చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ, మీ పద్యం బాగుంది. అభినందనలు. ‘తిరిగెడు’ అనండి. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నాటి బాల చంద్రుని కధ నకలు కొట్టి చెంగు చెంగున గెంతుచు చిలిపి గాను బొంగరమ్ములు త్రిప్పుచు బోటు గాళ్ళు వీధి లో నాడ చూడమే వింత గాను (పిల్ల మనసును దోచగ ప్రియము కాదె)
బి.యస్.యస్. ప్రసాద్ గారూ, మీ పద్యం బాగున్నది. అభినందనలు. **** జిలేబీ గారూ, మీ భావానికి పద్యరూపం..... చేత బొంగరమ్ముఁ జేర్చి త్రాడును చుట్టి వదలిన నది తిర్గు వర్తులముగ చేత బ్లాగుఁ బట్టి చిత్రాలఁ బెట్టి వదల వెల్గు నవియె పద్యములుగ.
జాటీని చుట్టి వీధిని
రిప్లయితొలగించండిపోటీకై సిద్ధపడుచు బొంగరములతో
చాటుగ బయటకు పరుగిడి
యాటలనాడితిమియెంత యానందముతో
(బొంగరాలు తిప్పడానికి వాడే త్రాడుని జాటీ అంటారు)
బొంగరము జుట్టు ద్రాటిని
రిప్లయితొలగించండిరింగులవలె చుట్టు ద్రిప్పి రేరే యనుచున్
భంగిమల నొలక బోయుచు
ఖంగను నటు నేల వదల గబగబ దిరుగున్
గిర గిర తిరిగే బొంగర
రిప్లయితొలగించండిసరమును బిగియించి వారు సాగుచు నుండన్ ,
పరిపరి విధముల ఆటలు
వరములు ఆనాడుజూడ వర్ధిలె వసుధన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు
బొంగరము గట్టి త్రాడును
రిప్లయితొలగించండిగింగిరములు దిరుగునట్లు కేలను విసరన్
రింగులుగ దిరుగు నేలను
ఛెంగున ద్రిప్పగ గలమర చేతను గూడన్.
చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘తిరిగెడు’ అనండి.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
నాటి బాల చంద్రుని కధ నకలు కొట్టి
రిప్లయితొలగించండిచెంగు చెంగున గెంతుచు చిలిపి గాను
బొంగరమ్ములు త్రిప్పుచు బోటు గాళ్ళు
వీధి లో నాడ చూడమే వింత గాను
(పిల్ల మనసును దోచగ ప్రియము కాదె)
రిప్లయితొలగించండిచేత బొంగరము బట్టి తాడు చుట్టి
సర్రున వదిలిన గుండ్రము గా తిరుగును
చేత బ్లాగు బట్టి పులు ఫోటోలు బెట్టి
సర్రున వదిలిన పద్యములై ప్రకాశించును !!
శుభోదయం
జిలేబి
అల్లరి విడి గోలీలును
రిప్లయితొలగించండిపుల్లలఁ బేర్చుట కబడ్డి బొంగరపాటల్
పిల్లలునాడుచునుండుట
నుల్లాసముఁ బెంచుననుట యొప్పేను సుమా!
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
****
జిలేబీ గారూ,
మీ భావానికి పద్యరూపం.....
చేత బొంగరమ్ముఁ జేర్చి త్రాడును చుట్టి
వదలిన నది తిర్గు వర్తులముగ
చేత బ్లాగుఁ బట్టి చిత్రాలఁ బెట్టి
వదల వెల్గు నవియె పద్యములుగ.
లక్ష్మీదేవి గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గట్టి తాడు నెంచి చుట్టున మెలిపెట్టి
రిప్లయితొలగించండిగట్టి చోటు చూసి కొట్ట నేల
చూడ చక్క గాను చుట్టులు పెట్టుచు
బొమ్మ రమ్ము తిరుగు దిమ్మ దిరగ (లదర )
బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
బొంగరాన్ని బొమ్మరమని అంటారని నాకు తెలియదు.
బొంగరము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
రిప్లయితొలగించండిA top, బొమ్మరము.
http://www.andhrabharati.com/dictionary/
గురువులు మన్నించాలి . మిగతా వార్కి ఈ సందేహం రావచ్చుననే ఉద్దేశ్యం తో లింక్ ఇవ్వడ మైనది.
రిప్లయితొలగించండివేరే లా భావింప రాదని మనవి .
ప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
బొంగరమునకు దారము
రిప్లయితొలగించండినుంగరము విధముగ చుట్టి యుత్సేకమునన్
గింగిర్లు దిరుగునట్టుల
ముంగిట్లో ద్రిప్పు చుండ మోదము గలుగున్!
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
గిర గిర తిరిగెడు బొంగర
రిప్లయితొలగించండిసరమును బిగియించి వారు సాగుచు నుండన్ ,
పరిపరి విధముల ఆటలు
వరములు ఆనాడుజూడ వర్ధిలె వసుధన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావు20/11/14
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం బాగున్నది. అభినందనలు.
సంగ డీల తోన కలసి సంత సముగ హాయిగా
రిప్లయితొలగించండిబొంగ రములు తిప్పు కొనెడి బుడుత లేరి మేదినిన్
గింగ రములు దిరుగు నటుల ఖేల లాడి నందరున్
పొంగి పోవు పసిడి వయసు పొలుచు దారి లేదుగా!!!
శైలజ గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.
బిర్ర్రుగ జుట్టుచు తాడును
రిప్లయితొలగించండిసర్రున బొంగరము విసర చక్కగ దిరుగ
న్నెర్రగ కమిలిన గాయము
చిర్రెత్తించగ మరువను చిన్న తనంబున్!