చంద్రమౌళి సూర్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** వసంత కిశోర్ గారూ, మీ పూరణ, కొసరు పద్యము రెండూ బాగున్నవి. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** లక్ష్మీదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. శీఘ్రమే - సీఘ్రమే అని టైపయింది. ‘అన్నియూ’ అన్నదాన్ని ‘అన్నియున్’ అనండి. ‘మహా ఆలము’ అనేది వైరిసమాసం. అక్కడ ‘ముందు ఘోరమౌ| నాలము...’ అనండి.
శ్రీపతి శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** పోచిరాజు సుబ్బారావు గారూ, మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. **** గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. **** మల్లెల సోమనాథ శాస్త్రి గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. **** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ‘వచ్చున్’ అన్నదాన్ని ‘ఒచ్చున్’ అన్నారు. అది దోషం. అయినా ‘కపిరథుడు’...?
కెఈశ్వరప్పగారి పూరణ ఆలము సేయ బోనిక యయాతికి రక్షణ నీదు శక్తి మ మ్మేలెడి రామ నే నభయమిచ్చిన వాలముశూలమౌను యే కాలము లెక్కసేయకను గాచెడిదేగద రామభక్తి పో జాల ముదావహంబగున?జంకుట లేదనె నాoజనేయుడే
ఆలము జేయ తలచె పో
రిప్లయితొలగించండిగాలము చేరువయిన దశ కంఠుడు మాయా
జాలము తో నైనను కర
వాలముతో నైనను గెలువంగలననుచున్
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
జాంబవంతుని యుద్బోధ - హనుమంతుని ప్రయాణం :
01)
________________________________
ఆలము లోన రాక్షసుల - నడ్డెడి వీరుడ వీవెగా మరిన్
కాలము లోనె వేగముగ - కంధిని దాటగ నీకె సాధ్యమౌ
జాలము లెన్నియున్న మరి - చక్కగ దిద్దెడు జాణ వౌటచే
వాలమె శూలమైన, నలు - వంకల లంకను సీత గాంచగన్
నీ సరి వేరులేరు మరి - నీసరి వీరుడ వీవె యౌటచే
వేసట జెందియున్న మన - వృక్షచరమ్ముల గావ నెంచ మా
యాసను దీర్చమంచతని - నచ్ఛపు రాజదె కోరినంతనే
హాసము చిందు చుండ నని - లాత్మజు డేగెను సీత జాడకై !
________________________________
కాలము లోనె = ఉన్న సమయము లోనె (సుగ్రీవుడిచ్చిన గడువు తీరకముందే)
కంధి = సముద్రము
జాలము = మోసము
జాణ = నేర్పరి
శూలము = ఆయుధము
అచ్ఛము = భల్లుకము
హాసము చిందు చుండ = ఉప్పొంగిన యానందముతో
ఆలమున గాచుకొ నుముర
రిప్లయితొలగించండికాలము నిక దీరె నీకు ,కర వాలముతోన్
జాలము జేయక జంపుదు
గూళు డ ,యో రావణుండ !కోరిక తీ రన్
ఆలముఁ జేయక వినుమా!
రిప్లయితొలగించండికాలము లెల్ల చెడుగనగ కఠినుడవై యీ
జాలము లో జిక్కుకొనకు
వాలము చాలు నినుఁ జుట్టి వైతును కడలిన్.
ఆలము= ఉపేక్ష
హనుమంతుడు రావణునితో అన్న పలుకులుగా...
ఆలమునందు దుష్టదనుజాధములన్ వధియించి మీకు స
రిప్లయితొలగించండిత్కాలముఁ గల్గఁజేసెదను ధైర్యమునున్ వహియింపుమమ్మ యా
జాలము క్రౌర్యసంయుతులఁ సంహరణంబొనరింతు నమ్మ మ
ద్వాలము దైత్యరాజయమపాశముగా రహియింపఁజేసెదన్.
జాలము = కపటము,
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
వసంత కిశోర్ గారూ,
మీ పూరణ, కొసరు పద్యము రెండూ బాగున్నవి. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శీఘ్రమే - సీఘ్రమే అని టైపయింది. ‘అన్నియూ’ అన్నదాన్ని ‘అన్నియున్’ అనండి. ‘మహా ఆలము’ అనేది వైరిసమాసం. అక్కడ ‘ముందు ఘోరమౌ| నాలము...’ అనండి.
చేటు కాలము రావణ! చేరువయ్యె
రిప్లయితొలగించండినాలమందున నీ చమూ జాలము నీల్గు
వానరుల వాలపు యురుల లోనఁ జిక్కి
శరణు వేడుము రాముని సంధిఁ గోరి
జాలము : సమూహము
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో ‘చమూజాలము నీల్గు’ అన్నచోట గణభంగం. ‘నీ చమూజాల మీల్గు’ అనండి.
ఆలమునన్ సీతన్ గొన
రిప్లయితొలగించండిగాలమ్మెట్లోర్చునె? దశకంఠుని మాయా
జాలముఁ జెల్లెనె? మారుతి
వాలముఁ గాల్చ, రఘురాము బాణము గూల్చెన్!
గుండా వేంకట సుబ్బా సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలము నందు రాక్షసులు యాతన నొందుచు నాంజనేయునిన్
రిప్లయితొలగించండిజాలము పన్ని పట్టుకొని జంకుచు జేర్చిరి రాజు చెంతకున్
కాలము మూడి రావణుడు కాల్చగ నెంచుచు నిప్పు బెట్టినన్
జ్వాలలు రేగగా హనుమ వాలము కాల్చెను లంకనంతటిన్
పూజ్య గురుదేవులకు నమస్సులు. తమరి సవరణకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిగురుతుల్యులకు నమస్సులు . మీ సలహాలకు కృతజ్ఞతలు .
రిప్లయితొలగించండిఉ. కాలము చెల్లెలే, తమకు కయ్యము తప్పదు సీఘ్రమే సుమా
వాలము కాల్చ , నీ హనుమ వానియనుంగులునేకమవ్వ మీ
జాలము లన్నియున్ ముగియు జాప్యము లేదిక, ముందుఘోరమౌ
నాలము పెళ్లునన్ చెలగు అందరు చావుట తధ్యమే కదా!
రిప్లయితొలగించండికాలము చెల్లెను నీకిక
నాలము లో గాచు కొనుము హా దశ కంఠా !
వాలము గలిగెడు వీరుల
జాలముతో వత్తు నిన్ను జంపుట కొఱకున్
ఆలమునన్ రావణ సుతు
రిప్లయితొలగించండిజాలముతో లక్ష్మణుండు సరిమూర్ఛిల్లన్
వాలము చరచుచు హనుమ స
కాలములో నౌషధముల కైగిరి తెచ్చెన్.
ఆలము నందున నిలచియు
రిప్లయితొలగించండివాలములు కలిగిన యోధ వానర సేనా
జాలము నసురుల జంపగ
కాలము దశకంఠు డందె కార్ముక హతిచే
కాలము తీరెను లంకకు
వాలముతో హనుమ గాల్చ భాసుర లీలన్
జాలము వానర యోధులు
అలము నందున దునుమరె యసురుల నెల్లన్
రావణు కాలము తీరగ
వే వాలము తోడ లంక వెలిగెను మంటన్
తా వానర జాలముతో
రావణు, నాలమున దునిమె రాముడు నెలమిన్
ఆలము మానుము రావణ
రిప్లయితొలగించండిజాలము జేయక శరణను జానకి నాధున్!
వాలము దాల్చిన దూతకు
కాలము చెల్లించ నీకు కపిరధుడొచ్చున్!!
శ్రీపతి శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వచ్చున్’ అన్నదాన్ని ‘ఒచ్చున్’ అన్నారు. అది దోషం. అయినా ‘కపిరథుడు’...?
పూజ్యగురువు గారికి వందనములతో..
రిప్లయితొలగించండిశ్రీరామునికి నానార్ధాలలో కపిరథుడు అని వుంది కావున ఆ పదాన్ని ఉపయోగించాను. దోషమున్నచో సవరణ తెలియచేయగలరు..
కెఈశ్వరప్పగారి పూరణ
రిప్లయితొలగించండిఆలము సేయ బోనిక యయాతికి రక్షణ నీదు శక్తి మ
మ్మేలెడి రామ నే నభయమిచ్చిన వాలముశూలమౌను యే కాలము లెక్కసేయకను గాచెడిదేగద రామభక్తి పో
జాల ముదావహంబగున?జంకుట లేదనె నాoజనేయుడే
కె. ఈశ్వరప్ప గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆలములోన వేగముగ నంతము నొందుచు నుండగా చమూ
రిప్లయితొలగించండిజాలము మానసంబునను సంధిలు ప్రాణ భయంబు నీకు పో
గాలము చేరువయ్యె నిను గాచెడు వారలు లేరు భూమిపై
వాలపు జీవులే చెఱచు పావన లంకను రాము నండతో