22, మార్చి 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1629 (దశకంఠున్ దునుమాడె నర్జునుఁ డనిన్ దారాశశాంకమ్మునన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దశకంఠున్ దునుమాడె నర్జునుఁ డనిన్ దారాశశాంకమ్మునన్.

21 కామెంట్‌లు:

  1. యశమున్ గోరుచు జేయగా సవనమే యారేడు మోదంబునన్
    వశమై రూపసి తారయావిడిది శోభన్ సంతరించంగనే
    కుశలం బాయెను సోమయా జిగని తాకోరన్ మనంబందునన్
    దశకంఠున్ దునుమాడె నర్జునుఁడనిన్ దారాశశాం కమ్మునన్

    హమ్మయ్య కిట్టించాను గానీ ఎలా ఉంటుందో ?

    రిప్లయితొలగించండి
  2. Rajaeshwaramma gaaroo meeru vruttaalanoo avee klishtamaina vaatini koodaa alavoakagaa vraasestunnaaru. Abhinandanalu!

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు
    ఏంరాయడమొ ఒకోసారి అన్వయం కుదరదుగా ? ఐనామీరందరు ఇంకా బాగా రాస్తారు గా ?గురువు గారి దయవల్ల ఇక్కడిదాకా వచ్చాను !
    ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  4. అక్కయ్యా,
    పద్యం వరకు బాగానే ‘కిట్టించారు’. సలక్షణంగా, చక్కని ధారతో సాగింది. కానీ సమస్య సమర్థంగా పూరింపబడలేదు.
    వృత్తరచనలోను ప్రావీణ్యాన్ని సాధించారు. ఇక మీరు తిరుగులేదు. ఈ ఊపులో కనీసం ఒక శతకమైనా వ్రాయండి. ఇబుక్కుగా ప్రచురించే భారం నాది.
    *****
    ఈరో జెందుకో మిత్రు లెవరూ ఇంకా పూరణలు మొదలు పెట్టలేదు. అలవోకగా వృత్తాలు రచించేవాళ్ళున్నారు. సమస్యలో క్లిష్టతకూడా ఉన్నట్టు తోచదు. చూద్దాం... ఇంకా సమయం ఉంది కదా!

    రిప్లయితొలగించండి
  5. శశమాంసమ్ము భుజించి మద్యమును విస్తారంబుగా గ్రోలి వ
    చ్చి శివాగారముచెంత ప్రాంగణముముందున్ దుష్టుఁడున్ మూర్ఖుఁ డై
    న శకారుండు వచించె నిట్టుల జనుల్ నవ్వంగ నిస్సిగ్గుగా
    దశకంఠున్ దునుమాడె నర్జునుఁడనిన్ దారాశశాం కమ్మునన్.

    (మిత్రులు మన్నించాలి. పూరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తెలిసింది ఈ సమస్యలోని క్లిష్టత. ముందుగా క్రమాలంకారంలో పూరిద్దామనుకున్నా, కాని శప్రాస ఇబ్బంది పెట్టింది. అక్కయ్యగా రన్నట్టు ఏదో విధంగా కిట్టించాను. మిత్రుల అభిప్రాయాలను కోరుతున్నాను.)

    రిప్లయితొలగించండి
  6. క్రమాలంకార పూరణము....

    కుశలం బొందగ దేవమానవులు కాకుత్స్థుండు దానేమి చే
    సె? శరంబుల్ జడివానగాఁ నెవఁ డెటన్ జింత్రంబుగా వేయునో?
    యశదూరుం డయె చంద్రుఁ డేకృతినిఁ దా నాశించి యా తారనున్?
    దశకంఠున్ దునుమాడె; నర్జునుఁ డనిన్; దారాశశాంకంబునన్.

    రిప్లయితొలగించండి
  7. మాస్టరు గారూ..చక్కని రెండు పూరణల్తో మాలో ఉత్సాహాన్ని నింపారు...

    రిప్లయితొలగించండి

  8. దిశలన్ కీర్తియె నిండ రాఘవుడు తా తీరైనదేం జేసెనో
    యశమున్ బొందిన దెవ్వడో గురువునే యాతండెటన్ జంపెనో
    శశియే తారను బట్టు గాథ దెదియో సారించుచున్ జెప్పగా
    దశకంఠున్ దునుమాడె; నర్జునుఁ డనిన్; దారాశశాంకంబునన్.

    రిప్లయితొలగించండి
  9. విశదంబేయదిఏమిటందువటి?ప్రావీన్యుండునూహించకే
    దశమాంకంబగునాటకానగలప్రాధాన్యుల్,నిదానించకన్
    పశువుల్వోలెను.వేషభూషితులుకోపావేశభావంబునన్
    దశకంఠన్దునుమాడెనర్జనుడనిన్ దారాశశాంకమ్మునన్|
    ----------
    నాటకకళాకారులఆవేశం,ఆదారముతోపూరణం

    రిప్లయితొలగించండి
  10. కృశియించెన్ సతి సీత రాముడువిముక్తిన్ జేసె నేరీతి యా
    శశిమౌళ న్నెదిరించి పాశుపతమున్ సాధించె నెవ్వాడు యా
    నిశకాంతున్ వరియించుదేవగురుపత్నీగాధ నేమందురో
    దశకంఠున్ దునుమాడె నర్జునుఁడనిన్ దారాశశాంకమ్మునన్

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. యశమున్ బొందగ కౌశలేయుడెవరిన్ మాయించెనోజెప్పుమా?
    వసుషేణున్ హతమార్చి యుద్ధమున తా వాపోవు వారెవ్వరో ?
    శశి యాచార్యుని గాదిలిన్ వలచు నా సందేశ మే గాధయో?
    దశకంఠున్ దునుమాడె, నర్జునుఁ డనిన్, దారాశశాంకంబునన్!!!

    రిప్లయితొలగించండి
  13. నమస్కారములు
    నిజమే .అన్వయించడం సరిగా కుదరటల్లేదు .ముందసలు నాకుతెలిస్తేగా ?
    అవునూ తారను వెనక్కు తీసుకెడతానని బృహస్పతి అడిగినప్పుడు కొంత ఘర్షణ జరిగిందికానీ మధ్యలో దశ కంఠుడికీ అర్జునిడికీ ఎందుకో నాకర్ధం కాలేదు .అదన్నమాట అసల్ సంగతి

    రిప్లయితొలగించండి
  14. అశిరున్ చేసెను జానకీవిభుడు కాయంబైన కయ్యమ్ములో
    వశమున్ పొందెను హస్తినాపురపు భూభాగమ్మునెవ్వారనిన్?
    శశియున్ తారల ప్రేమగాథయన భాసంబొందె నేగాథలో?
    దశకంఠున్ తునుమాడెనర్జునుఁడనిన్ తారాశశాంకమ్మునన్

    రిప్లయితొలగించండి
  15. గురువుగారూ మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి.

    మిత్రులు కూడా అందమైన పూరణలను అలవోకగా చేశారు.

    రిప్లయితొలగించండి
  16. ముందుగా నా పూరణలను ప్రశంసించి నేనుకూడా పద్యాలు వ్రాయగలనన్న నమ్మకాన్ని నాకు కలిగించిన మిత్రులు.... గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, మిస్సన్న గారికి ధన్యవాదాలు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఏం జేసెనో’ వ్యావహారికం. ‘గాథ+అది’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘గాథ యెదియో’ అనండి.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ పద్యాలలో ముఖ్యమైన దోషం... టైపుపొరపాట్లు. పదాలమధ్య వ్యవధానం (స్పేస్) ఉంచండి. పద్యం చదువుకొనడానికి సౌలభ్యంగా ఉంటుంది.
    *****
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘రీతి నా, ... ఎవ్వాడొ యా’ అనండి. ‘నిశాకాంతుడు’ సరియైన ప్రయోగం.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఉభయప్రాసము పేర స-ష లకు ప్రాసమైత్రి ఉన్నది కాని, స,శ లకు లేదు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. మ.పశులైద్రౌపదినీడ్చకౌరవులుకోపావేశుడైపార్దుడే
    కృశియుంచెన్నభిమన్యుజంపకృపద్రోణకర్ణదుర్యోధనుల్
    వశసిం జేయుదువీరినందరినిభీభత్సాకృతిన్ యంచుతా
    దశకంఠున్ దునుమాడెనర్జునుఁడనిన్ దారాశశాంకమ్మునన్

    note: వశసిం= వధించడం ,చంపడం

    రిప్లయితొలగించండి
  18. క్రమాలంకార పూరణము...
    విశదంబై రఘు రాముడా క్షణమె నిర్వీర్యంబొనర్చంగనా,
    దిశమార్చన్ హరి, జ్ఞాన భాగ్యమున దా ధీరుండుగా దూకడే,
    వశుడై తారను గూడె చందురుడు తద్భావంబు తప్పైనయున్,
    దశకంఠున్ దునుమాడె,నర్జునుఁడనిన్, దారాశశాంకమ్మునన్

    రిప్లయితొలగించండి
  19. వశమున్ చేసియు రామచంద్రు డనిలో బాధించె నెవ్వాడినిన్?
    కసితో సైంధవు నేమిజేసె? నెవడో? కాపాడకే దేనినిన్?
    కొసరాజే సినిమాను వ్రాసెనహహో గంభీరమౌ పాటలన్?
    దశకంఠున్; దునుమాడె; నర్జునుఁ; డనిన్; దారాశశాంకమ్మునన్ :)

    స, శ, ప్రాసను "ప్రభాకర ప్రాస" అనెదరు :)

    రిప్లయితొలగించండి