25, మార్చి 2015, బుధవారం

సమస్యా పూరణము - 1631 (సున్న మున్నఁ జాలు నన్న మేల?)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
సున్న మున్నఁ జాలు నన్న మేల?

26 కామెంట్‌లు:

  1. ఇల్లు కొనగనెంచి ఇల్లాలితోడను
    గదులనన్ని బాగ కలయజూచి
    కట్టుదలనుగాక గదిగోడలకు మంచి
    సున్నమున్న చాలునన్నమేల?(చాలును +అన్న+మేల)

    రిప్లయితొలగించండి
  2. సన్నమవ్వ మీరలన్నము మానుడు
    నీరసంబు రాదు సారమెఱుగు
    కాస్త విటమినులును క్యాల్షియంబనబడు
    సున్న మున్నఁ జాలు నన్న మేల?

    రిప్లయితొలగించండి
  3. విడెము కోరి తినగ వెలదుల యిండ్లకై
    సున్న మున్నఁ జాలు నన్న మేల
    పండి తుండు తుదకు పరవశం బునబోవ
    ధూర్జ టనగ నతని దోష మేమి ?

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు. ముఖ్యంగా పదాల విరుపు ప్రశంసనీయంగా ఉంది.
    *****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అక్కయ్యా,
    పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధూర్జటి+అనగ’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘ధూర్జటి యన’ అనండి.
    కాని ధూర్జటికి, సున్నానికి సంబంధం ఉన్న కథ ఏమిటో నాకైతే తెలియదు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  5. బకాసురుండా ! ఎవ్వాడు వాడు
    చావ కొట్టెద వాడిని ఈ చేతుల తోడ
    నన్నము నేను ఆరగించెద ! వాడికి
    సున్న మున్న జాలు నన్న మేల ?



    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారూ,
    మంచి భావాన్ని అందించారు. దానికి నా పద్యరూపం....

    బకుఁడ? వాఁ డెవండు బండె డన్నము వాని
    కేల? నేనె తిని వధింతు వానిఁ
    బ్రజకు కీడుసేయువాఁడు మృత్యు వనెడి
    సున్న మున్నఁ జాలు నన్న మేల?

    రిప్లయితొలగించండి

  7. ఆకు వక్క తోడ నంత సున్నము గలుప
    విడెయు యగును గాని వినక నీవు
    పోక వలదు నాకు నాకులె నమిలెద
    సున్న మున్నఁ జాలు నన్న, మేల?

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘విడెయు(?) యగును గాని’ అన్నచోట ‘విడె మగు నటన్న’ అంటే బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  9. పుష్టికై తనువున బొమిక లోపల
    సున్నమున్న చాలు, నన్నమేల
    జొన్న రొట్టెలున్న, చుక్కకూరయు పప్పు
    కలిపితిన్న కలుగు కరము శక్తి

    రిప్లయితొలగించండి
  10. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘బొమికల లోపల’ అంటే గణదోషం తొలగిపోతుంది. బహుశా టైపాటు కావచ్చు.

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  12. సున్నమున్న జాలునన్నమేలనరాదు
    సున్నమింటిగోడ లన్నివెల్ల
    వేయు నన్న మింక కాయమున బలము
    పెంపుజేయునింక పెరుగుదలను

    రిప్లయితొలగించండి
  13. మిత్ర తత్వ మున్నమేటిగ తగుమన
    సున్న మున్న|"జాలునన్నమేల?
    జార్జి|యింటతిండి చక్కగనరుగకే
    మరలతిండిదినుట మంచిదేన.

    రిప్లయితొలగించండి
  14. రాజధాని కొరకు ఱాతి మేడలు గట్ట
    పంట పొలము లందు బడెను రాళ్లు
    అన్నపూర్ణ వంటి యాంధ్ర మాతకు నేడు
    సున్న మున్న చాలు నన్న మేల ?

    రిప్లయితొలగించండి
  15. ఫాస్టు ఫుడ్డు దినుచు పరుగెత్తు కాలమ్ము
    దిబ్బరొట్టి రుచిని దెలియ గలరె ?
    పాని పూరి గనగ పరమాన్న మెక్కునా?
    సున్న మున్న చాలు నన్న మేల ?

    రిప్లయితొలగించండి
  16. సున్న మున్న జాలు నన్న మేల ?యనియా
    సామి ! నీదు ప్రశ్న సరియె యౌను
    సున్న మున్న తీర దెన్నగా నాకలి
    యన్న మునకు సాటి సున్న మగునె ?

    రిప్లయితొలగించండి
  17. మగవారలిద్దరు కలసి కాపురము చేసె సంస్కృతి విషయముగా....

    'మున్న' 'చిన్న' కూడి మొగవారలైననూ
    కలసి మెలసి చేయఁ గాపురంబు
    'చిన్న' బ్రతుకు కేమి?చేరియుండగ మన
    సున్న 'మున్న' జాలు నన్న, మేల?

    రిప్లయితొలగించండి
  18. భోజనమ్ము జేసి పొద్దుపుచ్చు కొరకు
    చేతిలో పొగాకు చిదిమి నలిపి
    పెదవి క్రింద వేసి పెట్టెడు వానికి
    సున్న మున్న జాలు నన్న మేల?

    రిప్లయితొలగించండి
  19. పొగాకును అరచేతిలో తీసుకొని సున్నంతో కలిపి నలిపి ఆ పొగాకు పొడిని పెదవి క్రిందపెట్టుకోవటం కొంతమంది అలవాటు.

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ, దానికి ఆధారమైన భీమకవి పద్యం రెండూ బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. తనను మెచ్చియిచ్చు తాంబూలమే చాలు
    నన్నమింతలేక,నవని నిజము
    నాకు,వక్క,తోడ,నందింప తములాన
    సున్నమున్న చాలు నన్నమేల?

    ఇల్లు రమ్యమైన నింపౌను సంఘాన
    నన్నమదియు లేక యంబలున్న
    తెల్లగాను నిల్లుదీర్పగా వెల్లకున్
    సున్నమున్నచాలునన్న మేల?

    తెలియదెవరికైన తిన్నదినేదియో
    యన్నమైన లేక యంబలైన
    తానువెన్క గొనెడు తాంబూలమందున
    సున్నమున్న జాలునన్నమేల?

    రామదాసు తాను రాముని గుడికినై
    వెల్ల వేయుటదియ వేడుకనియె.
    భోజనంబు మానె,పూయగా గుడికిని
    సున్నమున్న జాలునన్నమేల?

    రిప్లయితొలగించండి
  22. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీ సూచన తో...చిన్న సవరణతో

    ఆకు వక్క తోడ నంత సున్నము గలుప
    విడెమనంటి గాని వినక నీవు
    పోక వలదు నాకు నాకులె నమిలెద
    సున్న మున్నఁ జాలు నన్న, మేల?

    రిప్లయితొలగించండి
  23. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మూడవ పూరణలో ‘తిన్నట్టి దేదియో’ అనండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి