26, మార్చి 2015, గురువారం

సమస్యా పూరణము - 1632 (దారము లేకుండ పుష్పదామము లల్లెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
దారము లేకుండ పుష్పదామము లల్లెన్.

21 కామెంట్‌లు:

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

ఏరెను పూజించగ నా
భారతి భక్తిన్ సుమములు పలురకముల బృం
దారముగా నే చెత్తచె
దారము లేకుండ పుష్పదామము లల్లెన్

మిస్సన్న చెప్పారు...

Bhesh!

sailaja చెప్పారు...

శౌరిని బూజించదలచి
వారిజలోచన హరువగు ఫల్యంబులతో
చారిమముగ గట్టుచు మం
దారము లేకుండ పుష్ప దామము లల్లెన్ !!!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చారువు పలికెను ప్రియముగ
దారము లేకుండ పుష్ప దామము లల్లెన్
కోరిన దెచ్చెద నీకని
తారను గనినంత ముదము తన్మయ మందున్

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*****
రాజేశ్వరి అక్కయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

subbarao చెప్పారు...

ఔరా ! యెంతటి నేర్పరి ?
దారము లేకుండ పుష్ప దామము లల్లెన్
వారికి జేతును నతులను
వారెవరో తెలుపుడా ర్య !వడివడి గమఱి న్

A.Satyanarayana Reddy చెప్పారు...

ఆరాము నుండి చేకొని
పోరిగుడికినేగితాను పొందిక తోడన్
శౌరికి ప్రియముగ చెత్త చె
దారము లేకుండ పుష్ప దామము లల్లెన్

Unknown చెప్పారు...

మారెడిమార్పులుయెన్నో
జేరిన?దైవంబుగూర్చుచిత్రముగనగా?
కారణమెరుగనిచెట్టుకు
దారము లేకుండ పుష్పదామములల్లెన్
----------

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

హారముఁ గీయగ మరువన్
శ్రీరాముని కంఠమందు సింగారింపన్
మారుతి కుంచెను గదుపుచు
దారము లేకుండ పుష్పదామము లల్లెన్!

Unknown చెప్పారు...

హారముకాధా రంబగు
దారములేకున్న?నిలచు తగునేర్పరిగా
కోరియు వేసినచిత్రము
దారములేకుండ పుష్ప దామము లల్లెన్

బొడ్డు శంకర్ చెప్పారు...

మీరిన భక్తి గలిగి గురు
వారము నేడనుచు సాయి భక్తుండొకడున్
తీరికగా విరులకు చే
దారములేకుండ పుష్పదామములల్లెన్

చేదారము = నష్టము

Unknown చెప్పారు...

వారణమెరుగని భక్తిని
తోరపుగుణుడగు వికుంఠు తుష్టుగ గొలిచెన్,
సారముగాగను పోతన
దారములేకుండ పుష్పదామములల్లెన్

సారపు సంగీతమునను
ధీరుని రాముని పొగడుచు తిరమగు కృతులన్
ధీరుడు త్యాగయ యిడెగద
దారము లేకుండ పుష్పదామములల్లెన్

తోరపు నుత్పలమాలిక
ధీరుడు పెద్దన్నచెప్పి తిరముగ సభలో
ధారగ,పితామహుండయి
దారము లేకుండ పుష్పదామములల్లెన్

తీరిచె వేంకట పతిపయి
ధీరుడు నన్నయ్య కృతుల తేటగుతెనుగున్
సారపు పదముల పాడడె
దారము లేకుండ పుష్పదామములల్లెన్

Unknown చెప్పారు...

మారిన నైపుణ్యంబుల
తీరుగ గణనంపు యంత్ర తెరపై యొకడే
తోరణముల చిత్రించుచు
దారము లేకుండ పుష్పదామములల్లెన్

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చేరుచు కోసిన పూవుల
తీరగు కనకాంబరమ్ము తెల్లని మల్లెల్
పేరుగ గ్రుచ్చుచు సతి మం
దారము లేకుండ పుష్పదామములల్లెన్.

మిస్సన్న చెప్పారు...

దారము కొరకై వెదకిన
దా రమ, లభియించ బోక యరటి తడపతో
తీరుగ నందము చిందగ
దారము లేకుండ పుష్పదామము లల్లెన్.

మిస్సన్న చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘మార్పులు+ఎన్నో’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. అక్కడ ‘మార్పు లవెన్నో’ అనండి.
*****
గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
భేష్! చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించించి. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు.

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

బారుగ మాన్సంపంగుల
నేరుపుతో కాడ కాడ నిమ్మళముంగా
తోరమువలె ముడివేయుచు
దారము లేకుండ పుష్పదామము లల్లెన్

Zilebi చెప్పారు...



కారము లేక రసంబున్,
సారము లేని కవనమ్ము చక్కర లేకన్
క్షీరాన్నము వండుచు,హా!
దారము లేకుండ పుష్పదామము లల్లెన్

జిలేబి

G P Sastry (gps1943@yahoo.com) చెప్పారు...

కర్ణాటకంలో సోనియ, 2018

పోరాటములో నోడియు
వైరుల వైరులను కూడి పడతియె గెలిచెన్
ఔరా! ఇదియెట్లన్నన్
దారము లేకుండ పుష్పదామము లల్లెన్