1, నవంబర్ 2014, శనివారం

నిషిద్ధాక్షరి - 17

కవిమిత్రులారా,
కవర్గాక్షరాలు లేకుండా
కాకాసుర వృత్తాంతాన్ని గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. అండజపు జాతిఁ బుట్టిన యసురుడు తన
    వాడి యగు పునర్భవముల పద్మనయన
    రాము పత్ని స్తనములపై రాయిడించ
    నమ్ము నేసెనుపేంద్రుడా యసురుపైన
    ప్రార్థనఁ జలుప దైత్యుడు భయముతోడ
    దేహమందలి యంగ మేదేని యిచ్చి
    పొందు మూఱట నని తెల్పె భూవిభుండు
    నేత్ర మిచ్చెను దనుజుడు నింద బాయ
    గోరు: పునర్భవము
    రాయిడించు: అల్లరి చేయు

    రిప్లయితొలగించండి
  3. పత్ని ధరుణమున్ జీరెడి పర్వి జూచి
    దాశరధి వేసె నస్త్రము దర్బ తోడ
    జలదరించిన పిశునము శరణుజొచ్చె
    బొంది నందలి నేదైన పొంది నంబు
    శాంత పడునని తెల్పెను సత్యుడపుడు
    నేత్ర మిచ్చుచు సేవించి సూత్రి వెడలె

    రిప్లయితొలగించండి
  4. మల్లెలవారి పూరణలు
    సీతతోడను రాముండు సేదదీర
    వాయసము రూపు నసురుడు భామజూచి
    జంచు వుల తోడ పొడిచెను చన్ను వెసను
    రాముదాతని నేత్రాల రాలజేసె
    2భామచన్నున పొడిచెను వాయసమ్ము
    దర్భ నస్త్రము జేసిన దానిచూపు
    పోయే రాముడే మరలను పొలుపు కొంత
    చూపు నిచ్చెను దానికి చోద్యమలర

    రిప్లయితొలగించండి
  5. అసురుడు వాయస రూపము
    నసీత రొమ్ములను ముక్కునన్ పొడువగ ద
    ర్భసమ౦త్రమ్ముగ రాము౦
    డసి జేసెను యసుర నేత్ర మది బలి జేసెన్

    రిప్లయితొలగించండి
  6. కె. ఈశ్వరప్పగారి పూరణ
    వాయసమ్ము మదిని మాయలు జేరెనో
    సీత రాము చెంత చిలిపి జేయ
    రెల్లు బాణమిడెను రెచ్చిన రాముడు
    నేత్ర ద్వయము అర్ధ నేత్ర మాయె

    నవంబర్ 01, 2014 5:00 PM

    రిప్లయితొలగించండి
  7. మోహ వశమున పిశునము భూమి సుతను
    వక్ష మందున దన్నిన వరుస జూచి
    దర్బె బ్రహ్మాస్త్ర మైపోయె దాడిఁ జేయ
    శరణు జొచ్చిన విడదని శ్యాముడనిన

    పాపినై తల్లి సీతమ్మ వైపు నేను
    చూడరానట్టి చూపులఁ జూచి నాను
    నయన మర్పంతు నని వేడి పయనమయ్యె
    పాప ఫలితమ్ము వెంటాడు పాపి నెపుడు!

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందఱకు నమస్కారములు!

    దుష్ట వాయస రూప దైత్యుండు మైథి
    లిని వ్యధితఁ జేయ, రాముండు వ్రీతి దర్భఁ
    జేత నంది బ్రహ్మాస్త్రముం బూత మంత్ర
    సహితనున్ విడువ, నదియు సాల్వుఁ జంప

    వెంటఁబడఁ బరువెత్తుచు భీతిఁ ద్రిభువ
    నమ్ములను సంచరించుచు "నన్నుఁ బ్రోవు"
    మంచుఁ బిలువ, నెవ్వండు నోమను, దరిఁ జనఁ
    దెంపు సేయనుఁ బుయిలోడఁ, దెలిసి వాఁడు
    మఱలి శ్రీరాము "శరణ మి"మ్మనుచు వేడ,

    "దానిని మఱలింపను నసాధ్య"మ్మటంచు,
    నతని దేహాంశ మిచ్చిన నదియు శాంతిఁ
    బొందునన, నేత్రమును నిచ్చి, పోయినాఁడు,
    తనదు తప్పును మన్నింపు మనుచు వేడి!!

