9, నవంబర్ 2014, ఆదివారం

న్యస్తాక్షరి - 14 (రా-మా-రా-వు)

అంశం- రావణుని పాత్రలో ఎన్.టి.రామారావు.

ఛందస్సు- ఆటవెలఁది.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా ‘రా - మా - రా - వు’ ఉండాలి.

34 కామెంట్‌లు:

 1. కవిమిత్రులందఱకు నమస్కారములు!

  రావణుండు యన్‍టి రాముండు నటనతో
  మా మనమ్ములందు మహితుఁ డాయె!
  రాముఁడైన నతఁడె! రావణుం డతఁడె! భా
  వుకుఁ డెవం డతనినిఁ బోలువాఁడు?

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  శంకరార్యా !
  రామారావు గురించి ఆటవెలది లోనా ?
  ప్చ్
  ఏం చెప్పగలం ?

  ఆంధ్రుల హృదయాధినేత - అన్నగారు :

  01)
  __________________________

  రాజు పేద దొంగ - రారాజు వలె తాను
  మాయ జూపి జనుల - మనము నిలచె !
  రామ, భీమ, కర్ణ, - రావణ, కృష్ణ, దే
  వునిగ నిలచి ప్రజల - పూజలందె !
  __________________________
  దేవుడు(ఈశ్వర,వెంకటేశ్వర యిత్యాది దేవతమూర్తులు)

  రిప్లయితొలగించండి
 3. రావణుండు పాత్ర రాణించె గతనన
  మామ నస్సు లందు మహితు డాయె
  రాము డైన గాని రావణు డైన భా
  వుకులు నతని నెవరు బోల లేరు

  రిప్లయితొలగించండి
 4. రాజ రాజు కర్ణ రావణ బ్రహ్మగా
  మాయ కృష్ణు డల్లె మహిని వెలిగె
  రామచంద్రుడిగను రాజిల్లెనిల గొలు
  వుండె తాను ప్రజల గుండె లందు


  రిప్లయితొలగించండి
 5. రాముడైన నీవె రావణాఖ్యుడవీవె
  మాధవుండవీవె మంత్రివీవె
  రాజు వేష మందు రారాజు నీవె, కా
  వున మనమున నిలచి పోతివయ్య!

  రిప్లయితొలగించండి
 6. రామ కృస్ణుల రూపమ్ము రావణుండు
  మాకు నఛ్ఛెసుయోధన మహిత నటన
  రారు నీబోటి నటు లెంటిరాముడ పద
  వులును గోరక నినుజేరె పుణ్యమూర్తి.

  రిప్లయితొలగించండి
 7. రావ హావ భావ రంజకమ్ముగ నిల
  మాన్యుల మది దోచు ధన్య జీవి
  రావణాసురుండె రాముని మించు లా
  వు నగుపడడె నీదు ఘనత తోడ!

  రిప్లయితొలగించండి
 8. రావణాసురుడయి రాజిల్లె ఎంటియార్
  మారు లేరు వేష ధారనమున
  రాజు చిత్ర సీమ రంగాధ్యు డతడు లే
  వతడు వేయ నట్టి పాత్ర లేవి.

  రిప్లయితొలగించండి
 9. రాక్షసుండు కూడా రాముడై కనుపించు
  మాలవేయ మనకు మనసు కలుగు
  రావణునిగ యెన్ టి రాముని గన చాల
  వు మన కనులు - నటన పొగడ తరమె

  రిప్లయితొలగించండి
 10. మల్లెలవారి పూరణలు
  రావణు౦డనుచునురమణీయ నటనతో
  మార్పు జూపె నతడు మహిని శాంత
  రాముడ౦చు వెల్గె రమ్యమౌ రామరా
  వు సినిమాల కీర్తి పొందెనతడు
  2.రాముడైనగాని రావణు డయిన తా
  మార్చ్గి హావ భావ మంద జేసి
  రాజరాజు గాను రాజిల్లె రామరా
  వు నటరత్న మౌచు పుడమి వెల్గె.
  3.రావణుండు అయ్యె రమ్య భూ కైలాస
  మాన్య సీత రామ మహిత చిత్ర
  రాజమందు తానె రాజిత రామరా
  వునకు ముఖ్య మంత్రి పొలుపు నయ్యె

