22, నవంబర్ 2014, శనివారం

పద్యరచన - 743

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

14 కామెంట్‌లు:

 1. చదువుకొనుచుండె పాపయె
  వదలక తనుకూరలమ్ము పనిలోకూడన్
  చెదరని యా పట్టుదలయె
  కదిలించెను నామనమ్ము కన్నులుచెమరెన్

  రిప్లయితొలగించండి
 2. చిత్ర మందున నచ్చట చిన్న పిల్ల
  యానప మఱి యు బొప్పాయి నమ్మ నునిచి
  చేయు చుండెను లెక్కలు శీ ఘ్రముగను
  జదువు మీదన నామెకు శ్రద్ధ కనుక

  కూర లమ్ముచు నొకప్రక్క ,కూ డికలను
  జేయ జూడగా సంతస మాయె మనసు
  వంద నంబులు సేతును వంద లాది
  చిన్న దైనను నాపిల్ల చేత లకును

  రిప్లయితొలగించండి
 3. గురు తుల్యులు శంకరయ్య గార్కి నమస్సులు
  ఆట పాట లాడు వయసు అమ్మ నాన్న
  తోడు నుండి యిల్లు గడవ తోవ ప్రక్క
  కూ ర లమ్మగ ఈ అమ్మి కొట్టు బెట్ట
  చాటి జెప్పు నేతల శ్రద్ధ చదువు లందు

  రిప్లయితొలగించండి
 4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘కనులు చెమర్చెన్’ అనండి.
  ****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ****
  బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. కూరలమ్ముచు చినతల్లి కూటి కొఱకు
  వ్రాయుచున్నది శ్రద్ధగా పాఠములను
  చదువుతోడ సంపాదనఁ జలుపుచున్న
  చక్కనమ్మకు ఫలితమ్ము చిక్కుగాక

  రిప్లయితొలగించండి
 6. దారిన బోయెడు వారికి
  నీ రీతిగఁ గూర లమ్మ నేర్పాటిదియా?
  బేరాల మధ్య చదువుల
  సారమ్మును నేర్వ నెంచ జాణవె నీవున్!

  రిప్లయితొలగించండి
 7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. పల్లె లందు చూడ పిల్లగాళ్ల బతుకు
  కళ్లు చెదురు మనసు కలత బోవు
  అమ్మ కాలు బెట్ట ఆరుబయటనుంచి
  చదువు సాగు నెటుల కుదురు గాను

  రిప్లయితొలగించండి
 9. భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ****
  తనికెళ్ళ సుబ్రహ్మణ్యం గారూ,
  శంకరభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  మీ గేయకవిత బాగున్నది. అభినందనలు.
  మాత్రాగణాలపై పట్టు ఉన్న మీరు అభ్యాసం చేస్తే పద్యాలను కూడ సులభంగా వ్రాయగలరు. ప్రయత్నించండి.

  రిప్లయితొలగించండి
 10. కూరల నమ్ముచు బాలిక
  తీరుగ మరి చదువుచుండె తీరిక లేకన్
  సారంబిచ్చును చదువే
  కోరిన తీరమ్ము చేర్చు కోమలి నిన్నున్!!!

  రిప్లయితొలగించండి
 11. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. చదువు ' కొనుటకు ' స్తోమత సరిగ లేక
  కూరలమ్ముచు నా బాల కొనెను " బుక్సు "
  చదువు కునుచుండె తానుగా చక్కగాను
  కూరలమ్మిక చదువుగా ' కూరలమ్మి ' !

  రిప్లయితొలగించండి
 13. గురుపవు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

  పొట్ట కూటికి కష్టాలు నెట్టుకుంటు
  చదువు పైగల మక్కువ వదలలేక
  కూరగాయలను పరచి దారి ప్రక్క
  అమ్ము చుండెను బాలిక అలుపు లేక

  రిప్లయితొలగించండి