14, నవంబర్ 2014, శుక్రవారం

సమస్యా పూరణం - 1548 (బాలల దినోత్సవము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
 బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క.

30 కామెంట్‌లు:

  1. ఫ్యాన్సి దుస్తులు ధరియించు స్పర్ధలందు
    పిల్లల గెలుపునాశించి వేచియున్న
    తల్లిదండ్రుల చూచినంతననిపించు
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  2. పండుగ వలెను జరిపెను బాలు రార్య!
    బాలల దినోత్సవము,పెద్ద వారి వేడ్క
    జరుపు టి య్యది ఘనముగ సంతు కొఱకు
    బాల బాలిక లిరువురి పండు గౌట

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    బాలల దినోత్సవము - వేడుక కలిగించేది పెద్దవారికే :

    01)
    ______________________________

    బాలు రందరు గుమికూడి - పాఠశాల
    తీపి వస్తువులవి యెన్నొ - తినెడి వేళ
    వివిధ చిత్ర విచిత్రమౌ - వేషములను
    వేసి బహుమతు లందెడి - వేళ గాన
    చూచి పరవశ మందగ - చుట్టు జేరు
    "బాలల దినోత్సవము" పెద్ద - వారి వేడ్క !
    ______________________________

    రిప్లయితొలగించండి
  4. బాల సాహిత్యమును దెల్పు బంధు వనగ
    ఆట పాటలు జరిపించు నాత్మ బంధు
    బాల హక్కుల గాపాడు బంధువుయును
    బాలల దినోత్సవము పెద్ద వారి వేడ్క
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  5. శ్రీ మంతుడైనట్టి చిరునవ్వు చిందించు
    శ్రీ జవహరులాలు శ్రీల నొసగె
    భారతావని చుట్టు బంగారు కడియము
    వేయించ గల తండ్రి వీరి తండ్రి
    మాత స్వరూపమ్మ మహితాత్ము రాలిగా
    మణి రూప మీతని మనకు నొసగ
    బాలలే లొకమై భారత రత్నయై
    విశ్వ శాంతికి తాను వేదికయ్యే
    శాంతి సాధన జేసిన దాంతి యతడు
    ప్రజల స్వామ్యము దెలిపిన ప్రజల జీవి
    పంచ వర్షపు పథకాలు పంచినాడు
    పండిత నెహురు మాన్యుడు మండి తుండు
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  6. బాలబాలికలకు దారి పరగ జూపు
    పగిది పెద్దలు నడతనుఁ బడయవలయు.
    పేరుకొక్క రీతిగ- నాటవిడుపు లనగ-
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘జరిపిరి బాలు రార్య’ అనండి.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. గురువ లున్ బాల లొకచోట గూడి నేడు
    పండి తనెహురు పటముపై దండ నుంచి
    పాట పాడిబాలలకునో మాట పలుక
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  9. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మురిపె ముగ మాటలాడుతు ముద్దు లెట్టి
    ఆట లాడించి స్వీట్లను ఆరగించి
    తమ సెలవను తాము గడప తరలెదరుగ
    బాలల దినోత్సవము,పెద్ద వారి వేడ్క!

    డా.కృష్ణ సుబ్బారావు పొన్నాడ .

    రిప్లయితొలగించండి
  11. నిన్నటి నిసిద్ధాక్షరి :
    అన్నదమ్ముల యన్యోన్య మెన్న దగిన
    దంపతుల బంధ మేమని! తలువ దగిన
    జనుల సేమమ్ము నేలిక చందమనగ
    జానకీ పతి కావ్యమ్ముఁ జదువ వలయు!

    అనుచరగణంబు నధినాయకు ననుసరించి
    సవినయంపు నివాలికై సాగు చుండ
    జవహరుని జన్మదినమని జాతి నెరుగు
    బాబాలల దినోత్సవము పెద్ద వారి వేడ్కగా!

    రిప్లయితొలగించండి
  12. జవహరుని జన్మ దినమున జరుపు చుంద్రు
    బాలల దినోత్సవము, పెద్ద వారి వేడ్క
    పిల్లలకు వేసి నాయక వేషములను
    ముఖ్య నేతలను స్మరించి మురియు దినము

    రిప్లయితొలగించండి
  13. మల్లెలవారి పూరణ
    బాలలందరు చాచాను బందువనుచు
    నెంచి జన్మదినమ్మును నేర్పు మీర
    ఆట పాటల నాడంగ నౌను గాదె
    బాలల దినోత్సవ మది పెద్దవారి వేడ్క
    2.నాటిబాలలనైనట్టి నేటి పెద్ద
    వారు తమ బాల లెల్లరు వాని జన్మ
    దినము సలుపంగ నాటల తేలి యాడ
    బాలల దినోత్సవ మది పెద్దవారి వేడ్క
    3.తొలిగ నైన ప్రధానిగ దొడ్డ ప్రేమ
    బాల లందున గులాబి పావురాల
    శాంతి దూతైన యాతని జన్మదినము
    బాలల దినోత్సవ మది పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  14. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    తెలి చిరునగవుల వెలుంగు వెలువరించు
    వెలయు మురిపాల రతనాలు తులుకరించు
    పలుకు తేనియ చినుకులుచిలుకరించు
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములు
    జవహర్లాలు నెహ్రూని జన్మదినము
    బాలలు,గులాబు లతనికి ప్రాణ మనగ
    ఆనవాయితి జరుగును యతనిపేర
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క
    2.భరత దేశ ప్రగతికై బాలలొకరె
    భావిభాగ్య విధాతలౌ వరములనుచు
    బాలలకుగూర్చసువిధముల్ వాని పేర
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  16. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

    జాతి నేత నెహ్రూ గారి జన్మ దినము
    బాలల దినముగా వేడ్క బడుల లోన
    ఆట పాటల నాడించి హాయి గాను
    జరుపు చున్నట్టి ఆహ్లాద సభల జూడ
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క.

    రిప్లయితొలగించండి
  17. కె.ఈశ్వరప్ప గారి పూరణలు
    1.బాల లె౦చగ దేవుళ్ళు,పరవశాన
    ఆటపాటల మూలమై నలరుచుంద్రు
    కనులవిందుగ,దేశమే కలలుపంచ
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క
    2.కాలగతులెన్నిమారినా మూలమైన
    బాలబాలిక లిల లోన భవిత యనుచు
    నెహ్రు గుర్తించి ఆనాడు నెంచి నట్టి
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  18. టైపాటు సవరణతో :
    నిన్నటి నిసిద్ధాక్షరి :
    అన్నదమ్ముల యన్యోన్య మెన్న దగిన
    దంపతుల బంధ మేమని! తలువ దగిన
    జనుల సేమమ్ము నేలిక చందమనగ
    జానకీ పతి కావ్యమ్ముఁ జదువ వలయు!

    అనుచరగణంబు నధినాయకు ననుసరించి
    సవినయంపు నివాలికై సాగు చుండ
    జవహరుని జన్మదినమని జాతి నెరుగు
    బాలల దినోత్సవము పెద్ద వారి వేడ్క!

    రిప్లయితొలగించండి
  19. డా. కృష్ణ సుబ్బారావు పొన్నాడ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మాటలాడుతు, ముద్దు లెట్టి’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘స్వీట్లను + ఆరగించి’ అన్నప్పుడు సంధి నిత్యం. అక్కడ (అక్కడే కాదు, పద్యంలో ఎక్కడా) విసంధిగా వ్రాయకూడదు. ‘మాటలాడుచు, ముద్దు లొసగి, స్వీటుల నారగించి’ అనండి.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ నిన్నటి, నేటి పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘అధినాయకు’ అన్నచోట గణభంగం. ‘అధినేత’ అనండి.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘దినోత్సవము’ను ‘దినోత్సవ మది’ అని టైపు చెయ్యడంతో గణదోషం.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ మొదటిపాదంలో గణదోషం. ‘జవహరుం డాత డా నెహ్రు జన్మదినము’ అందామా? ‘జరుగును + అతని’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. అక్కడ ‘జరిపెద రతనిపేర’ అనండి.
    ****
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మూలమై యలరుచుంద్రు. మారినన్ మూలమైన...’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. కవిమిత్రులందఱకు బాలల దినోత్సవ శుభాకాంక్షలతో...


    పిల్ల లందఱిలోన నా బిడ్డఁ డొకఁడె
    వెలిఁగిపోవంగ వలెనని ప్రీతితోడఁ
    గాంచెదరు తల్లిదండ్రులు! కాన, నగును
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క!!

    రిప్లయితొలగించండి
  21. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. పూజ్యులు గురుదేవులుశంకరయ్య గారికి వందనములుతా
    తమరి సూచనలతో సవరించిన పద్యమలు
    బాలల దినోత్సవము
    జవహరుండాతడా నెహ్రు జన్మదినము
    బాలలు,గులాబు లతనికి ప్రాణ మనగ
    ఆనవాయితి జరిపెద రతనిపేర
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క
    2.భరత దేశ ప్రగతికై బాలలొకరె
    భావిభాగ్య విధాతలౌ వరములనుచు
    బాలలకు గూర్చసువిధముల్ వాని పేర
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  23. తల్లి దండ్రులు గురువులు దారి జూపి
    భావి బారత పౌరులన్ పాటిగొనగ
    నెహ్రు కన్నట్టి స్వప్నాలు నిజము జేయ
    బాలల దినోత్సవము పెద్ద వారి వేడ్క

    రిప్లయితొలగించండి
  24. శ్రీగురుభ్యోనమ:

    పలు విధమ్ముల యాటల పాటలాడి
    ఘనతరంబగు బహుమతుల్ గొనెడు వేళ
    ముదము గాంచగ పిల్లల మోములందు
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  25. బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క
    మేర జరిపింప, బాలలు మిగుల గొప్ప
    శోభ నింపుచు నెహ్రూను స్ఫూర్తి నంది,
    జవహరువలె వెల్గగలరు జగతి నిండ

    రిప్లయితొలగించండి
  26. పాఠశాలలలో నేడు పర్వదినము
    బాలబాలికలకతి సంబరపు దినము
    నెహ్రు పుట్టిన రోజిది నిర్మలాత్మ
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క

    రిప్లయితొలగించండి
  27. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    అనుచర గణంబు నధినేత ననుసరించి
    సవినయంపు నివాలికై సాగుచుండ
    జవహరుని జన్మదినమని జాతి నెరుగు
    బాలల దినోత్సవము పెద్ద వారి వేడ్క!

    రిప్లయితొలగించండి
  29. జవహరుని జన్మదినమని సంతసమున
    నెర్రని గులాబి నెదపైన నిష్టపడుచు
    పెట్టుకొని వేషమును గట్టి పిల్లలుండ
    బాలల దినోత్సవము పెద్దవారి వేడ్క!

    రిప్లయితొలగించండి
  30. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి