29, నవంబర్ 2014, శనివారం

పద్యరచన - 750

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. పచ్చని పైర్లను జూడగ
    నచ్చము మాకోనసీమ యా ?యని పించెన్
    పచ్చని కొబ్బరి చెట్టులు
    లచ్చనముగ వరుస నుండి లాభము లిచ్చున్

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    పచ్చని పల్లెపట్టులే దేశానికి కాదు ప్రపంచానికే ప్రాణాధారము :

    ____________________________

    పచ్చ పచ్చని పైరుల - బలజ మందు
    చల్లచల్లని గాలులె - స్వచ్ఛముగను
    మెల్ల మెల్లగవీయగ - నుల్ల మెగయు
    పల్లె పల్లెలు కొల్లగ - నుల్ల సిల్ల
    హరితదేశము గా మారు - భరత భూమి !
    ____________________________
    బలజము = పొలము

    రిప్లయితొలగించండి
  3. పుడమి పచ్చతివాచీని, నడువమనుచు
    ప్రకృతి కన్నియ కోసమై పరచెనేమొ
    వృక్ష రాజములెన్నియో వేచియుండె
    స్వాగతమ్మీయ సుంతైన సద్దులేక.

    రిప్లయితొలగించండి
  4. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. పచ్చ వన్నెయె నెటుజూడ పల్లె లిపుడు
    కరుణ జూపించి నాధుండు కాపు లిచ్చి
    రైతు గుండెను మురిపించు రాశి బోయ
    లోక మంతయు వర్ధిల్లు లోటు లేక

    రిప్లయితొలగించండి
  6. బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. సంక్రాంతి రాబోతుందని...
    పొంగలి నైవేద్యము వరి
    వంగడం మీయంగ మురిసె భక్తి ప్రపత్తిన్!
    వంగి కరమోడ్చె కొబ్బరి
    సింగారపు సంకు రాత్రి శ్రీలకు మ్రొక్కన్!

    రిప్లయితొలగించండి
  8. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో ఒక సున్నా అదనంగా టైపయింది.

    రిప్లయితొలగించండి
  9. వరుస లందున నాటిన వరిపొలమ్ము
    గట్ల పైనున్న పచ్చని చెట్ల తోడ
    పరవశింపగఁ జేయును పయరగాలి
    యున్నతమగు పల్లెల సొంపునెన్న తరమె?

    రిప్లయితొలగించండి
  10. పచ్చ చీరను గట్టిన పడతి వోలె
    ప్రకృతి కాంతయె హేలగా పరిఢవిల్లె
    చామరములైన వచ్చోట చంకురములె
    సేద దీర్చుచు నుండెను శ్రీకరముగ !!!

    ముచ్చట గొలిపే తరువుల
    కచ్చితమగు పైరగాలి గలగల వినుచున్
    పచ్చని పైరులు గాంచగ
    నచ్చని వారెవ్వరుండు నరలోకమునన్!!!

    రిప్లయితొలగించండి
  11. గురుదేవులకు ధన్యవాదాలు. టైపాటు ను సవరించిన పద్యం :
    పొంగలి నైవేద్యము వరి
    వంగడమీయంగ మురిసె భక్తి ప్రపత్తిన్!
    వంగి కరమోడ్చె కొబ్బరి
    సింగారపు సంకు రాత్రి శ్రీలకు మ్రొక్కన్!

    రిప్లయితొలగించండి
  12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ****
    శైలజ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కల్లనేర్వని పల్లెసీమలు కంఠ హారము లౌనిలన్
    చల్ల గాలులు పంటభూములు స్వచ్చమైవెలు గొందుగా
    నెల్ల మానవు లెల్ల ప్రాణులు నివ్వటిల్లు సజీవమై
    యుల్లమందున మెల్లనేవియొ యూహలే యిట రేగెడిన్

    రిప్లయితొలగించండి
  14. పంట చేలలో వరిపైరు పచ్చదనము
    చేల గట్లపై నిలిచిన చెట్ల వరుస
    చూడ చక్కని దృశ్యంబు సుమ్మ! తనరు
    పల్లె వాతావరణమింత స్వచ్చముగను

    రిప్లయితొలగించండి
  15. ఏనాటికైన జలముల
    నా నాటన్ పొలములెల్ల నవనవలాడం
    గా నదులను నింపగదే,
    శ్రీ నాథా! వేడెద జలసిరినిడవయ్యా!

    నాటన్= నాడు యందున

    రిప్లయితొలగించండి
  16. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి