19, నవంబర్ 2014, బుధవారం

నిషిద్ధాక్షరి - 20

కవిమిత్రులారా,
అంశం- శిశుపాల వధ
నిషిద్ధాక్షరములు - శ, ష, స.
ఛందస్సు - తేటగీతి.

28 కామెంట్‌లు:

  1. నూరు తప్పుల వరకునేనూరుకొంటి
    చేదిరాజుకు మరియింక లేదుదిక్కు
    హతము చేయంగ నెంచితిననుచు చక్రి
    చక్రమును తా వదలనరి చంపెనతని(వదలన్+అరి

    రిప్లయితొలగించండి
  2. ఊ రుకొంటిని దప్పుల నూఱు వరకు
    హతము జేతును నిప్పుడే యతని నింక
    ననుచు గృ ష్ణుడా చేదివి భునియ మపురి
    కంపె జక్రాన దేవతల్ హాహ యనిరి

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    శిశుపాల వధ :

    01)
    ________________________________

    అగ్ర పూజకు నచ్యుతు - డర్హు డైన
    కాడు కాడని తిట్టెడి - కఱటి తలను
    నూరు తప్పుల పిదపనే - వేరు పరచె
    అత్త కిచ్చిన మాటకై - యఙ్ఞపతియె !
    ________________________________

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా !
    లు- నిషిద్ధము కాదు గదా
    కానప్పుడు - దానిని వ్రాయనవసరమే లేదు !
    ఒకవేళ నిషిద్ధమైనచో
    లు- తప్ప మిగిలిన ల-గుణింతము వాడ వచ్చునా ?
    వాడ వచ్చు ననిన
    అది మిగిలిన అక్షరములకు గూడా వర్తించును గదా !
    వర్తించిన యెడల
    శి-శు-అనునవి నిషిద్ధము లోనికి రావుగదా ?
    ఇలా
    అనంతమైన సందేహములు
    ఆ --లు--వలన

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    అక్కడ ఉన్న లు బహువచన ప్రత్యయం మాత్రమే. శ,ష,స అను అక్షరములు అని. అక్కడ లకార నిషిద్ధం లేదు. శ,ష,స అంటే వాటి గుణింతాలు, సంశ్లేషలు అన్నీ నిషిద్ధాలే.
    ఎందుకైనా మంచిదని ‘లు’ తొలగిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యం చివర ఉన్న ‘అతని’ అన్నది అన్వయించడం లేదు. ‘అరిఁ జంపె నపుడు’ అంటే సరి!
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. అగ్ర పూజకు బావ యనర్హు డనుచు
    మేనబావను దూలగ మేను మరచె
    వంద తప్పుల వరకును వదిలి పెట్టి
    చక్ర మప్పుడు వదిలెను చక్రి తాను
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  8. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీగురుభ్యోనమ:

    అగ్ర తాంబూల మందిన యచ్యుతునకు
    నూరు బాధలు గలిగించి దూరు చుండ
    చక్రి కినుకున విడువగ చక్ర మంత
    దంతవక్త్రుని యనుజుని తలను ద్రెంపె

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నాల్గు జేతుల ముక్కంట నతడు బుట్టె
    మామ కొడుకుయొ డినికీడు మాయ మయ్యె
    అత్త కిచ్చిన మాటకు ఆన తిచ్చి
    నూరు నేరముల్ మన్నించె నోర్పు యుంచి
    చక్ర మొదిలి తలను గూల్చె చక్రి యపుడు

    రిప్లయితొలగించండి
  12. అత్తయె కోరగ నిచ్చితి
    నత్తరి నే నొక వరమ్ము, నది దాటెనుగా
    ఇత్తరి తప్పుల బావకు
    కుత్తుక నేనుత్తరింతు కోపము హెచ్చెన్.

    రిప్లయితొలగించండి
  13. అత్తకిచ్చినట్టి వరము లధిగతమయె
    చేటు మూడెనీ కిప్పుడు ఛేది రాజ
    యంచు విడిచెను చక్రము నచ్యుతుండు
    చచ్చె నాఖలు డప్పుడు చక్ర హతిని

    రిప్లయితొలగించండి
  14. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. వంద తప్పులు నోర్తునన్ వచన మిచ్చె
    రాజ యజ్ఞమున్ పేలగ రద్దు మాట
    అగ్ర హమ్ము నణచలేక యచ్చుతుండు
    తగ్గు మనచు చక్రము వీడి తలను తెంచె

    రిప్లయితొలగించండి
  16. మంచికి చెడుకును భేదము
    లెంచగ తెలియని ఫలమును, వృద్ధుల పలుకుల్
    కించపఱచు ఫలమోయనఁ
    ద్రుంచె తలనొకని మురారి త్రుళ్ళకుమనుచున్.

