14, నవంబర్ 2014, శుక్రవారం

చమత్కార పద్యాలు - 209


కర్తృ కావ్య నామగోపన వినూత్న రథబంధము
.
సీ.       శ్రీకుముద సువీర శిశిరామరాళీశ

శుచి శుభేక్షణ ధన్వి సుభుజ సుఖద

సుందర కుందర కుందారవిందాక్ష

రుచిరాంగద ముకుంద శుచి శమ శివ

యమ యజ్ఞభృదతీంద్రియాశోకకపికపీం

ద్ర కపిలకరణ కవి కథితకృతి

రోచిష్ణు విష్ణు విరోచనేజ్యపవిత్ర

పరమేశ పరమేష్ఠి భావ భయహ

గీ.       వేద సర్వప్రహరణాయుధాది రుచిర

నామజపపరాయణుల పుణ్యంబు నెంత

యనుచు వర్ణింపనోతు; మహాత్ముఁ డా కృ

తాత్ము దయఁగల్గు శోకరతాత్మసుకృతి.

శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి చిత్రభారతముకావ్యం భీష్మపర్వము నుంచి -

7 కామెంట్‌లు:

 1. శ్రీ మురళీధర రావు గారి చిత్ర " భా " రథము " రమణీయముగ నున్నది..
  రథ నిర్మాత ఏల్చూరి వారికి నమస్సులు.

  రిప్లయితొలగించండి
 2. పద్యం గులకరాళపాకంలో ఉన్నా బాగుంది.
  ‘చిత్రభారతము’ కావ్యం ఎక్కడ దొరుకుతుంది?
  నా బోటి అపండితుడికి కొరుకుడుపడుతుం దంటారా?

  రిప్లయితొలగించండి
 3. సుకవిమిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారూ,
  మీ చిత్రభారత మందలి రథబంధము, మిత్రులు శ్యామలీయం వారన్నట్లు పాషాణపాకముననున్నను, దండి పదలాలిత్య పద స్ఫోరకముగ నున్నది. కొంత కృషిచేసిన సుగమార్థబోధము కాఁగలదు. భవదీయ కావ్య క్షీరసముద్రమునుండి యమృతమునుం బొందవలెనన్న నెంతయో కొంత శ్రమింపవలసినదే యని నా యభిప్రాయము. నమస్సులు, అభినందనలు, కృతజ్ఞతలు!
  నాకొక చిన్న సందేహము పొడసూపుచున్నది.ధైర్యముచేసి యడుగుచుంటిని. మన్నింపుఁడు. తమరి సీసపద్యపు టెత్తుగీతియందలి చతుర్థపాదాంతమున గణభంగమైనటులం దోచుచున్నది. "ప్రమాదో ధీమతా మపి"యన్నారుకదా పెద్దలు! ఇది నా యజ్ఞానపు టాలోచయే కాఁబోలును. పరిశీలింపఁగలరు.

  రిప్లయితొలగించండి
 4. శ్యామల రావు గారూ,
  ఆ కావ్యం ఇంకా ప్రచురింపబడలేదు. చాలాకాలం క్రితం వ్రాసిన ఇంకా పరిశీలనలోనే ఉందని ఏల్చూరి వారు తెలియజేశారు.

  రిప్లయితొలగించండి
 5. మాన్యులు శ్రీ శంకరయ్య గారి సదయాదృతికి, ప్రోత్సాహానికి మరొక్కమారు ధన్యవాదాలు! _/\_!

  విద్వత్కవివరేణ్యులు శ్రీమాన్ గుండు మధుసూదన్ గారికి నమస్కారములు! _/\_!
  పద్యం ఎత్తుగీతి నాలుగవ పాదంలో "తాత్ము దయఁగల్గు శోకరతాత్మసుకృతి." అనే ఉండాలి. చిత్రరచనలో పొరపాటు దొర్లింది. మీ సూచన మూలాన ఇప్పుడు దానిని గుర్తించి సరిదిద్దుకొనే సదవకాశం కలిగింది. ఈ పరిష్కరణ నిమిత్తమే దీనిని ఇంకా ముద్రింపలేదు. మీ వైయాత్యానికి, ఛందోభిజ్ఞానానికి, సౌజన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు! _/\_!

  శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి
  సౌహృద్య నమస్కారములు! -/\_!

  శ్రీ గోలి హనుమమచ్ఛాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారములు! మీ భా”రథ”శబ్దాలంకారకౌశలీపూర్ణ శుభాశీస్సుకు ప్రణతిశతార్పణం! _/\_!

  శ్రీ శ్యామలరావు గారికి నమస్కారములు!
  మీరన్నట్లు పాషాణపాకానికి కీసవెలితిగా గులకరాళ్ళ పాకంలో ఉన్న వాక్యాలను ప్రసిద్ధపదఘటితంగా మార్చిన తర్వాతనే దీని ముద్రణను చేపట్టగలనని మనవి. మీ ఆదృతికి ధన్యవాదాలు! _/\_!

  రిప్లయితొలగించండి
 6. సుకవిమిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధర రావు మహోదయులకు నమోవాకములు..._/|\_...! ఏదియో నాకు తోచిన అంశమును సూచించితిని. ఇంతమాత్రమునకే తమరి యాదరణమునకు పాత్రుడనగుట నా యదృష్టము! ధన్యవాదములు!

  రిప్లయితొలగించండి