  రిప్లయితొలగించండి
 11. రావణాసురు పాత్రలో రాశి కెక్కె
  మారు యంటియార్ కెవ్వరు లేరు నేడు

  రాజ్య మేలెను చలన చిత్రమునును గల
  వతడు వేసిన బహు పాత్ర లమరుడతడు

  రిప్లయితొలగించండి

 12. డా.మాడుగుల అనిల్ కుమార్

  రావణాసురుండు ప్రత్యక్షమౌ గాదె
  మాన్యుడతడు. పాత్ర మహిఁ ధరింప
  రామరావు నటన ప్రణవమ్ము నటులు సర్
  వులకు, ప్రేక్షకులకు భూరి ఫలము.

  ఇక్కడ మాన్యుడు అనేది రామారావుకు అన్వయము.

  రిప్లయితొలగించండి

 13. డా.మాడుగుల అనిల్ కుమార్

  రామ! నందమూరి రామరావునఁ జూచి
  మాన్యుని నిను జనులు మై మరచిరి.
  రావణాసురుగని బ్రహ్మవంశజుని, శి
  వునికి భక్తుడంచు తనరుచుంద్రు.

  రిప్లయితొలగించండి
 14. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణ
  రామ పాత్ర లోన రాణించి తిరిగి యే
  మార్చి రావణునిగ మసలుచు నవు
  రా విచిత్రమౌగ ఆవిగ్రహమును దే
  వు డెటుల సృజియింప బూనె ధరణి

  రిప్లయితొలగించండి
 15. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
  రామ,కృష్ణ పాత్రలందున రాజిల్లి
  మార్పు కోరి జ౦గమయ్య గొల్చు
  రావణాసురునిగరక్తి గట్టి౦చినా
  వు."నటరత్న"బిరుదు పొందినావు

  రిప్లయితొలగించండి
 16. రాశి పోసి నట్టి రమణీయ రూపాన
  మాన ధనుడన నసమాన రీతి
  రావణాసురుండు, రారాజు లన్న నీ
  వు విన నితరుల నెటు నూహఁ జేతు!

  రిప్లయితొలగించండి
 17. కె.ఈశ్వరప్ప గారిపూరణ
  రామరావుగారి రావణపాత్రలు
  మార్గ దర్శకములు మహి నటులకు
  రావుగాక రావు రావణు కైన భా
  వుకతను మలచ తరమ కలనైన

  రిప్లయితొలగించండి
 18. (2)
  రావణుండ శివుఁడ రాముఁడ కర్ణుఁడ
  మాధవుండ భీష్మ మఱియుఁ గృష్ణ
  రాయఁడవన నీవెరా! నటరత్నుఁడ
  వు గదర! ఘనుఁడవగు ముఖ్యమంత్రి!!

  రిప్లయితొలగించండి
 19. రాము లోరి పాత్ర రావణ పాత్రయున్
  మారు వేష పాత్ర మంత్రి పాత్ర
  రాజ రాజు పాత్ర రాజసముగ, మాధ
  వునిగ మరపు రాని మనిషి పాత్ర
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 20. గుండు మధుసూదన్ గారికి నమస్కారం ! మీ రెండవ పూరణ 4 వ పాదం లో వు కి ము కి యతి మైత్రి చేశారు . అది కరెక్ట్ యేనా? నేను చదివినంత వరకు పు ఫు బు భు ము లకి మాత్రమె యతి చెల్లుతుంది. సందేహం తీర్చ గలరు

  రిప్లయితొలగించండి
 21. మిత్రులందఱి పూరణము లలరించుచున్నవి...

