, తెలిసే’లను ‘కలసియె, తెలిసియె’ అనండి.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ సలహాలకు కృతజ్ఞతలు
రిప్లయితొలగించండికం . తెలిసియె తెలియక వయసున
బలిగొనె నాతండొ కన్య బ్రతుకు కఠినుడై
కలిసితిరిగి దుష్టులతో
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్.
కం . నిలువన దోచిరి దేశము
కలసియె పాచిక కదిపిరి కష్టము లేకన్
తెలిసియె చేసెను సుమ ఆ
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్.
తెలియక జేసిన తప్పులు
రిప్లయితొలగించండితెలివిగ సరిదిద్దుకొనుచు దిరుగుచు నిలలో
నలుగురి మంచిని గోరెడి
తులువను దండించు వాడు దుర్మార్గుడగున్
పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండికొలువున శాసన సభ్యులు
చెలువమ్మును మరచి కాలి చెప్పులు తీయన్
కలహము మాన్పరదేలను?
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్ !
పలువురి మేలునుఁ గోరిన
రిప్లయితొలగించండిసులువుగ విడువంగ వచ్చు చోరుల వినతుల్.
మలినమ్మగు బుద్ధులకా
తులువను ద౦డి౦ చువాడు దుర్మార్గుడగున్
వలదనుచుఁ దండ్రి చెప్పిన
రిప్లయితొలగించండిపలుమారులు హరిని గొలుచు భక్తి ప్రపత్తిన్!
కలనైనను ప్రహ్లాదుని
తులువను దండించు వాఁడు దుర్మార్గుఁడగున్!
మల్లెలవారిపూరణలు
రిప్లయితొలగించండిపలుగతి చేతల నె౦దరొ
కలిగించుచు చేటు నిలకు ఘనులుగ మెలగన్
ఎలమిని పొగడెడి కాలము
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్ !
2.వెలుగును పాలనమె పుడును
తులువను ద౦డి౦చువాడు, దుర్మార్గుడగున్
పలుగతి మేలును గూర్చుచు
పలుకులు మృదువుగపలికెడి వారిని నేచన్
3.వెలుగుదు రింపుగ నిచ్చక
ములవియ తామటుపలుకుచు పొందరె శుభముల్
విలువల మాటాడు నతని
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
4.తులువలు నేడిల గౌరవ
ములగనిసన్మానములను మోదము నందన్
విలువ నెరి౦గియు నెవడేన్
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
5.కలిలో విలువలు తరిగెను
పలుకులతో మోసగించి ప్రజలకు చెడునే
కలుగగ జేసిన మెత్తురు
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
తెలవక చెడు నడవడిలో
రిప్లయితొలగించండిపలుమారులు తిరిగి తుదకు ప్రాజ్ఞుండాయెన్
నలగిన మార్గము వీడిన
తులవను దండించు వాడు దుర్మార్గుడగున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలియక చెడు నడవడిలో
రిప్లయితొలగించండిపలుమారులు తిరిగి తుదకు ప్రాజ్ఞుండాయెన్
నలగిన మార్గము వీడిన
తులవను దండించు వాడు దుర్మార్గుడగున్
కె ఈశ్వరప్పగారి పూరణలు
రిప్లయితొలగించండితెలిపెడిపాఠమువినకను
నలుగురితోకలసి మెలసి నవ్వుచు నుండన్
ఫలిత౦ బెరుగక గురువే
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
2.విలువగుచదువును విడిచియు
తలపులలో ప్రేమ యనుచు తలచకు నీకున్
తెలిసియు తెలియని వయసని
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
3.ఫలపుష్పాదులతో
నిలువెత్తున చెట్ల నరక నీకే ముప్పౌ
తెలియద?నీ చదువెందుకు:
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
రిప్లయితొలగించండివిలువలు తలక్రిందయ్యెను
పలువను సేవించు వాడు బలవ౦తుడగున్
వలదిది యని వారించుచు
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
రిప్లయితొలగించండిమరియొక పూరణ
పలువురు జూడగదోచిన
తులువను ద౦డి౦చు వాడు దుర్మార్గుడగున్
అల పోలీసును బిలువక
తులువను ద౦డి౦చుటయును తప్పేగదరా
విలువలు నశించె నిలలో
రిప్లయితొలగించండిపలువిధ వ్యసనముల మరగి పాడగు విద్యా
ర్థుల నాయకుడైన ఖలుని,
తులువను దండించు వాడు దుర్మార్గుఁడగున్
పలుగతి చెడువర్తనముల
రిప్లయితొలగించండిఖలుడగు నామానవుండు కంతిరియగుగా
మెలకువ పాటించుచునా
తులువను దండించు; వాడు, దుర్మార్గుడగున్!
వలువలుదోచెడివాఁడును
రిప్లయితొలగించండిలలనలఁ మురిపించువాఁడు రహియించగ గో
కులముననాడెడి కృష్ణుని
తులువను దండించువాఁడు దుర్మార్గుఁడగున్.
కవిమిత్రులందఱకు నమస్కారములు!
రిప్లయితొలగించండి(1)
ౘలమరియు బాలిశుండగు
తులువను సరిచేయఁగాను దొలియత్నమునున్
బలిమినిఁ బూనఁగ నెట్టులఁ
దులువను దండింౘువాఁడు దుర్మార్గుఁ డగున్?
(2)
కలహించి కుత్సితముచే
విలువలఁ గోల్పోయి మెలఁగు పిశునుని చేష్టన్
నిలువరము చేయఁగను నా
తులువను దండింౘు! వాఁడు దుర్మార్గుఁ డగున్!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి2
రిప్లయితొలగించండిఖలుడును కుత్సితుడై తను
పలునేరమ్ములను జేసి పదవులఁ బొందన్
కలికాలపు మహిమేయిది
తులువను దండించు వాడు దుర్మార్గుఁ డగున్
ఇలలో దోపిడి జేయుచు
రిప్లయితొలగించండికలవారిని కొల్లగొట్టి కడు పేదలకున్
తల యింత పంచి పెట్టెడు
తులువను దండించువాడు దుర్మార్గుఁడగున్!
కవిమిత్రులకు నమస్సులు..
రిప్లయితొలగించండిబంధువుల ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి ఇప్పుడే తిరిగి వచ్చాను. అందువల్ల మీ పూరణలను వెంటవెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
గుండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘ఫలపుష్పాదులతోడను/ ఫలపుష్పాదులు గలిగిన’ అనండి.
****
కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పలుకుల్లింకయు రాకయె
రిప్లయితొలగించండితలుపుల్మూయుచు తెరచుచు తప్పట నడకన్
విలపించి నిద్ర చెరచెడి
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్
తులవగు భామిని కోరగ
రిప్లయితొలగించండిబలుపగు కౌగిలిని రాత్రి పవలున్ పతినిన్
వలపుల నీయక కర్రను
తులువను దండించువాఁడు దుర్మార్గుఁ డగున్