18, నవంబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1550 (దురితములకుఁ గారకుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

39 కామెంట్‌లు:

  1. మురియుచు బొమ్మల మాదిరి
    నరులను సృజియించి వారినాడించు తనే
    మరియా బొమ్మలు చేసెడి
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  2. అరయగ నా శనియే గద
    దురితములకు గారకుడు, చతుర్ముఖుడు గదా
    ధరగ లుగు జీవ కోటిని
    నిరవుగ సృ జియించు నతడు నెక్కా లమునన్

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    చతుర్ముఖుడనే వాడిని పోలీసులు పట్టుకుంటే ,
    అనేకమంది అమ్మాయిలను మానభంగం చేసి
    చంపిన సీరియల్ హంతకుడు వీడేనా అని
    పోలీసులకు విలేఖరుల ప్రశ్న :

    01)
    _______________________________

    శరణన్నను, దారుణముగ
    తరుణులనే సంగమించి ♦ దానవ సముడై
    శిరముల ఖండించిన పలు
    దురితములకుఁ గారకుఁడు చ ♦ తుర్ముఖుఁడు గదా ?
    _______________________________

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    పరని౦దయు,నాత్మస్తుతి
    పరి పాలన ముసుగులోన స్వార్ధముతో దు
    ర్భర రాజకీయ ముఖముల
    దురితములకు గారకుడు చతుర్ముఖుడు గదా

    రిప్లయితొలగించండి
  5. "నాలుగు ముఖముల కల్గిన సింహము ప్రభుత్వ చిహ్నము
    ప్రభుత్వాధికారులు, మంత్రులు ఈ గుర్తును దుర్వినియోగ పర్చిరి అన్న భావంతో"

    తర తరములుగా వారే
    నెర పదవులు వెలగబెట్టి నేతా గిరులన్
    పరి పరి విధముల దోచిరి
    దురిత ములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  6. తరతమ భేదములెంచక
    నిరతము జగము నడిపించు నిఖిలాత్ముడు స
    చ్చరితములకు, సకలములగు
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  7. గురి కుదురుచు పేకాటను
    సరి చరుతత నాడ నంటె జాడ్యములెన్నో
    మరి జెప్పలేను వాటిని
    దురిత ములకుఁ గారకుఁడు "చతుర్ముఖుఁడు" గదా !

    రిప్లయితొలగించండి
  8. నాలుగు ముఖముల కల్గిన రాజు బొమ్మ పేక మీద మూలాన్న పేకాటకు "చతుర్ముఖ" పారాయణం అనే వాడుక నుద్దేశించి

    పురమున పల్లెల జూదమె

    పరమప థమదియె దలంచి పగలును రాత్రుల్

    నెరముగ వ్యర్ధము కాదే

    దురిత ములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  9. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘నేతా గిరులన్’....?
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. రాక్షసులకు వరములిచ్చినందువలన బ్రహ్మయే ఈ కష్టాలకు కారణమనే అభిప్రాయముతో దేవేంద్రుఁడు...........

    తరతమబేధములెంచక
    వరములఁగురిపించె నేఁడుబలగర్వితదు
    స్తరదుర్వార మదాంధుల
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా.

    రిప్లయితొలగించండి
  11. కె యెస్ గురుమూర్తి ఆచారిగారిపూరణ

    విరచించి లలాటలిఖిని
    స్థిరపై ప్రాణులకు నెల్ల జీవసమరమున్
    పరికల్పించుచు దురితా
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా.

    రిప్లయితొలగించండి
  12. ధరలో బుట్టిన జనుల త
    లరాతలను వ్రాసి బ్రాహ్మి లయమున కులుకున్
    నరులు సతతమ్ము సలిపెడు
    దురితములకుకారకుఁడు చతుర్ముఖుఁ డు గదా!

    రిప్లయితొలగించండి
  13. ధర జన్మమెత్తువారల
    దురితములకు కారకుండు చతుర్ముఖుండు కదా
    జరుగును మరి నుదటను తా
    నరులకు లిఖియించి నటుల, నమ్ముదు రెల్లన్ .

    రిప్లయితొలగించండి
  14. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మరిపించుచు మురిపించుచు
    నరిపించుచు నరులతోడ నాడుతు నెపుడున్
    కరియుచు జనులొన రించెడు
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుడు గదా!!!


    ధరలో మరబొమ్మలుగా
    నరులను బుట్టించు టేల? నాటక మాడన్
    పొరబడి వ్రాసిన రాతల
    దురితములకు గారకుఁడు చతుర్ముఖుడు గదా!!!

    రిప్లయితొలగించండి
  17. శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘ఆడుచు’ అనండి. ‘కరియుచు’ అన్నారు. అది ‘కరచుచు’ అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  18. నేతా గిరి (చెలాయించడం ) మన్నది ఉత్తరాంధ్ర ప్రాంతం లో వాడతారు

    రిప్లయితొలగించండి
  19. ప్రసాద్ గారూ,
    ధన్యవాదాలు.
    ‘నేతాగిరి’ గురించి తెలుసు. మీరు నేతాగిరులు అని బహువచనంలో చెప్పేసరికి అర్థంకాలేదు.

    రిప్లయితొలగించండి
  20. మనుజులు గతజన్మలో చేసిన పాపములకు భగవంతుని దగ్గర ప్రాయశ్చితంగా మరు జన్మ ఏది అనుభవించ దలచారో తమరే ఒప్పుకుని
    పుడతారు.అదిమరచి ఈ జన్మ సంబంధిత దురితములకు చతుర్ముఖుని నిందించడం. పరనిందతో సమానమన్న భావంతో:

    ధరపై జేసిన బాపము
    మరువక మరు జన్మ కోరి మహిలో బుట్టన్
    పరనింద కాదె? యిటులన
    "దురితములకు కారకుఁడు చతుర్ముఖుడు గదా!"

    రిప్లయితొలగించండి
  21. కె ఈశ్వరప్ప గారిపూరణలు

    1.సరదాలకొక్కముఖమును
    విరివిగ లంచాల కొకటి వేడుక కొకటీ
    తరచుగ తప్పుల కొకటై
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా

    2.సిరిగల వానితొ జేరక
    పరమేశుని చెంతలేక ప్రతిభను ఇచ్చే
    కరుణామయి వాణి విడువ
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!


    రిప్లయితొలగించండి
  22. గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

    నరకాసురునుని బోలిన
    నరులను బుట్టించ వారు నడివీధులలో
    పరిపరి విధముల జేసెడి
    దురితములకు కారకుఁడు చతుర్ముఖుడు గదా!

    రిప్లయితొలగించండి
  23. మల్లెల వారి పూరణలు:

    1.దురితములే లేకుండగ
    నరకమదేదీ!నరకము నాకము తేడా
    కొరకై పుట్టించుచు నా
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
    2.ఎరుగడు మంచిని చెడ్డను
    పరగడు జూదపు వ్యసనము బాగుగ మునుగన్
    చిరనా పేకాట మరగి
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
    3.పరభామాసక్త పరులు
    సుర సేవనమున నిరతులు చోరులు మొదలౌ
    దురితాల్ జేయగ వ్రాయుట
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
    4.పెరిగెను జూదము నాటల
    వెరపెరుగక బద్ధమాడి పెద్దలు నౌటన్
    పెరిగే నరువులు పుట్టగ
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
    5.అరయగ పాపుల పుణ్యుల
    బిరబిర లోకాని కంపు వెదకజూడన్
    తెర వెనుక రచయితయి యా
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

    రిప్లయితొలగించండి
  24. సరగున పూర్వము జేసిన
    దురితము పుణ్యము నరసియు,దుష్టుల,వరులన్
    విరివిగ సృష్టించునుగా
    దురితములకు కారణము చతుర్ముఖుడు గదా!

    మరణము నందిన పిమ్మట
    మరలను జన్మింతురిలను,మర్మము నిదియే
    దురితుల పుణ్యుల జన్మకు
    దురితములకు గారణము చతుర్ముఖుడు గదా!

    అరయ జగన్నాటకమున
    వరసూత్రధరుడు నగుగద వాసవుడెలమిన్
    తెరవెనుక కధా రచనను
    దురితములకు కారణము చతుర్ముఖుడు గదా!

    తిరమగు సృష్టికి మూలము
    విరివిగ నెవరెవరి పాత్ర విపులము గాగా
    వరముగ వ్రాసెడివాడై
    దురితములకు కారణము చతుర్ముఖుడు కదా!

    రిప్లయితొలగించండి
  25. పరువుగ బ్రతికెడి మనుజుల
    జెరిచెడి వారలను సృష్టి జేసినవాఁడే
    అరి షడ్వర్గములిడి యా
    దురితములకుఁ గారకుడు చతుర్ముఖుడు గదా!

    రిప్లయితొలగించండి
  26. ధరలో తెలవిని గలిగిన
    నరాధములు బుట్టి ప్రకృతి నాశమొనర్చన్
    పరిపరి విధముల జేసెడు
    దురితములకుఁ గారకుడు చతుర్ముఖుడు గదా!

    రిప్లయితొలగించండి
  27. కవిమిత్రులకు నమస్కారములు!

    (హిరణ్యకశిపుని దుశ్చర్యలకు దుఃఖితులైన దేవతలు తమలోఁదాము మాటలాడుకొను సందర్భము)

    తిరమగు తపమును మెచ్చియు
    దురితములనుఁ గనకయే చతుర్ముఖుఁ డటులన్
    వరమిడఁ గశిపుఁడుఁ జెలఁగెను!
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!

    రిప్లయితొలగించండి
  28. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘ఒకటీ, ఇచ్చే’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘వానితొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.
    మొదటి పూరణలో ‘వేడ్క కొకటియున్’, రెండవ పూరణలో ‘సిరిగలవానిని జేరక..... ప్రతిభ నొసఁగు నా| కరుణామయి...’ అనండి.
    ****
    కుసుమ సుదర్శన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నరకాసురునిన్ బోలిన’ అనండి.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    కెంబాయి తిమ్మాజీ రావు గారి ద్వారా పంపినవి, మీరు నేరుగా పంపినవి అన్ని పూరణలు బాగున్నవి. అభినందనలు.
    కెంబాయి వారు పంపిన పూరణలలో చాలా దోషాలున్నవి. మీరు పంపిన పూరణలు నిర్దోషంగా ఉన్నాయి. రెండూ ఏకకవికర్తృత్వాలు కావేమో అన్న అనుమానం వస్తున్నది.
    ****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. మిత్రులు శంకరయ్యగారూ,

    నా పూరణమునుం గొంచెము మార్చి వ్రాసి, య్తీ దిగువఁ బ్రకటించితిని. గమనింపఁగలరు.

    (హిరణ్యకశిపుని దుశ్చర్యలకు దుఃఖితులైన దేవతలు తమలోఁదాము మాటలాడుకొను సందర్భము)

    "తిరమగు తపమును మెచ్చియు
    హిరణ్య కశిపునకు బ్రహ్మ హితమౌనటులన్
    వరమిడ, మన నిటుఁ జెఱచెను!
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"

    రిప్లయితొలగించండి
  30. గుండు మధుసూదన్ గారూ,
    సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. శ్రీగురుభ్యోనమ:

    కరిచర్మాంబరధారిని
    పరిహాసములాడినంత పరిహారముగా
    విరువగ బ్రహ్మకు శిరమును
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా.

    ఫరమేశ్వరునకు కలిగిన బ్రహ్మ హత్యా దోషమనే పాపములకు మూలము బ్రహ్మ అనే అర్థమున

    రిప్లయితొలగించండి
  32. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. శంకరయ్యగారికివందనములుమల్లెలవా రుపంపినపద్యములనే నేను వారి అభ్యర్ధనమేరకు పంపుచున్నాను వానిలో దోషములున్నచో వివరించవలెను
    "కెంబాయి వారు పంపిన పూరణలలో చాలా దోషాలున్నవి. మీరు పంపిన పూరణలు నిర్దోషంగా ఉన్నాయి. రెండూ ఏకకవికర్తృత్వాలు కావేమో అన్న అనుమానం వస్తున్నది".అనివ్యాఖ్యానించడము
    సమంజసము కాదు ఆ దోషాలను వివరిస్తారని
    ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  34. భాగవతములో గోవులను, గోపాలకులను బ్రహ్మ దాచినప్పుడు, పరమాత్మ కృష్ణుడు తనలో అనుకొనుట:

    కరిరాజ వరదు డంతట
    పరికించి తలచె "సరసిజభవుడే శిశులన్
    మఱుపెట్టె బరమెరుంగని
    దురిత ములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!"

    రిప్లయితొలగించండి
  35. మాజేటి సుమలత గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  36. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    నా వ్యాఖ్య మిమ్మల్ని బాధిస్తే మన్నించండి.
    మల్లెల వారి రెండవ పద్యంలో ‘చిరనా పేకాట మరిగి’ అన్నచోట చిరన్ + ఆ అని పదవిభాగం చేయాలా? ఇక్కడ చిరన్ అంటే ఎల్లప్పుడు అనే అర్థంలో వాడినట్టున్నారు. కాని చిరము అనడం సాధువు.
    నాల్గవ పద్యంలో ‘వెరపెరుగక బద్ధమాడి పెద్దలు నౌటన్’ అన్న పాదంలో ‘ఎరుగక + అబద్ధమాడి’ కవిగారి ఉద్దేశ్యం కావచ్చు. కాని అక్కడ సంధి లేదు. ‘ఔటన్’ సాధువు కాదు. అదే పద్యంలో ‘పెరిగేను’ అన్నది వ్యావహారికం.
    ఐదవ పద్యంలో ‘వెదకజూడన్’ అన్నచోట గణదోషం. బహుశా అది ‘వెదకగ జూడన్’ అన్నదాని టైపాటు కావచ్చు. ‘రచయిత + అయి’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  37. పరిపరి రేపులు జేయుచు
    హరి భజనలు జేయుమనెడు "యసరం బాపూ"
    మొరలిడి కోర్టున బలికెను:
    "దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!"

    రిప్లయితొలగించండి
  38. పరచుచు పంచెను జైలున
    మిరియాలను నూరుచుండి మిడిమేలమునన్
    కరచి చిదంబరమనియెను:
    దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

    రిప్లయితొలగించండి