చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** జిగురు సత్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, మీ పద్యం (+పూరణ) బాగున్నది. అభినందనలు.
పొదుగు నందించె పిల్లకు పొట్టిమేక వెదకు చుండెను పసిపాప పొదుగు కొరకు అమ్మ పాలను గ్రోలంగ అమిత శక్తి సృష్టి చిత్రము జూడుము ద్రష్ట యగుచు కొరుప్రోలు రాధా కృష్ణ రావు
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** శైలజ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** తాడిగడప శ్యామలరావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నీ పాలన్నీ నీ దూ
రిప్లయితొలగించండిడే పూర్తిగ కుడువ నేమిడెదవే మేకా
యీపూట పాలు లేవా
యీపాపడికనచు చూచెనిబ్బాలుండే
మేక పొదుగు చేపి మేకపి ల్ల యచట
రిప్లయితొలగించండిపాలు ద్రాగు చుండ బాలు డొకడు
తొంగి చూచు చుండె వంగి వంగి మిగుల
చిత్ర మదియ చూడ చిత్ర మాయె
అన్నంబది లేదు తినగ
రిప్లయితొలగించండిమన్నున పడియుంటి నేను మార్గము లేకన్
నిన్నే నమ్మితి నేనిక
చన్నొక్కటి నాకు వదులు చాలును మేకా!!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
ఆ పిల్లాడి పేరు భీష్ముడనుకుంటే :
01)
_____________________________
పిల్లదె ఛాగికి, పాలను
మెల్లగ తా త్రాగుచుండ - మెలకువ నెరుగన్
విల్లుగ వంగియు నేలకు
పిల్లన్ గ్రీకంటఁ గనుచు ♦ భీష్ముఁడు మురిసెన్ !
_____________________________
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పద్యం (+పూరణ) బాగున్నది. అభినందనలు.
తల్లి పాలు త్రాగ తల్ల డిల్లును బిడ్డ
రిప్లయితొలగించండిపురిటి లోన వలదు పోత పాలు
అమ్మ రొమ్ము పాల కమ్మ తనము మించి
విశ్వ మందు లేదు వినుర వేమ
మేమే ఆకటి కేడ్చిన
రిప్లయితొలగించండిఏమ్మా యనియమ్మ పాల నెత్తుకొనిచ్చున్
'మేమేమేమే' పిల్లను
ఈ మేకే యెత్తుకొనదిదేంజేస్తుందో !
మిగిలిన అందరి పూరణలు చదివిన తరువాత నా పూరణ తేలిపోతోందనిపిస్తూంది - అయినా పూరిస్తున్నాను
రిప్లయితొలగించండిచెదరకుండేను నాఆశ జీవి తమున
ఎదురు చూచుచుంటినినేను ఎపుడొ నాకు
సదవ కాశమ్ము పాల్దాగు సమయ మొచ్చు
కదల కుండాయిటనెవేచి కాను చుందు
అమ్మ పాలను గొనుచుండ నజము పిల్ల
రిప్లయితొలగించండికాంచుచుండెను బాలుడు కరము తుష్టి
నమ్మ గుర్తుకు వచ్చెనా? యర్భకునకు
చూపరులకు దృశ్యము కడు సొంపు గూర్చె.
పాలందు మేక పిల్లా!
రిప్లయితొలగించండియేలా నీ కందుఁ దృప్తి నిట్లా త్రాగన్!
నాలాగ నమ్మ యొడిలో
జోలల మురిపాలఁ బాల జుర్రగ లేవా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమేకయె పాలిచ్చుటగని
రిప్లయితొలగించండియాకలితో నున్నబాబు నాత్రము పడుచున్
నాకూ పాలియ్యమనుచు
యాకీలినిపైన వాలి యాక్రోశించెన్
సృష్టిలోపల సుందర దృశ్యమేది
రిప్లయితొలగించండితల్లి కడజేరి పాలను త్రాగుశిశువు
చన్ను విడువని శిశువుల కన్నులకును
నెన్న నధ్బుతమై యది చెన్నుమీఱు
పొదుగు నందించె పిల్లకు పొట్టిమేక
రిప్లయితొలగించండివెదకు చుండెను పసిపాప పొదుగు కొరకు
అమ్మ పాలను గ్రోలంగ అమిత శక్తి
సృష్టి చిత్రము జూడుము ద్రష్ట యగుచు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
శ్రీనివాస భరద్వాజ కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
తాడిగడప శ్యామలరావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
శ్రీగురుభ్యోనమ:
రిప్లయితొలగించండితల్లి దరికి జేరి తల్లడిల్లుచు పిల్ల
పాలు త్రాగు చుండ,పాప తాను
ప్రాకి ప్రాకి వచ్చి పరవశంబున గాంచె
నమ్మ దనము లోని కమ్మదనము.