    రిప్లయితొలగించండి
  17. అగ్ర తాంబూలమున కర్హు డతడు కాడు
    పెట్ట వలదని దుర్మతి ప్రేలుచుండ
    నూరు తప్పులు మన్నించి క్రూరవరుని
    చేది రాజును హతమార్చె యాదవుండు.

    రిప్లయితొలగించండి
  18. అగ్ర పూజకు తగడంచు నడ్డుకొనెడి
    చేది రాజుని జూడగా చీదరగొని
    నూరు తప్పులు నేటితో తీరెననుచు
    చక్రమును బట్టి వధియించె చక్రధారి

    రిప్లయితొలగించండి
  19. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పద్యానికి కొన్ని మెరుగులు....
    వంద తప్పుల నోర్తునన్ వచన మిచ్చె
    రాజ యజ్ఞమునన్ మీరరాదు మాట
    అగ్ర హమ్ము నణచలేక యచ్యుతుండు
    తగ్గు మనుచు చక్రము వీడి తలను త్రెంచె.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘చేదిరాజును’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    యజ్ఞమందున తొలి పూజ యదుకులునికి
    నీయ తగడంచు చైద్యుడు నిందలిడెను
    నూరు మారులు గాచి తా నుత్తరి౦చె
    చక్రియాతని కంఠమ్ము చక్రధార

    రిప్లయితొలగించండి

  21. కె.ఎస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ.
    ఆ రమాదేవి రుక్మిణిన్ గోర నేల,
    నూరు మారులు యదు పాలు దూరనేల,
    చ౦డతర చక్ర కీలలన్ చావనేల?
    దుర్మతి పతన మొందు చైద్యుని విధాన.

    రిప్లయితొలగించండి

  22. కె.ఈశ్వరప్పగారి పూరణ

    అత్తమాటను కన్నయ్య చిత్తగించి
    నూరు తప్పులు గాచెను నోరు జార
    చూచు చుండగ రాజులు చోద్యముగను
    చక్రి చక్రాన ద్రు౦చెను చైద్యు నంత

    రిప్లయితొలగించండి
  23. దైవమ్మెదురుగ బన్నము
    గావించగ చేది రాజు కంఠము ద్రెంచెన్!
    గావరము కళ్లు మూయగ
    నేవర మైన మితిమీర నంతము జూచున్!

    రిప్లయితొలగించండి
  24. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. అత్తమామల కిచ్చిన హామి వలన
    నూరు నేరముల వరకు నూరకుండి
    వంద మీరగానే నందనందనుండు
    చేది రాజును చంపెను చీత్కరించి!

    రిప్లయితొలగించండి
  26. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. జన్నమంతము నందున విన్నవించె
    వెన్ను పూజింప కురుపెద్ద, వేగమపుడు
    చైద్యుడెలమిని నిందింప,చనియె నూరు
    తప్పులంచును హరి వాని తలను గొట్టె

    కన్నయ హరిగ నెరిగియు గౌరవించి
    నింద వద్దను గాంగేయు నియతి దప్పి
    నింద చేయంగ చైద్యుని నీచ వచన
    ములకు కోపించి తెగటార్చె మూర్ఖు,హరియె

    జ్ఞాన మందున పెద్దయౌ జ్ఞాని యనియు
    విక్రమంబున మురవైరి పెద్ద, గోపు
    డనుచు,పలికిన గాంగేయు,నటుల నింద
    లాడ,నూటొక్క తప్పుకు హరియు చెనకె

    గర్వి యౌచును కొలువున కారుకూత
    కూయు చైద్యుని వచనాల క్రోధమంది
    హరియు నప్పుడు చక్రాన హారి యగుచు
    చంపె యుద్ధాన దుర్మార్గు చలము మీఱ

    చిన్న యైనట్టి పాండవు చెలువమొప్పు
    పలుకు కందరు జోహార్లు పలికినంత
    చైద్యు డయ్యెడ ననికినై చాపమెత్త
    చంపె చక్రాన హరితాను చయ్యనపుడు

    రిప్లయితొలగించండి
  28. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి