16, నవంబర్ 2014, ఆదివారం

పద్యరచన - 737

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

22 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పాత పుస్తకముల యంగడి :

    01)
    ___________________________

    మేలి పుస్తకము లిచట - వేలు దొరకు
    సరసమైన ధరల కవి - చక్కగాను
    కొన్ని యపురూప గ్రంథములు - గూడ దొరకు
    దారి వెంబడి యంగడి - దడిమి జూడ
    పేద విద్యార్థులకు పెద్ద - పెన్నిధిదియె !
    ___________________________

    రిప్లయితొలగించండి
  2. అవ్వా నీవీ వయసున
    నెవ్వరి యాశ్రయములేక నేకాకివిగా
    నివ్వీధిలోననమ్ముట
    యివ్విధముగ పత్రికలను నివ్వెరపరచున్

    రిప్లయితొలగించండి
  3. అవ్వ యచ్చట కూర్చుండి యమ్ము చుండె
    పాత ,క్రొత్తవి యైనట్టి పలుర కముల
    పుస్త కంబులు పేపర్లు పొలతు లార !
    రండు కొనగను మానుచు దిండి యైన

    రిప్లయితొలగించండి
  4. బిచ్చమెత్త తప్పుయనుచు గుచ్చి జెప్ప
    ముద్దు మోమున చిరునవ్వు ముసలి తల్లి
    వీధి ప్రక్కపుస్తకముల విందు బెట్ట
    కొలది నయిన దయను జూపి కొనగ రారె ?

    రిప్లయితొలగించండి
  5. ముదిమి వయసున జానెడు పొట్టకొరకు
    విక్రయించుచు పత్రికల్ వినయముగను
    రెక్కలే తనకు సతము దిక్కటంచు
    సలుపు చుండె జీవనమును సంతసముగ

    రిప్లయితొలగించండి
  6. హస్తములొణికొడి వయసున
    పుస్తకముల నమ్ముచున్న ముదుసలి గనరే!
    మస్తకమున తెలివి గలిగి
    పస్తుల నుండక బ్రతికెడు బామ్మకు జేజే!!!

    రిప్లయితొలగించండి
  7. వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    కాని అది పాతపుస్తకముల అంగడి కాదు. తాజా దిన వార మాస పత్రికలు అమ్మే అంగడి.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘హస్తములు వణుకు వయసున...’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. అమ్ముచున్నవి పుస్తకమ్ములనవ్వ యొక్కతి, నవ్వులన్
    కుమ్మరించుచు బోసినోటిని, కోటి తిప్పలు కూటికై
    యమ్మనిట్టుల నీ వయస్సున నామెపుత్రుడు పంపెనో,
    నమ్ము, కష్టముకాదటంచు తనంత తానయి వచ్చెనో?

    రిప్లయితొలగించండి
  9. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    `అమ్ముచున్నది' అని ఉండాలనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ ధన్యవాదములు.

    బోసి నవ్వులు నవ్వుచు పుస్తకముల
    నమ్ము చున్నది ముదుసలి యవ్వ తాను
    బ్రతుకు తెరువాయె బాధ్యతల్ భారమాయె
    కాయ కష్టమ్మె వరమౌగ కలిమి కలుగె

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు, నిజమే.
    పదాలను మార్చి కూర్చుకుంటునప్పుడు చివరకు మరొక్కసారి చదువుకోకపోవడం తీవ్రనిర్లక్ష్యానికి నిదర్శనమే.
    మన్నించండి ఇకమీదట జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  12. ఎనుబది యేండ్లు నిండినవి యెందుకు కష్టము ఫూటుపాతుపై
    ననుదిన మిట్టులన్ జనుల కమ్ముచు నుంటివి వార్త పత్రికల్
    తనయులు బుక్కెడన్నమును తల్లికి బెట్టని వారలుందురే !
    జననము నిచ్చి రాగమున సాకిన త్యాగికి వృద్ద మాతకున్.

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. ముడతలు పడినది కాయము
    కుడుచుటగడపంగ నమ్మఁగూర్చిన పొత్తాల్
    ముడతలు పడ్డది ఖాయము
    బడయుము తగ్గింపు ధరకె,బ్రతికెద దయతో!

    రిప్లయితొలగించండి
  15. పుత్రులు లేకనో మరియు పుత్రిక లెవ్వరు చెంతలేకనో
    సత్రమునందుభుక్తికయి సాయము గోరక కష్టమొందుచున్
    చిత్రముగా ప్రయత్నమును జేయుచు నున్నది కాలిబాటపై
    పత్రిక లమ్ముచున్ ముసలి బామ్మ శ్రమించుచు పొట్టకూటికై



    రిప్లయితొలగించండి
  16. కొవ్వెక్కిన లోకంలో
    బువ్వకు కరవై నరకపుముచ్చట్లమ్మే
    అవ్వా! ఈ కాటిని నీ
    నవ్వొక్కటి మిగిలె జగతి నడిపించంగా !

    రిప్లయితొలగించండి
  17. రెండవ పాదం టైపాటు సవరణతో :
    ముడతలు పడినది కాయము
    కుడుచుటగడవంగ నమ్మఁగూర్చిన పొత్తాల్
    ముడతలు పడ్డది ఖాయము
    బడయుము తగ్గింపు ధరకె, బ్రతికెద దయతో!

    రిప్లయితొలగించండి
  18. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    ఆదిత్య గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. నమ్మక మీ యమ్మ కమున
    నమ్మెను తన రెక్క డొక్క నల c కువ వీడన్,
    నమ్మక మీ నవ్వు ముఖము
    సమ్మోహన మంది మనము సమ్మానమిడన్
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  20. అమ్మగ మెలిగిననీవే
    అమ్మగ నీ పొత్తములనె యరుదెంచితివా !
    ఇమ్ముగ నినుజూచుటకై
    ఇమ్మహిలో నెవరులేర యిది దారుణమే !

    రిప్లయితొలగించండి
  21. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. ఎవ్వారు నిన్ను జూడగ
    నవ్వా దరిజేర్చలేద నాకటి కొరకై
    అవ్వవ్వా ! పొత్తములను
    నవ్వుచునే యమ్ముచున్న నారీ ! జే ! జే !

    రిప్లయితొలగించండి