  వసంతకిశోర్‍గారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  ***
  పోచిరాజు సుబ్బారావుగారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  ...రాణించె గతనన...అన్నదానిని...రాణించు కతనన...అన్నచో నెటులుండును?
  ***
  బి.ఎస్.ఎస్.ప్రసాద్‍గారూ,
  మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణము:
  నాల్గవపాదమున...
  ...యెవరు కలరు నిను బోలువారు?...అను దానిని...
  ...కలరెవరు నిన్ను బోలువారు?...అనిన నెటులుండును?
  రెండవపూరణము:
  చిన్నచిన్న టైపాటులు దొరలినవి. సవరింపుఁడు.
  నాలుఁగవపాదమున..."వూరువాడ" ప్రయోగమున..."వూరు" వకారాదిగ నున్నది. తెనుఁగున యకార, వకారాది పదములు లేవు. దీనిని సవరింపవలసియున్నది.
  ...కృష్ణుఁడ/వుచునె వెలిఁగె నతఁడు పుడమి పైన..యని సవరించిన నెటులుండును?
  ***
  శైలజగారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  రెండవపాదమున...
  ...కృష్ణుడల్లె...అనుదానిని...కృష్ణునివలె...యనియు
  మూఁడవపాదమున...
  రామచంద్రుడిగను...అనుదానిని...రామచంద్రునిగను...అనియును సవరింపఁగలరు.
  ***
  బొడ్డు శంకరయ్యగారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  ***
  గోలి హనుమచ్ఛాస్త్రిగారూ,
  మీ తేటగీతి పూరణము బాగున్నది. అభినందనలు.
  కాని, శంకరయ్యగారు కోరినది యాటవెలఁది కదా!
  గుండా సహదేవుఁడుగారు...
  "గోలివారు ఆటలాడకుండ తేటబడ్డారు"అని నర్మగర్భముగఁ దెలిపియున్నారు. గమనించితిరా?
  ***
  గుండా వేంకట సుబ్బ సహదేవుఁడుగారూ,
  మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
  ***
  గండూరి లక్ష్మీనారాయణగారూ,
  మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణమున..
  చిన్నచిన్న టైపాటులు దొఱలినవి సవరింపఁగలరు.
  రెండవపూరణము నాటవెలఁదికి బదులు తేటగీతిని వ్రాసితిరి.
  ***
  చంద్రమౌళి సూర్యనారాయణగారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  టైపాటులు సవరింపఁగలరు.
  ***
  మల్లెలవారూ,
  మీ మూఁడు పూరణములును బాగున్నవి. అభినందనలు.
  ***
  డా.మాడ్గుల అనిల్‍కుమార్‍గారూ,
  మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణమున...
  మహి..తరువాత నరసున్న యవసరములేదు.
  తృతీయపాదాంతమున...సర్/
  చతుర్థపాదాదిని...వులకు..అని వ్రాసితిరి. సర్వులకు...అనినచో న్యస్తాక్షర భంగమగును గావున నిట్లు వ్రాసితిరి. దీనిని...నటక జీ/వులకు...అనిన నెటులుండును?
  ***
  కే.ఎస్.గురుమూర్తి ఆచారిగారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  ***
  కెంబాయి తిమ్మాజీ రావుగారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  ***
  కె.ఈశ్వరప్పగారూ,
  మీ పూరణము బాగున్నది. అభినందనలు.
  ***
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. కవిమిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణగారూ,

  మీ సందేహము సరియైనదే! తెలిపినందులకు ధన్యవాదములు. నేను గమనింపకయే ’వు’కారమునకు ’ము’కారముతో యతివేసితిని. ఇది దోషమే. సవరించుచుంటిని...పరిశీలింపుఁడు.

  2)
  రావణుండ శివుఁడ రాముఁడ కర్ణుఁడ
  మాధవుండ భీష్మ మఱియుఁ గృష్ణ
  రాయఁడవన నీవెరా! నటరత్నుఁడ
  వు గదె! ముఖ్యమంత్రివి గదె నీవు!

  రిప్లయితొలగించండి
 23. కె.ఈశ్వరప్ప గారి పూరణ
  రావణుడి నటనల భావన భాగ్యాలు
  మాయబోవు జనుల మనసు నందు
  రాజ్యమేలె నటుడు రాడని రామరా
  వు నట సార్వభౌము డనుట కద్దు

  రిప్లయితొలగించండి
 24. మధుసూదన్ గారూ ధన్యవాదములు. సహదేవుడు గారూ ! మధుసూదన్ గారి వ్యాఖ్య చూసే వరకూ..మీ నర్మ గర్భ వ్యాఖ్యను గమనించలేదు..నిజంగానే ఆటలాడ మన్నారని గమనించక తేట బడ్డాను..

  రిప్లయితొలగించండి
 25. ఇదిగోండీ..ఆటవెలది....

  రామ, కృష్ణ తోడ రావణాసుర పాత్ర
  మాకు నఛ్ఛె చూడ మహిత నటన
  రారు ముందు గూడ రారులే రామరా
  వునకు సాటి నటులు మనము జూడ

  రిప్లయితొలగించండి
 26. పూజ్యులు మిత్రులు మధుసూదన్ గారి సూజచనలకు కృతజ్ఞతలు . మర్చి తిరిగి ప్రచురించడమైనది

  1. రామ భీమ కృష్ణ రావణ పాత్రలు
  మారు మారు జూపి మర్మ మెరిగి
  రాజు వైతివి కద రాతయే యుండనీ
  వు కలరెవరు నిన్ను బోలు వారు ?

  2. రాకుమారుడైన రావణడైనను
  మారులేడు ఎవడు మాటునైన
  రామ భీమ కర్ణ రావణ కృష్ణడ
  వుచునె వెలిగె నతడు పుడమి పైన

  రిప్లయితొలగించండి
 27. డా.మాడుగుల అనిల్ కుమార్

  శ్రీ శంకరయ్య గారూ! అనేక నమస్కారాలు.తెలియని విషయాన్ని మృదువుగా తెలియజేశారు. ధన్యవాదాలు. మీ సవరణ బాగున్నది. అలాగే సరిజేస్తున్నాను.

  రావణాసురుండు ప్రత్యక్షమౌ గాదె
  మాన్యుడతడు పాత్ర మహి ధరింప
  రామరావు నటన ప్రణవమ్ము నటక జీ
  వులకు, ప్రేక్షకులకు భూరి ఫలము.

  రిప్లయితొలగించండి
 28. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

  రాజకీయమందు రారాజుగ నిలిచి
  మాకు నేతగాను మంచి జేసి
  రామచంద్రుడివలె ప్రజల మనసున నీ
  వు నిలిచితివి పుణ్య పురుషుడిగను

  రిప్లయితొలగించండి
 29. కవిమిత్రులకు నమస్కృతులు...
  భద్రాచలం, పాపికొండల యాత్ర ముగించుకొని తిరిగివచ్చాను.
  నిన్నటి సమస్యకు మంచి పూరణలను అందించిన కవిమిత్రులు....
  గుండు మధుసూదన్ గారికి,
  వసంత కిశోర్ గారికి,
  సుబ్బారావు గారికి,
  శైలజ గారికి,
  బొడ్డు శంకరయ్య గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
  గండూరి లక్ష్మినారాయణ గారికి,
  చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
  మల్లెల సోమనాథ శాస్త్రి గారికి,
  డా. మాడుగుల అనిల్ కుమార్ గారికి,
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారికి,
  కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
  కె. ఈశ్వరప్ప గారికి,
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారికి,
  బి.యస్.యస్. ప్రసాద్ గారికి,
  కుసుమ సుదర్శన్ గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  నా అనుపస్థితిలో మిత్రుల పూరణల గుణదోషాలను విశ్లేషించి, సవరణలు సూచించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 30. రావణాసురునిగ రంజిల్ల జేసితా
  మాన్యులమది గెల్చి మహిని వెల్గె
  రాడు మరల భువిని రాడింక రామ రా
  వునకు సాటి నటుడు తెనుఁగు సీమ

  రిప్లయితొలగించండి
 31. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి