5, నవంబర్ 2014, బుధవారం

దత్తపది - 52 (అసి-కసి-నుసి-మసి)

కవిమిత్రులారా!
అసి - కసి - నుసి - మసి
పైపదాలను ఉపయోగిస్తూ కార్తిక పూర్ణిమను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. అసితవర్ణు మరిదినని హంగుజూప
    క సిరికి తమ్ముడననుచు నధికమవ్వ
    నంది వాహను సిగ పువ్వు నాదియనుచు
    ధవళ ధూమ సిక్తేందుడు తరలి వచ్చె!!

    రిప్లయితొలగించండి
  2. అసిత పక్షముడిగె ,యద్భుతమిక సిత
    వర్ణమెల్లయెడల వ్యాప్తిచెందు
    నుసిరి దీపకాంతి యుడుబింబకాంతియు
    మసిని తుడిచివేయు మహిని నాడు.

    రిప్లయితొలగించండి
  3. అసిత మంత తొలగ ను సితము గలుగంగ
    నావ రించి న మసి పోవు కతన
    కార్తికమున వచ్చు పూర్ణిమ దినమున
    కసిగ వెలిగె దీప కాంతు లచట

    రిప్లయితొలగించండి
  4. విద్యుత్ సౌధలో ఎగ్జెక్యూటివ్ ఇంజనీరుగా చేసి రిటైరయిన వి. సాంబశివ రావు గారు " తెలుగు భాగవతము. ఒ.ఆత్.జి లో టీకా తాత్పర్యాలతో సహా భాగవతాన్ని పొందుపరచారు. భాగవతాన్ని చదవాలనుకొనే నాలాంటి క్రొత్తవారికి ఉపయొగం గా ఉంటుందని కవిమిత్రులకు తెలియజేయటమైనది.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ రెడ్డి గారూ, ఆ భాగవతం కాపీ దొరికేచోటు, వెల, పబ్లిషరు మిగతా వివరాలు తెలియజేయగలరా?

    రిప్లయితొలగించండి
  6. sir,
    you may kindly visit "telugubhagavatam.org where you can read directly through computer.I did speak to Sri. U. Sambasiva Rao. He said that there is no hard copy. His phone number is 9959613690. He told me that he know our guruvugaru kandi Sankarayya garu.

    రిప్లయితొలగించండి
  7. అసిత మంతయు శుద్ధమై యద్భుతముగ
    నుసిమి వెన్నెల సోనల మిసిమి తోడ
    కసిగ వెలుగులు వెదజల్లి కార్తికమున
    మసిని మాయమ్ము జేయునా మారుమామ

    రిప్లయితొలగించండి
  8. జిగురు సత్యనారాయణ గారూ,
    ధూమసిక్తేందుని గురుంచిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పక్ష ముడిగె నద్భుత...’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    నేమాని వారు స్వర్గస్థులైనప్పటినుండి నేదునూరి రాజేశ్వరి అక్కయ్య బ్లాగుకు దూరమయ్యారు. వారి సమాచారం ఏమీ తెలియదు. మీరేమైనా కనుక్కొని చెప్పగలరా? వారి న్యూజెర్సీలో ఉంటారనుకుంటాను.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. మల్లెలవారిపూరణలు
    1.అసితము తొలగును జ్వాలన్
    నుసి యై తోరణము మండు నోములు చేయన్
    కసిగొని దీపములిడగను
    మసియగు పూర్ణిమ వెలుగుల మానిత నఘముల్
    2.కసిగొను దీపకా౦తులకు కాళ్ళకు బుద్ధిని జెప్పెజీకటుల్
    నుసిగను మారినన్ మరుడు నొవ్వగజేసెను కామబాధలన్
    మసియవ గోర్కెలవ్వియును మండెడి జ్వాలలతోరణమ్ములన్
    అసితము తొల్గి విజ్ఞతవియబ్బును కార్తిక పూర్ణకాంతులన్

    రిప్లయితొలగించండి
  10. పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
    చంద్రిక సిగలోన జడను సిద్ధనదియు
    మసి నుదుటను బూసి మసలు శివుని
    అసి నియమము వోలె నర్చింప కార్తీక
    పూర్ణిమాసి వచ్చె ముక్తి నిడగ

    రిప్లయితొలగించండి
  11. కల్గెను సితుని శిష్యుని కతన హాని
    యంచు చింతించు సురలను గాంచియసిత
    వదనుడై శూలి కసితోడ పల్కె నప్డు
    మసిసలిపెద తారకు మూడు మందిరముల
    నసురు తోడ మూడవ కంటి యగ్ని శిఖల
    సితుడు : శుక్రుడు

    రిప్లయితొలగించండి
  12. గురువుగారు,
    సరేనండి. ధన్యవాదాలు.
    అసిత పక్షముడిగె ,నద్భుతమిక సిత
    వర్ణమెల్లయెడల వ్యాప్తిచెందు
    నుసిరి దీపకాంతి యుడుబింబకాంతియు
    మసిని తుడిచివేయు మహిని నాడు.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
    కె.ఈశ్వరప్ప గారి పూరణలు
    అసితుడు కనబడ డెక్కడ
    కసిమాన్పగశివుని భక్తి కమనీయంబౌ
    నుసి నుదుట నిడ మనసులో
    మసి జేరదు కార్తికమున మ౦గళ ప్రదమౌ
    2.అసితులు నంతరంగమున ఆరతి పళ్ళెము గాగ చంద్రుడే
    నుసిరిక చెట్ల నీడ మన మూహలనూయలలూప నెంచగా
    మసియగు మానసాన యనుమానముదీరునుదీపకా౦తు లే
    కసియను చీకటుల్ దులుపు కార్తిక పౌర్ణమి లోక మంతటన్

    రిప్లయితొలగించండి
  14. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. ‘నుసిగను మారినన్ మరుడు నొవ్వగజేసెను కామబాధలన్’ అనడం చాలా బాగుంది. అభినందనలు.
    ‘విజ్ఞతయె యబ్బును’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జడను సిద్ధ నదియు’... అర్థం కాలేదు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు గురుదేవులు శ౦కరయ్య గారికి వందనములు
    జడను సిద్ధనదియు అనగా జటా జూటము లో గంగానది
    యని నాభావము
    తిమ్మాజీరావు

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ:

    సమసిపోయెను మేఘపు సంబరమ్ము
    వికసితమ్మయ్యె చేమంతి విరులు జేల
    యసిత జీకటి తొలగె నా యాకసమున
    నుసిరి కాయల దీపముల్ దెసలు బ్ర్రాక
    వెలుగు రేఖలు భువిపైన విస్తరించె
    కార్తికమ్మున వెన్నెల గగనమందు
    తారలన్నియు రెట్టించి తళుకు లీన
    రాజు చిరునవ్వు నవ్వె తా రాజసమున

    రిప్లయితొలగించండి
  17. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    వివరణకు ధన్యవాదాలు. నేను ‘జడను సిద్ధన్ + అదియు’ అన్న పదవిభాగం చేసికొని తికమక పడ్డాను. మన్నించండి.
    ****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అసిత జీకటి’ దుష్టసమాసం కదా... ‘అసిత తమము తొలంగె నా యాకసమున’ అనండి.

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    అసియాడు మేఘములఁ గని
    కసిమసఁగుచుఁ జంద్రుఁ డెలమిఁ గార్తికమునఁ దా
    ను సిగపువయి హరుని దయను
    మసిచేసెను జీఁకటులను మహిఁ బౌర్ణమినిన్!

    రిప్లయితొలగించండి
  19. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అసిత పక్షపు చీకటి కుసురుఁ దీయ
    మెరుగు కార్తీక పున్నమ సిరులుఁ జాల
    కసిని బెంచగ జనులకు వసుధ పైన
    దీప శిఖలను సిత్రాల దీర్తు రోయి!

    రిప్లయితొలగించండి
  21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. అసితమును పోగొట్టగ నాడువారు
    వికసితపరచి ప్రమిదలు వేడ్కతోడ
    ప్రమద మొందిరి తమిరము సమసిపోగ
    ను సిరులనిడు పున్నమనుచునోముజేసి

    రిప్లయితొలగించండి
  23. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం. ‘పో నడంపగ/ పోఁ దొలంగగ’ అనండి.

    రిప్లయితొలగించండి
  24. గురుదేవులకు నమస్కారములు, సవరణతో..

    అసితమును పోఁ దొలంగగ నాడువారు
    వికసితపరచి ప్రమిదలు వేడ్కతోడ
    ప్రమద మొందిరి తమిరము సమసిపోగ
    ను సిరులనిడు పున్నమనుచునోముజేసి.

    రిప్లయితొలగించండి