    రిప్లయితొలగించండి
  9. వాయస రూపపు నసురుడు
    పాయని మోహంబు తోడ భామను సీత
    న్నా యా తావుల నొచ్చుట
    వాయసపున్నే త్ర మొండు బా యెన్ద ర్భన్

    రిప్లయితొలగించండి
  10. వాయస వంశపు నసురుడు
    పాయని రోషంబు తోడ బాలుని జిష్ణి
    న్నాయువు తీయను వచ్చుట
    ఛాయను హరి జూచి యపుడు చంపెను వానిన్

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    శ్రీ కంది శంకరయ్యగారికి నింటఁ బనిలో నిమగ్నమైయున్న సమయానఁ బొరపాటునఁ దలకు బలమైన దెబ్బతాకినందునఁ దల్లడిల్లుచు, మన యందఱి పద్యములను విశ్లేషింపఁజాలకుంటినని చరవాణిద్వారమున నాకుఁ దెలిపినారు. మిత్రులు పరస్పర పద్య గుణదోష విచారణ చేయఁగలరని మనవి చేసినారు. గమనించఁగలరు.

    రిప్లయితొలగించండి
  12. గుండువారూ, కవిమితులారా, ఇది చదివి విచారం‌ కలిగింది. శ్రీశంకరయ్యగారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ,
    మీ యష్టపాది తేటగీతి పూరణము బాగున్నది. అభినందనలు.
    కాని, రెండవ, యాఱవ పాదములందు నిషేధిత "గ"కారము దొరలినది. సరిచేయఁగలరు.
    ***
    శైలజగారూ,
    మీ పూరణము బాగున్నది. అభినందనలు.
    దాశరధి>దాశరథి, దర్బ>దర్భ...టైపాటులు కాఁబోలును.
    "బొంది నందలి నేదైన పొంది నంబు"నను పాదమును...
    "బొంది యందలి యేదైన బొంది యమ్ము"గా సవరింపఁగలరు.
    ***
    మల్లెలవారూ,
    మీ రెండు పూరణములు బాగున్నవి. అభినందనలు.
    పద్యములలో నచ్చటచ్చటఁ గొన్ని యల్పదోషములు దొరలినవి. సవరింపఁగలరు.
    ***
    కెంబాయి తిమ్మాజీ రావుగారూ,
    మీ పూరణము బాగున్నది. అభినందనలు.
    కాని, నిషేధిత "గ"కారములు దొరలినవి. సవరింపఁగలరు.
    ***
    కె.ఈశ్వరప్పగారూ,
    మీ పూరణము బాగున్నది. అభినందనలు.
    కాని, చిన్న సవరణముం జేయవలసియున్నది.
    "నేత్ర ద్వయము అర్ధ నేత్ర మాయె" దీనిని...
    "నేత్ర యుగమె యేక నేత్ర మాయె"గా సవరించిన నెటులుండును?
    ***
    గుండా వెంకట సుబ్బ సహదేవుడుగారూ,
    మీ తేటగీతిద్వయయుత పూరణము బాగున్నది. అభినందనలు.
    కాని, చిన్న సవరణము లవసరము.
    రెండవపాదమునఁ "దన్నిన" యను దానిని "జీల్చిన" యనఁగలరు.
    ...నయన మ’ర్పం’తు టైపాటు కాఁబోలును.
    ***
    సుబ్బారావుగారూ,
    మీ రెండు పూరణములు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణమున...
    ప్రథమపాదమున "వాయసపు టసురుఁడు"ననియు,
    చతుర్థపాదమున "...పాసెన్ దర్భన్" అనియు సవరింపఁగలరు.
    అట్లే...
    ద్వితీయ పూరణమున...
    ప్రథమపూరణమందువలెనే...ప్రథమపాదమును సవరింపఁగలరు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. గురుదేవులు శంకరయ్య గారికి వందనములు మీరు
    త్వరలో కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను

    అసురుడు వాయస రూపము
    నసీత రొమ్ములను ముక్కునన్ పొడిచిన ద
    ర్భ సమంత్రమ్మున రాము౦
    డసి జేసెను యసుర నేత్ర మది బలి జేసెన్

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  16. శంక రార్యుడ !మీకుగా శంకరుండు
    రుగ్మతను దరిమి యిక యా రోగ్యవంతు
    జేయు గావుత !మిమ్ముల , యీ య దనున
    వేడు కొం దును నేనును విశ్వవిభుని

    రిప్లయితొలగించండి
  17. సత్యనారాయణరెడ్డిగారి పద్యం అండజపు జాతిఁ బుట్టిన....
    బాగుంది. రామపత్ని అన్నా సరిపోతుంది. అంతధార కనబడలేదు కాని పూరణమే కదా.

    శైలజగారి పద్యం పత్ని ధరుణమున్ ...
    ధరుణము అన్నది పర్యాయపదనిఘంటువులో కనబడినా ప్రయోగాలేమన్నా ఉన్నాయా అన్న తెలియదు. ధరుణమున్ అన్నది గణదోషం అవుతున్నది కాబట్టి ధరుణంబు అనండి. జదరించు అన్నది ప్రత్యేకసంధర్భాన్ని తెలిపే‌ మాట. అన్ని రకాల భయసందర్భాలకూ వాడటం సముచితం కాదనుకుంటాను. చావ వెఱచిన అందామా? "బొంది నందలి నేదైన పొంది నంబు" అన్నది మార్చి "బొంది నవయవ మేదేని బొంది శరము" అంటే బాగుంటుందేమో యోచించండి. అలాగే, "శాంత పడునని" బదులు "శాంత మౌనని" అంటే బాగుంటుంది. సత్యుడు అన్నది రాముడుగా దూరాన్వయం చేయటం‌కంటే "శాంత మౌనని శ్రీరామచంద్రు డనిన" అనండి. "నేత్ర మిచ్చుచు" కన్నా "నేత్ర మొండిచ్చి" అనటం కొంచెం సుభగంగా అనిపిస్తోంది.

    తిమ్మాజీరావుగారి ద్వారా అందిన మల్లెలవారి పద్యాలు
    *సీతతోడను రాముండు...లో
    "వాయసము రూపు నసురుడు" కన్నా "వాయసం బౌచు నసురుడు" అంటే మరింత బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఉంచాలనుకుంటే వాయసపు రూపున నసురుడు అనాలి కాని కష్టాలున్నాయి గణాలతో.
    "జంచు వుల తోడ పొడిచెను చన్ను వెసను" అన్న పాదంలో‌ తోడ, వెసను అన్నవి కేవలం గణలభ్యాలన్నట్లే ఉన్నాయి కాబట్టి "జంచువుల తోడ పొడిచెను చన్ను వెసను " అదీకాక చంచువు అంటె ముక్కు. దానికి బహువచనం చేయరాదు కదా. అలాగే "రాముదాతని నేత్రాల రాలజేసె" అన్నదీ "రాము డాతని నేత్రంబు రాలజేసె" అనండి కాకికి పోయిందొక కన్నే.

    *భామచన్నున పొడిచెను ...లో
    చివరి రెండుపాదాలూ కృతకంగా ఉన్నాయి. పోయే అన్నది టైపాటు పోయెకు.

    తిమ్మాజీరావు గారిపద్యం అసురుడు ...
    ముక్కునన్ అనకూడదు క-వర్గం నిషేదం కదా. ఈ‌ పద్యమూ, క్షమించాలి, కృతకంగా ఉంది..

    సహదేవుడుగారి పద్యాలు
    * మోహ వశమున...
    మో..భూలకు యతిమైత్రి గమనార్హం. తన్నిన బదులు తన్నెడు అనండి. దర్బె అనకూడదు. దర్భయె అనవలసి ఉంటుంది. హాయిగా దర్భ అనండి సరిపోతుంది. సమస్యాపూరణం, నిషిధ్ధాక్షరి, దత్తపది ప్రక్రియల్లో మొత్తం చెప్పదలుచుకున్నది ఒకే‌ పద్యంగా చెప్పాలి.

    గుండువారి పద్యాలు
    లి-ప్రీ లకు యతిమైత్రికి కారణం రలయోరభేధః అని యతివిషయక మనుకుంటాను."సాల్వుఁ జంప" అన్నది బోధపడలేదు. పద్యాలు బాగున్నాయి. కొంత పూరణాయసం కనిపించింది కాని దానికి వర్గనిషేధమే కారణం గాని మరేమీ లేదు.
    సుబ్బారావుగారి పద్యం వాయస వంశపు..
    వాయస వేషపు అంటే కథకు దగ్గరగా ఉంటుంది.

    ఇంకా కొంత పరిశీలనం ఉంది. భోజనానంతరం అది చూస్తాను. ఒకటి రెండు పద్యాలు తపప్పిపోయిన ట్లున్నాను కూడా.

    రిప్లయితొలగించండి
  18. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
    సవరించిన పద్యము.
    అండజపు జాతిఁ బుట్టిన యసురుడు తన
    వాడి యౌ పునర్భవముల పద్మనయన
    రామ పత్ని స్తనములపై రాయిడించ
    నమ్ము నేసెనుపేంద్రుడా యసురుపైన
    ప్రార్థనఁ జలుప దైత్యుడు భయముతోడ
    దేహపు నవయవమ్ము నేదేని యిచ్చి
    పొందు మూఱట నని తెల్పె భూవిభుండు
    నేత్ర మిచ్చెను దనుజుడు నింద బాయ

    రిప్లయితొలగించండి
  19. పూజ్య గురుదేవులు త్వరగా కోలు కోవాలని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  20. శ్యామలీయం గారికి తమరి సూచనలకు ధన్యవాదాలు. కాకాసురుడు కథ నా దగ్గర లేదు. పూర్వం చదవలేదు. శబ్ద రత్నాకరములో ఉన్న కొద్ది సమాచారాన్ని ఉపయోగించి పూరణ చేయటానికి ప్రయత్నించాను.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారికి ప్రణమిల్లుతూ..
    మీ తలకు దెబ్బ తగిలిందని తెలిసి చాలా భాధ కలిగింది,మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను..

    రిప్లయితొలగించండి
  22. గురుతుల్యులు శ్రీ మధుసూదన్ గారికి, శ్రీ శ్యామలీయంగారికి ధన్యవాదములు...

    రిప్లయితొలగించండి
  23. గురుదేవులు త్వరగా కోలుకోవాలని దేవదేవునికి ప్రార్థన. శ్రీ గుండు మధుసూదన్ గారికి మరియు శ్రీ శ్యామలీయం గారికి ధన్యవాదాలు.
    సవరించిన పద్యం : తేటగీతికగా
    మోహ వశమున పిశునము భూమి సుతను
    వక్ష మందున జీల్చిన వరుస జూచి
    దర్బ బ్రహ్మాస్త్ర మైపోయె దాడిఁ జేయ
    శరణు జొచ్చిన విడదని శ్యాముడనిన
    పాపినై తల్లి సీతమ్మ వైపు నేను
    చూడరానట్టి చూపులఁ జూచి నాను
    నయన మర్పింతు నని వేడి పయనమయ్యె
    పాప ఫలితమ్ము వెంటాడు పాపి నెపుడు!

    రిప్లయితొలగించండి

  24. వాయస రూపపు ట సురుడు
    పాయని మోహంబు తోడ భామను సీత
    న్నా యా తావుల నొచ్చుట
    వాయసపున్నే త్ర మొండు బా సె న్ద ర్భన్

    రిప్లయితొలగించండి
  25. శంకరయ్య మాష్టారుకి నమస్కారములు. మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి