23, నవంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 744

కవిమిత్రులారా,

పై పద్యభావాన్ని తేటగీతిలో వ్రాయండి.

18 కామెంట్‌లు:

 1. రాధా కృష్ణుల జూడగ
  వ్యాధులులే దొలగి ,గలుగు పరమప దమ్మున్
  గాధలు వినగను గృష్ణుని
  బాధలు మఱి మఱు వ, వచ్చు బ్రమదము మదికిన్

  కుసుమ కోమలి రాధమ్మ కోర్కె లలర
  కృష్ణ భగవాను మీదన కేలు వేసి
  యధర మధరము గలుపుచు నాస్వ దించు
  రాధ మఱియును గృష్ణుని రహిని గొలుతు

  రిప్లయితొలగించండి
 2. సుదతి కాటుక కనులనా చూపు లేమి
  తలపులందున గలదేమి తరుణి చెప్పు
  చిరునగవులోన సంకోచమెరుగనైతి
  తగదు యధరంబుల వెనుక దాచ నీకు

  రిప్లయితొలగించండి
 3. అద్వైత మూర్తి

  రచన : కరుణశ్రీ
  సంగీతం : ఘంటసాల
  గానం : ఘంటసాల

  అది బృందావనం.
  మంద మలయానిలుని చక్కిలిగింతలకు
  కల కల నవ్వే కాళిందీ తరంగాల్లో
  ఒక ప్రేమ నౌక.

  నౌకలో రాధా కృష్ణులు.
  రాధకు కోపం వచ్చినట్లుంది.
  మాట్లాడవేం?
  ఏమిటీ మౌనం?

  01) || ఉత్పలమాల ||

  చూచెద వేలనో ? ప్రణయ - సుందరి ! కాటుక కళ్ళలోని ,ఆ
  లోచన లేమిటో ? హరిణ - లోచని ! నీ చిరు నవ్వు లోని ,సం
  కోచము లెందుకో ? కుసుమ - కోమలి ! నీ మధురాధరమ్ము లో
  దాచు కొనంగ నేటికి ? సు - ధామయ సూక్తి కళా విలాసినీ !

  ఆ..............................................................................................

  సిగ్గు పడుతున్నావా ? చూడు......

  02) || మత్తేభము ||

  మన దాంపత్యము,సత్యమౌ ప్రణయ సా - మ్రాజ్యమ్ములో,లోతులన్
  గనియెన్ ,సాగెను ,భాగ్య నౌక, కవితా - కాళిందిలో ,నవ్య ,జీ
  వన ,బృందావన ,దివ్య సీమ ,విహ రిం - పన్ ,రమ్ము ,నే, కొల్లగొం
  దును,నీ,కోమల,బాహు బంధనము లం - దున్,కోటి స్వర్గమ్ములన్

  అదిగో ! అలా చూడు దేవీ......

  03) || శార్ధూలము ||

  భావోధ్యానము నందు, క్రొత్త వలపుం - పందిళ్ళలో, కోరికల్

  తీవల్ సాగెను! పూలు పూచెను ! రసార్ - ధ్రీ భూత చేతమ్ముతో

  నీవే నేనుగ , నేనె నీవుగ , లతాం - గీ ! ఏకమై పోద మీ

  ప్రావృణ్ణీరద పంక్తి క్రింద, పులకిం - పన్,పూర్వ పుణ్యావళుల్

  **************
  శంకరార్యా !
  ముందొకసారి - గానగంధర్వుని - అమరగానం - వినండి

  http://www.ghantasala.info/padyaalu/657_Private

  %20Songs_Advytamurti%28Padyam%29.mp3

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  చిన్నదాని చిత్రాలు :

  01)
  __________________________

  నల్ల కళ్ల వెనుక గల - నవ్వు లేమొ ?
  నవ్వులోని మర్మములను - రువ్వరాదె ?
  చెప్పకుండ పెదవి వెన్క - గప్పు టేల ?
  చిక్కు ప్రశ్న వైతివి గద - చిన్నదాన !
  __________________________

  రిప్లయితొలగించండి
 5. శంకరార్యా !
  కరుణశ్రీ ప్రశ్నకు - సినారె సమాధానం - యిదిగో
  "గుడిగంటలు" సినిమా నుండి - వినండి

  దూరానా నీలి మేఘాలు - నాలోనా కొత్త భావాలు
  పూచేనూ కోటి మురిపాలు - తొంగి చూచేనూ కన్నె సరదాలు

  నల్లని జడలో సింగారించగ - నవ్వుల పువ్వులు కోసితిని
  నచ్చిన ఊహల నాగస్వరానికి - నా జడ నాట్యము చేసినది

  తేనెలు తాగుచు గాలుల తేలుచు - తుమ్మెద ఝుమ్మని ఆడినది
  తుమ్మెద తీరున కమ్మని నా మది - తుళ్ళుచు గెంతులు వేసినది

  *****
  https://www.youtube.com/watch?v=nJb6gbfjzbg


  రిప్లయితొలగించండి
 6. లేడి కన్నుల యోచనలేమొ? నగవు
  లందు మోమాటమేలొకొ? యమృతమొల్కు
  పల్కు దాచుటే తేనియ వాతెఱలను?
  కాటుక కనుల ప్రేయసీ! కళల కలికి!

  గురువుగారు, ధన్యవాదాలు.
  మంచి చాలెంజ్ ఇచ్చినారు. మిత్రులు సమర్థవంతంగా పూరించినారు. పూరింపనున్నారు.

  వసంత కిశోర్ గారు!
  అద్భుతమైన అందమైన కరుణశ్రీ పద్యామృతాన్ని పంచుకొన్నందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 7. చూపుల ప్రణయ సుందరీ!చూడనేల
  హరిణ లోచనాలోచనా సరళి యేదొ?
  చిరు నగవుల సంకోచముఁ జెదర దేల?
  దాచకె! మధురాధరఁపు సుధా రసోక్తి!

  రిప్లయితొలగించండి
 8. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  కాని అవి చిత్రానికే అన్వయిస్తున్నవి. కరుణశ్రీ గారి పద్యభావాన్ని తేటగీతిలో ఇముడ్చాలన్నది మీరు గమనించలే దనుకుంటాను.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘తగదు + అధరము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తగ దధరముల వెనుకను దాచ నీకు’ అనండి.
  ****
  వసంత కిశోర్ గారూ,
  మీ ఓపికకు విషయసేకరణాసక్తికి నమోవాకాలు.
  మీరందించిన కరుణశ్రీ పద్యాలకు, సినారె గీతానికి ధన్యవాదాలు.
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. కాటుక కనులలోనున్న కాంక్షలేమి?
  మూగ సైగల కథయేమి ముద్దు గుమ్మ?
  వెనుక దీయక దెల్పుమా వేడ్క తోడ
  నీదు యధరమ్ములో కాంచు నాదు ప్రేమ.

  రిప్లయితొలగించండి
 11. ప్రణయ భావంబు లొలికించు భామ యలుక ,
  అలుక కన్నులు నిండగ హరిణి కనులు ,
  కనుల కోమలి చిరునవ్వు కానరాదె
  మధుర సుధలను దాచెను అధర ములను
  అలుక తీరుట ఏలకో అప్ప ళించు!
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ****
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. ప్రణయ సుందరి ! జెప్పుము వలపు గలిగె ?
  నేల నీ చూపు లటులుండె ? నిత్తరి మరి
  చిరున గవులలో సంకోచ మౌర ,యేల ?
  హరిణ లోచన ! యాకంటి యర్ధ మేది ?
  కోమలధరా మృ తముదాచు కొనగ నీవు
  నేల ? మఱి నాకు దెలుపుము బేల ! యిపుడు

  రిప్లయితొలగించండి
 14. సుబ్బారావు గారూ,
  మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. పూజ్యులు శంకరయ్య గార్కి నమస్సులు
  హరిణ లోచనా నీచూపు యర్థ మేమొ
  కళ్ల కాటుక చాటున కవన మేమొ
  అధర మధురామృతమ్ములనందనీము
  నేడు ఈ సుధా మయ నీడ నాడ నీము

  రిప్లయితొలగించండి
 16. ఏమని పలికేనో… రాధా
  ఆ మాధవుడు అడిగిన వేళల ||ఏమని||

  అదిరే పెదవుల పదములు తొణకుచు
  చెదరిన తలపులు వెదుకులాడుచూ ||ఏమని||

  తొలకరి చినుకులు చలి తెమ్మెరలు
  తలిరాకులనే తడిమిపోవగా ||ఏమని||

  కనుల తహతహలు వీనుల మధువులు
  తనువున పులకలు మునుముప్పిరిగొన ||ఏమని||

  రిప్లయితొలగించండి
 17. లక్ష్మీదేవిగారూ ! ధన్యవాదములు !

  శంకరార్యా ! ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 18. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘నీచూపు యర్థ’మన్నచోట ‘చూపుల యర్థమేమొ’ అనండి. చివరి రెండు పాదాల చివర ‘ఇమ్ము’ను ‘ఈము’ అన్నారు.
  ****
  ఆదిత్య గారూ,
  మీ గీతం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి