11, నవంబర్ 2014, మంగళవారం

పద్యరచన - 732

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

20 కామెంట్‌లు:

  1. పుల్లైసును మించినదీ
    ముల్లోకములందులేదు పోడిమి రుచితో
    జిల్లను మన తనువంతయు
    చల్లని యామంచుముక్క జక్కగ చీకన్

    రిప్లయితొలగించండి
  2. ఐసు ఫ్రూ టు లు గలవార్య ! హాహ యచట
    యెంత బాగుగ నున్నవో నంత చేటు
    గలుగ జేయును నిజమిది కనుక నెవరు
    చీక రాదవి కవివర ! చీక వలదు

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    మధుర మైనట్టి యనుభూతి - యైస్ఫ్రూటు :

    01)
    ___________________________

    చల్ల నైనట్టి యైస్ఫ్రూటు - జారకుండ
    చిన్నతనమున చేతితో - చీకు నపుడు
    నోరు చేతులు చల్లగా - మారి నపుడు
    చెప్ప లేనట్టి పరవశ - మెప్పుడైన
    తలచు కొన్నంత మనసును - తొలిచి వేయు
    మధుర మైనట్టి యనుభూతి - మరువ దరమె ?
    ___________________________

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. సూర్యనారాయణ గారూ ! మీరు మొదటి వరుసలోనే " ఐస్ ఫ్రూట్ " ను ఆస్వాదించారు.ఈ మధ్య మొదటి బెంచీ లోనే ఉంటున్నారు. అభినందనలు.
    సుబ్బారావు గారూ ! కిశోర్జీ ! చల్లని పద్యములు వ్రాసారు.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. ఇల్లిదె పాలను చక్కెర
    మెల్లగ మరికొంత జేర్చి మెచ్చెడు రంగున్
    జల్లుచు ఫ్రీజింగ్ జేసిన
    పుల్లను మరి గ్రుచ్చి , యైసు ఫ్రూటగు గదరా !

    రిప్లయితొలగించండి
  7. పిల్లలకిష్టము తినగా
    మెల్లగ మరి పెద్దవారు మెచ్చుచు దినుగా
    చల్లని ఐస్ ఫ్రూట్ నోటను
    పుల్లను చేబట్టి చీక పులకింతలెగా !

    రిప్లయితొలగించండి
  8. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ రెండు పద్యలు బాగున్నవి. అభినందనలు.
    ‘మరిగి నంచు గోర’... అర్థం కాలేదు. ‘పరుగు పెట్టు’ అని అన్నారు కనుక ‘బడుగు జనము’ అనండి.
    ‘చూడ చక్కనై యుండును’ అనండి.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మిత్రుల పూరణలను అభినందించినందుకు ధన్యవాదాలు.
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘పుల్లను మఱి గ్రుచ్చ..’ అంటే అన్వయం కుదురుతుందేమో?

    రిప్లయితొలగించండి
  9. పీల్చ పుల్ల నయిసు ప్రియముతో మెల్లగ
    కిలము మురికి నీటి కీటకములు
    కలుపు జేరి యందు కడుపును చెరచును
    కలల నైన వలదు కాటు యెరిగి

    రిప్లయితొలగించండి
  10. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. కృతజ్ఞతలు శంకరయ్య గారూ - మీ సలహాలనుంచి మార్చి నాను
    1. రంగు రంగు మంచు రసమును పీల్చగ
    నాల్క తీపి యెరిగి నాక గోర
    పల్లె లనియె లేదు పట్టణముల గూడ
    పరుగు బెట్టు కొనగ బడుగు జనము
    2. చూడ చక్కనై యుండును చల్ల గాను
    కీడు జేయునిది మురికి క్రిములు చేరి
    వాడ కూడని రంగులు వగలు కొరకు
    విలువ లేనితీపి కలుప వీలు గాను

    రిప్లయితొలగించండి
  12. పుల్లైసును గనినంతనె
    పిల్లల నెవరాపగలరు పెద్దల నైనన్!
    వెల్లివిరిసి శైశవమే
    చల్లగ నైస్ఫ్రూటు తినరె సంతోషముతో!!!

    రిప్లయితొలగించండి
  13. పాలను మాన్పగ నెంచిన
    శైలజ తన పుత్రు లలర చక్కెర గలిపెన్
    గైలాస మంచుఁ జీకగఁ!
    కాలానుగుణంపు పుల్ల కలరైసదియే!

    రిప్లయితొలగించండి
  14. పుల్లకు గ్రుచ్చిన రుచియగు
    చల్ల బడిన పాలు, రంగు సమకూర్చినదై
    మెల్లగ గళమున దిగగా
    నుల్లము లుల్లసమునాడె నొకనాఁడిలనున్.

    రిప్లయితొలగించండి
  15. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

    పుల్లై స్ప్రూటును జూసిన

    పిల్లలు పెద్దలకు జిహ్వ విక్షోభితమై

    ఉల్లాసమురక లెత్తగ

    చల్లని ఐస్ప్రూటు చీకి సంతస మొందున్.

    రిప్లయితొలగించండి
  16. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మాస్టరు గారూ !
    ఫ్రీజ్ చేయకముందు పుల్లను గ్రుచ్చుతారని అలా వ్రాశాను..అయినా మీరు చేసివ సవరణ కూడా అన్వయమునకు ఇంకా బాగా కుదిరింది..ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. ప్రూటు గాదు ఐసు ప్రూటు యిద్ది కనుడు
    పిల్ల లందరు గొను పుల్ల ఐసు
    చిన్న తనమునందు తిన్న ఐసులఁ దల్చి
    మదిన నేడు చాల ముదము గల్గె

    రిప్లయితొలగించండి
  19. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మదిని’ అనండి.

    రిప్లయితొలగించండి
  20. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! తప్పనిసరి అయి ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నాను. అర్ధరాత్రి నిద్రమత్తులో ఒక్కోసారి రెండుపాదాలు ఆటవెలది రెండు పాదాలు తేటగీతి కూడా వ్రాసాను

    రిప్లయితొలగించండి